లోకేష్ ’సాక్షి‘పై కేెసెందుకు వేసినట్టు
x

లోకేష్ ’సాక్షి‘పై కేెసెందుకు వేసినట్టు

ఆర్టీఐ (RTI) ద్వారా సేకరించిన సమాచారమే అది అబద్ధమని నిరూపించిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


రాజకీయాల్లో ఆరోపణలు సహజమే.. కానీ ఆ ఒక్క కథనం ఏకంగా 75 కోట్ల రూపాయల పరువు నష్ట దావాకు దారితీసింది. 'చినబాబు తిన్న చిరుతిండికి 25 లక్షల ఖర్చా?' అంటూ సాక్షి పత్రిక ప్రచురించిన వార్త ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించడమే కాకుండా, ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. అసలు ఆ కథనంలో ఏముంది? లోకేష్ అంత భారీ మొత్తానికి దావా వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తాజాగా ఈ కేసులో ఏం జరిగింది? వంటి ఆసక్తికర వివరాలు మీకోసం..

అసలేమిటీ కేసు?
గతంలో సాక్షి దినపత్రికలో "చినబాబు చిరుతిండి రూ. 25 లక్షలండి" అనే శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. గత ప్రభుత్వ హయాంలో విశాఖ విమానాశ్రయంలోని విఐపి లాంజ్‌లో అల్పాహారం కోసం ప్రభుత్వం రూ. 25 లక్షలు ఖర్చు చేసిందని ఆ కథనం సారాంశం. అయితే, ఇది పూర్తిగా కల్పితమని, ఆ సమయంలో తాను విశాఖలోనే లేనని లోకేష్ స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే తనపై ఇటువంటి దుష్ప్రచారం చేశారని పేర్కొంటూ రూ. 75 కోట్లకు ఆయన పరువు నష్ట దావా వేశారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారంటూ ‘సాక్షి’ మీడియాపై దాఖలు చేసిన పరువు నష్ట దావా కేసులో భాగంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ బుధవారం (జనవరి 7, 2026) విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. నగరంలోని 12వ అదనపు జిల్లా కోర్టులో జరుగుతున్న ఈ విచారణకు ఆయన హాజరయ్యారు.
కోర్టులో తాజా పరిణామాలు
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల విచారణ పూర్తి కాగా, బుధవారం మూడో విడత క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. సాక్షి తరపు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ కోర్టులో సమాధానాలు ఇచ్చారు.
ఎవరినీ వదిలిపెట్టను: లోకేష్
విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. "రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోను. కేవలం రాజకీయ లబ్ధి కోసం కుటుంబ సభ్యులపై తప్పుడు వార్తలు రాసే ధోరణి మారాలి. ఆర్టీఐ (RTI) ద్వారా సేకరించిన సమాచారమే ఆ కథనం అబద్ధమని నిరూపించింది. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది, నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను" అని అన్నారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ విచారణ సందర్భంగా కోర్టు పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
Read More
Next Story