బైడెన్ నోట కొత్త మాట.. ఏం అంటున్నారంటే..
x

బైడెన్ నోట కొత్త మాట.. ఏం అంటున్నారంటే..

డెమొక్రాటిక్ పార్టీ నుంచి మరోమారు తానే అభ్యర్థిగా ఉంటానని చెప్పిన బైడెన్.. విలేకరులతో మాట్లాడిన ఓ సందర్భంలో ట్రంప్ ను ఓడించే అభ్యర్థి ఉంటే తాను...


ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలోని నుంచి జో బైడెన్ తప్పుకోవాలని డెమొక్రాట్లు రోజురోజుకి ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనలను తాను వ్యతిరేకిస్తున్నట్లు మరోమారు తానే పోటీకి దిగుతానని బైడెన్ చెబుతూ వస్తున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం విలేకరులతో మాట్లాడుతూ .. తాను పోటీ నుంచి వైదొలిగే అవకాశం ఉందని కొన్ని క్లూలు వదిలారు.

సొంత పార్టీ నుంచి రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతూ రావడం వల్ల బైడెన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా మీడియాతో ఆయన మాటలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వివరించారు. మొదట తానే ట్రంప్ ఓడిస్తానని గట్టిగా వాదించారు.

యాంకర్ జార్జ్ స్టెపానో పౌలోస్ అడిగిన కొన్ని ప్రశ్నలకు అధ్యక్షుడు బైడెన్ ఎప్పటిలాగే తడబడ్డారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మరోమారు తానే గెలుస్తానని, ఏ రాజకీయ నాయకుడు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండరని, తాను కాకుండా ట్రంప్ ను ఓడించే వ్యక్తి ఉంటే పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చూచాయగా అంగీకరించినట్లు తెలుస్తోంది. గత వారం జరిగిన నాటో సదస్సులో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో జరిగిన మీటింగ్ లో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది.

బైడెన్‌కి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది
ఫిబ్రవరిలో బైడెన్ కు నిర్వహించిన వివిధ శారీరక పరీక్షలో ఫిట్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రెసిడెన్షియల్ డాక్టర్ కెవిన్ ఓ'కానర్ మాట్లాడుతూ, బిడెన్ "అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడానికి ఫిట్ గా ఉన్నాడు." ఒక నెల కంటే ముందు జరిపిన నరాల పరీక్షలో స్ట్రోక్, మల్టిపుల్ స్క్లెరోసిస్ లేదా పార్కిన్సన్స్ సంకేతాలు కనిపించలేదని ఆయన వివరించారు. అయితే తాజాగా జరిపిన వైద్య పరీక్షలో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన తన సమావేశాలను తక్షణమే రద్దుచేసుకున్నారు.
పెరుగుతున్న ఒత్తిడిలు..
కాలిఫోర్నియా డెమొక్రాటిక్ ప్రతినిధి ఆడమ్ షిఫ్ మాట్లాడుతూ.. బైడెన్ తన పోటీని విరమించుకోవాలని కోరారు. ఆగష్టు నెలలో డెమొక్రాట్ ల నుంచి అధికారిక అభ్యర్థిగా నామినేట్ కావడానికి వర్చువల్ మీటింగ్ జరగనుంది. ఇందులో కొత్త వ్యక్తి పేరు ప్రతిపాదించాలని డెమొక్రాట్లు కోరుతున్నారు.
ట్రంప్ తో జరిగిన చర్చల్లో బైడెన్ తడబడటంతో దాదాపు 20 మందికి పైగా కీలక పార్టీ నేతలు బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని నిలబెట్టాలని కోరుతున్నారు. మరో డెమొక్రాటిక్ ప్రతినిధి మాట్లాడుతూ.." దేశవ్యాప్తంగా ఉన్న డెమొక్రాట్లలో, దాదాపు మూడింట రెండొంతుల మంది బిడెన్ పక్కకు తప్పుకుని, తన పార్టీ వేరే అభ్యర్థిని నామినేట్ చేయాలని కోరుతున్నారు.
Read More
Next Story