
‘హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై లోతైన అధ్యయనం జరగాలి’
‘‘పర్యావరణం, రాష్ట్రానికి ఎంత మేర లాభం ఉంటుందన్న విషయాలను ఇంకా పరిశీలించాల్సి ఉంది’’ - వీడీ సతీశన్
కేరళ(Kerala)లో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పర్యావరణానికి, రాష్ట్రానికి లాభదాయకంగా ఉంటే కాంగ్రెస్(Congress) పార్టీ, యూడీఎఫ్(UDF) వ్యతిరేకించదని శాసనసభ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్(Satheesan) పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్ట్ నివేదిక (DPR)ను అధ్యయనం చేసిన తర్వాతే తాము దాన్ని వ్యతిరేకించామని, శ్రీధరన్ ప్రతిపాదనకు ఇంకా లోతైన అధ్యయనాలు అవసరమని అన్నారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మేం ఏ హైస్పీడ్ రైలు(High speed train) ప్రాజెక్టుకూ వ్యతిరేకం కాదు. అలాంటి ప్రాజెక్ట్ రావాలి. కానీ పర్యావరణ అధ్యయనాలు జరగాలి. అలాగే అది కేరళకు ఆర్థికంగా సాధ్యమయ్యే విధంగా ఉండాలి” అని సతీశన్ మీడియాతో అన్నారు.
‘లోతైన అధ్యయనం అవసరం..’
కేరళకు వేగవంతమైన రవాణా పరిష్కారాలు అవసరం. అలాగే మౌలిక వసతుల అభివృద్ధి కొనసాగాలి. ఇలాంటి ప్రాజెక్ట్ కేంద్రం తీసుకువచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినా మేం అభ్యంతరం చెప్పం. అయితే ప్రాజెక్టు కేరళలో పర్యావరణ విపత్తుకు దారి తీస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని గ్రహించాం. అందుకే మేం అభ్యంతరం చెప్పాం” అని చెప్పారు సతీశన్.

