
హరి కృష్ణారెడ్డి అమెరికాలో ఎందుకు మిస్సయ్యాడు
అమెరికాలోని అలాస్కా ప్రాంతాన్ని చూసి ఎంజాయి చేసేందుకు వెళ్లిన అద్దంకి యువకుడు అదృశ్యమయ్యాడు.
క్రిస్మస్ సెలవులను ఎంజాయ్ చేసేందుకు అలాస్కాలోని మంచు కొండల అందాలను చూసేందుకు వెళ్లిన ఒక తెలుగు విద్యార్థి ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన 24 ఏళ్ల కరసాని హరి కృష్ణారెడ్డి, డిసెంబర్ 31న డెనాలి సమీపంలోని హోటల్ నుంచి క్యాబ్‌లో బయలుదేరిన తర్వాత మాయమవ్వడం ఇప్పుడు అమెరికాలోని తెలుగు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మైనస్ 40 డిగ్రీల గడ్డకట్టే చలి, మంచు తుపానుల మధ్య ఒంటరిగా ఉన్న హరి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం.. చివరిగా ఉపయోగించిన క్యాబ్ వివరాలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ ఘటన ఒక మిస్టరీగా మారింది. ఆ గడ్డకట్టే మంచులో తమ బిడ్డ ఏమయ్యాడోనని అద్దంకిలోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి విహారయాత్రకు వెళ్లి అదృశ్యమయ్యాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి గత పది రోజులుగా ఆచూకీ లేకపోవడంతో అటు అమెరికాలోని స్నేహితులు, ఇటు స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాస్కా పర్యటనలో ఉండగా హరి అదృశ్యం కావడంపై అక్కడి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
అసలేం జరిగింది?
హ్యూస్టన్‌లో నివసిస్తున్న కరసాని హరి, క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 22న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ప్రయాణించిన ఆయన, అక్కడ డెనాలి (Denali) సమీపంలోని ఒక హోటల్‌లో బస చేశారు. అక్కడ నుంచి హరి మిస్సింగ్ మిస్టరీగా మారింది. డిసెంబర్ 30న హరి తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడారు. జనవరి 3 లేదా 4వ తేదీ నాటికి తిరిగి రూమ్‌కు వస్తానని స్నేహితులకు సమాచారం ఇచ్చారు. డిసెంబర్ 31న ఆయన హోటల్ నుండి బయటకు వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుండి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. హోటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత హరి ఒక క్యాబ్ సర్వీస్‌ను ఉపయోగించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరు? హరి ఎక్కడికి వెళ్లారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
పోలీసుల దర్యాప్తు

