రుపాయకొక ఎకరా భూమి తీసుకున్న కంపెనీ ఉద్యోగాల్లో స్థానికుల వాట ఎంత?
x

రుపాయకొక ఎకరా భూమి తీసుకున్న కంపెనీ ఉద్యోగాల్లో స్థానికుల వాట ఎంత?

కంపెనీల ఉద్యోగాల్లో 75 శాతం వాట స్థానికలకు ఇవ్వాలన్న గత ప్రభుత్వ జీవొని ఈ ప్రభుత్వం అమలుచేస్తుందా?


గత కొన్ని సంవత్సరాలుగా, రాష్ట్రప్రభుత్వం, BSO24 ను GO No 571 dated 14-9-2012 ను, సుప్రీమ్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా, విలువైన ప్రభుత్వ భూములను, అతి చవుక ధరలకు ప్రైవేట్ కంపెనీలకు ముట్టపెట్టడం జరుగుతున్నది.

ముఖ్యంగా, రాష్ట్రప్రభుత్వం GOMs No 32 dated 16-8-2025 ద్వారా, IT కంపెనీల కోసం ప్రవేశ పెట్టిన లిఫ్ట్ విధానం ఆధారంగా, IT కంపెనీలకు ఎంత విస్తీర్ణమైన భూమిని అయినా, కేవలం 99 పైసలకు మాత్రమే ధారాదత్తం చేయడం జరుగుతున్నది. అటువంటి ప్రజా ప్రయోజనాలకు, సుప్రీమ్ కోర్టు ఆదేశాలకు విరుద్ధమైన విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని, రాష్ట్రప్రభుత్వం సమర్ధించడానికి కారణం, ఆ కంపెనీలు స్థానికులకు ఉద్యోగావకాశాలు కలిగిస్తామని నోటిమాటగా ఇచ్చిన హామీలు మాత్రమే.

ఉదాహరణకు, ఇటీవల ప్రభుత్వం కొన్ని IT కంపెనీలకు, విశాఖపట్నంలో కేటాయించిన భూముల వివరాలు, ఆ భూముల మార్కెట్ విలువ, ఉద్యోగావకాశాలు ఇస్తామని సూచించిన హామీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:


GO

IT కంపెనీ

భూమి వివరాలు

మార్కెట్ విలువ

హామీ ఇచ్చిన ఉద్యోగావకాశాలు

GOMs No 7

dt 21-4-2025

TCS

21.16 ఎకరాలు

(Rushikonda)

Rs 900 కోట్లు

12,000

GOMS No 2 dt

1-7-2025

Cognizant

22.19 ఎకరాలు

(మధురవాడ)

Rs 900 కోట్లు

8,000

GOMs No 26 dt

1-8-2025

ANSR Global

10.29 ఎకరాలు

(రుషికొండ)

Rs 450 కోట్లు

10,000

GOMs No 72 dt

18-12-2025

గూగుల్ - అదానీ

480 ఎకరాలు

(తర్లవాడ, ఆనందపురం మండలం)

Rs 2,400 కోట్లు

20,000-30,000


ప్రభుత్వం గత కొన్ని నెలలుగా విలువైన భూములను ఆ విధంగా ఉదారంగా ఇచ్చిన కంపెనీలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

ఏడాదికి 10,000 కోట్లరూపాయల నికర లాభాలు గణించే టిసిఎస్ కంపెనీ, ఒకవైపు రాష్ట్రప్రభుత్వానికి, స్థానికంగా 12,000 ల ఉద్యోగాలు కలిగిస్తామని హామీ ఇచ్చినా, దేశంలో ఇతర నగరాల్లో, ఆ కంపెనీ, అప్పుడే 12,000 ఉద్యోగులను పని లోనించి తొలగదీసింది. ఇంకొందరిని కూడా ఉద్యోగాలలోనించి తొలగించే అవకాశం ఉంది

ఇతర ఐటి కంపెనీల పరిస్థితి ఇదే విధంగా ఉందనే వార్తలు మీరూ మీ అధికారులు చూసే ఉంటారు

అటువంటి నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అధికంగా లాభాలు గణించే అటువంటి కంపెనీలకు, కేవలం నోటిమాటగా ఉద్యోగావకాశాలు కలిగిస్తామని ఇచ్చిన హామీల ఆధారంగా, ఎంతో విలువైన ప్రభుత్వ భూములను ఎందుకు కేటాయించాలి?

అటువంటి కంపెనీల వలన స్థానిక ప్రజలు ఏ విధంగా లాభ పడతారు;

ప్రభుత్వం ఆ కంపెనీలతో రాతపూర్వకంగా ఎన్ని ఉన్నత స్థాయి ఉద్యోగాలు, ఎన్ని మధ్యస్థాయి ఉద్యోగాలు ఎన్ని ఇతర ఉద్యోగాలు, స్థానికులకు కలిగిస్తారు, అందుకు అనుగుణంగా ఆ కంపెనీలు స్థానిక యువతకు తగిన శిక్షణా సౌకర్యాలు ఏ విధంగా కలిగిస్తారు అనే విషయాలమీద ఒప్పందాలు చేసి ఆ ఒప్పందాలను ప్రజలముందు పెట్టవలసిన అవసరం ఉంది.

ఆ విషయంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో కనీసం 75 శా ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే నిబంధన AP Employment of Local Candidates in the Industries/Factories Act, 2019

లో ఉందని ప్రభుత్వం గుర్తించాలి. గత ఏడు సంవత్సరాలుగా ఆ నిబంధనను ప్రభుత్వాలు అమలుచేయకపోవడం రాష్ట్రప్రజల దుర్భాగ్యమని చెప్పాలి. ఆ చట్టంలో ఈ కింద సూచించిన విధంగా స్పష్ఠముగా చెప్పబడింది.

3 వ సెక్షన్: Appointment of Local Candidates - Any Industry/ Factory/ Joint Venture and project taken up even under PPP mode shall appoint/ engage not less than seventy-five percent (75%) of the employment with local candidates:

Provided that where qualified/ suitable local candidates are not available, the industry/factory within 3 years with active collaboration of Government shall take steps to train and engage local candidates:

Provided further that the existing Industries/Factories/Joint Ventures

and projects taken up under PPP mode shall also ensure 75% employment to the local candidates within a perion of three years from the date of commencement of this Act

అంటే, విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు పొందిన ప్రైవేట్ కంపనీలు తప్పనిసరిగా, స్థానికులకు అవసరమైతే శిక్షణ ఇచ్చి, కనీసం 75% ఉద్యోగాలివ్వడం అవసరం. ఆ నిబంధనను ఉల్లంఘించిన వారిమీద చర్యలు తీసుకోవాలి.

ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం ఆ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి, స్థానిక ప్రజలకు ప్రైవేట్ కంపనీ వ్యవస్థలలో ఉద్యోగాలు ఇప్పించాలని నా విజ్ఞప్తి.

ముఖ్యంగా, విశాఖలో, ఆనందపురం మండలంలో, తర్లవాడ గ్రామంలో, గూగుల్-అదానీ కంపెనీలకు, ప్రభుత్వం 480 ఎకరాల భూమిని కేటాయించింది. కేటాయించిన భూముల్లో, కొన్ని ప్రైవేట్ భూములు. ఆ భూముల్లో ఐదు దశాబ్దాలకింద, అప్పటి ప్రభుత్వం సుమారు 50 మంది దళితులకు, 100 ఎకరాల ప్రభుత్వ భూమిని డీ పట్టాల ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ 50 మంది దళితులు, ఆ డీ పట్టా భూమి మీదనే ఆధారపడి, జీవనోపాధి పొందుతున్నారు. జిల్లా రెవిన్యూ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయినుంచి వస్తున్న ఒత్తిడి తో, ఆ దళితుల భూములను బలవంతంగా సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులు సూచించిన సమాచారం ప్రకారం, వారికి కలిగే నష్టపరిహారం ఎకరానికి 50 లక్షల రూపాయలు మాత్రమే. కాని, రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖవారు ప్రచురించిన విలువల ఆధారంగా, ఆ గ్రామంలో ఎకరం భూమి విలువ 2 కోట్ల రూపాయలనుంచి, 5 కోట్ల రూపాయలవరకు ఉండగలదు

రాష్ట్రప్రభుత్వం, ఏటా 3,14,000 కోట్ల రూపాయల నికర లాభాలు గణించే అమెరికా కంపెనీ అయిన గూగుల్ కంపెనీకి, ఆ కంపెనీ ప్రాజెక్టులో భాగస్వామి అయి, ఏటా 90,000 కోట్ల రూపాయల లాభాలు గణించే అదానీ కంపెనీకి, ఎంతో చవకగా 480 ఎకరాల భూమిని ధారాదత్తం చేయడం కోసం, ఆ భూములమీద దశాబ్దాలుగా ఆధారపడుతూ ఉన్న చిన్నకారు రైతులు, ముఖ్యంగా 50 మంది దళిత కుటుంబాలను నిర్వాసితులు చేయడం బాధాకరమైన విషయం. కనీసం వారందరికీ, 2013 భూసేకరణ చట్టం కింద, మార్కెట్ ధర ఆధారంగా, ఉదారంగా నష్టపరిహారం ఇవ్వాలి.

2013 చట్టం కింద, భూమి మీద సాగు చేస్తున్న వారికి చట్ట ప్రకారం పునరావాసం కలిగించకుండా, నిర్వాసితులు చేయకూడదు.

ఆ చట్టం కింద అధికారులు, ముందుగా 4వ సెక్షన్ కు అనుగుణంగా, ఒక స్వతంత్ర సంస్థ చేత, సామాజిక ప్రభావ అధ్యయనం చేయించి, స్థానికంగా భూమి మీద ఆధారపడుతున్న కుటుంబాల ముందు ఆ రిపోర్టును పెట్టి, వారి అభిప్రాయాలను సేకరించాలి. అటువంటి ప్రక్రియ జరగకపోతే, ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ కంపెనీకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గూగుల్, అదానీ కంపెనీలకు దాసోహం పలకకుండా, చట్టంలో సూచించిన ప్రక్రియను తూచా తప్పకుండా పాటించాలని నా విజ్ఞప్తి.

అదే కాకుండా, మీద ప్రస్తావించిన దళితులు, ప్రత్యామ్నాయం లేక, వారిభూముల విషయంలో, రాష్ట్ర హై కోర్టును, WP No 26430/2025 ద్వారా ఆశ్రయించవలసి వచ్చింది. 24-9-2025 న, ఇచ్చిన తీర్పులో, హై కోర్టువారు, వారిని చట్ట ప్రక్రియకు విరుద్ధంగా, ఏవిధంగా నిర్వాసితులు చేయకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే, వారిపట్ల ప్రభుత్వం ఉదాసీనతతో ప్రవర్తించాడని వ్యక్తమవుతున్నది.

గూగుల్ కంపెనీ అదే డేటా సెంటర్ ప్రాజెక్టును, అమెరికాలో ఇండియానాపోలిస్ లో పెట్టడానికి ప్రయత్నించిన సందర్భంలో, ఆ ప్రాంత స్థానికులు ప్రతిఘటించడం జరిగింది. అటువంటి డేటా సెంటర్ల ప్రభావం విశాఖపట్నం జలవనరులమీద, ఇతర ప్రకృతి వనరులమీద అధికంగా ఉంటుంది. అటువంటి కంపెనీలు, మన దేశంలో వనరులను చవకగా ఉపయోగిస్తూ, ఉద్యోగులకు తక్కువ వేతనాలిచ్చి, లక్షలాది కోట్ల రూపాయల లాభాలు గణించే కంపెనీలని ప్రభుత్వం, ప్రజలు గుర్తించాలి. పైగా గూగుల్ వంటి అమెరికా కంపెనీలు, ఆ దేశంలో భద్రతా విభాగాలతో పనిచేసేవారు. వారి చేతిలో, మన దేశభద్రత తో సంబంధించిన సమాచారాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసమో కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి.

నేను ఈ కింద సూచించిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి:

1. ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా AP Employment of Local Candidates in the Industries/Factories Act ను తూచా తప్పకుండా అమలుచేసి, స్థానికులకు, అవసరమైతే ఆ కంపెనీలచేత శిక్షణా సౌకర్యాలు కలిగింపచేసి, కనీసం 75% ఉద్యోగావకాశాలు కలిగించాలి

2. పరిశ్రమల కారణంగా నిర్వాసితులయ్యేవారికి, ముందస్తుగా పునరావాస సౌకర్యాలు కలిగించి, 2013 భూసేకరణ చట్టం 4వ సెక్షన్ కు అనుగుణంగా వారిని సంప్రదించి, వారికి ఉదారంగా నష్టపరిహారం ఇవ్వడం అవసరం

3. ప్రకృతి వనరులమీద ప్రభావం కలిగించే కాలుష్యకరమైన పరిశ్రమల బదులు, ప్రభుత్వం ప్రజలను భాగ్యస్వాములుగా చేసి, వ్యవసాయ రంగం, మత్స్యపరిశ్రమ, పాడి పరిశ్రమలలో సహకార సంఘాల ద్వారా అభివృద్ధి పథకాలను చేపట్టాలి


(ఇది మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి చంద్రబ ాబునాయుడికి రాసిన లేఖ)

Read More
Next Story