కాశ్మీరీ టైగర్ ఫరూఖ్ అబ్దుల్లాపై తుపాకీ పేల్చిన ఈ వృద్ధుడు ఎవరు?
x
ఫరూఖ్ అబ్దుల్లాపై కాల్పులు జరిపిన వ్యక్తి ఊహా చిత్రం

'కాశ్మీరీ టైగర్' ఫరూఖ్ అబ్దుల్లాపై తుపాకీ పేల్చిన ఈ వృద్ధుడు ఎవరు?

అందరూ ముద్దుగా డాక్టర్ సాబ్ అని పిలుచుకునే ఫరూఖ్ అబ్దుల్లాపై తుపాకీ పేలింది. ఎందుకు, ఎవరా వ్యక్తి....


జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం చేసిన వృద్ధుడు ఎవరు? ఎందుకు కాల్పులు జరిపాడు? అసలేం జరిగిందీ? 25 ఏళ్లుగా చంపాలని ఎందుకు ప్రయత్నించాడనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఘటన ఎలా జరిగింది?
జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఓ పెళ్లికి ఫరూఖ్ అబ్దుల్లా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరీ కూడా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వస్తున్న సమయంలో అక్కడ ముందే వేచి ఉన్న కమల్ సింగ్ జమ్వాల్ పిస్టల్‌తో దగ్గర నుంచి కాల్పులు జరిపాడు.
భద్రతా సిబ్బంది (జెడ్ ప్లస్ సెక్యూరిటీ టీమ్, NSG కమాండోలు) వెంటనే అప్రమత్తమై, తుపాకీ గురి తప్పించి అతడిని పట్టుకున్నారు. స్థానికులు, NC వర్కర్లు అతణ్ణి తీవ్రంగా కొట్టారు. పోలీసులకు అప్పగించారు.
ఫరూక్ సురక్షితంగా బయటపడ్డారు. సురీందర్ ఛౌదరీకి చిన్న గాయాలు అయ్యాయి. వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఎవరీ నిందితుడు?
87 ఏళ్ల ఫరూఖ్ అబ్దుల్లాపై కాల్పులు జరిపిన కమల్ సింగ్ జమ్వాల్ (Kamal Singh Jamwal) జమ్మూ వాసి. ఆయన వయసు 63 ఏళ్లు. 25 ఏళ్లుగా ఫరూక్‌ను చంపాలని ప్లాన్ చేస్తున్నాడట. నిందితుడు కమల్ సింగ్ జమ్వాల్ ఉండేది జమ్మూ లోని పురానా మండి. ఫరూక్ అబ్దుల్లాను వెనక నుంచి పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. ఆయనకు జమ్మూలోని ఓల్డ్ సిటీలో కొన్ని దుకాణాలు ఉన్నాయి. వాటి అద్దె ద్వారా జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. ఇతరత్రా వ్యాపారాలు ఏమీ లేవని తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం, దాడి సమయంలో అతను మద్యం తాగి ఉన్నాడు. లైసెన్స్ ఉన్న సొంత తుపాకీనే ఈ కాల్పులకు ఉపయోగించారు.
మద్యం మత్తులో ఉండడంతో ఓసారి తన తండ్రి అజిత్ సింగ్ అని మరోసారి తన కుమారుడి పేరు అజిత్ సింగ్ అని చెప్పినట్టు పోలీసులు రికార్డ్ చేశారు. భార్య, పిల్లలు, ఇతర కుటుంబ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
గత 25 ఏళ్లుగా ఫరూక్ అబ్దుల్లాను చంపాలని ప్లాన్ చేస్తున్నాను. “ఇది నా వ్యక్తిగత అజెండా (personal agenda). ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను” అని పోలీసులతో స్పష్టంగా చెప్పాడు. ఏ రాజకీయ, ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదు. పూర్తిగా వ్యక్తిగత ద్వేషం మాత్రమే.
ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. విచారణ కొనసాగుతోంది. అతని పర్సనల్, సోషల్, ఆర్గనైజేషనల్ లింకులు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారు. ఇంకా ఏ టెర్రర్ లింక్ దొరక లేదు. పూర్తి వివరాల కోసం వెతుకుతున్నారు. చదువు, గత క్రిమినల్ రికార్డు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడి కాలేదు. పోలీసు దర్యాప్తు ముగిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి రావచ్చు.
ఎందుకు కాల్పులు జరిపాడు?
పోలీసుల విచారణలో కమల్ సింగ్ జమ్వాల్ చెప్పిన ప్రకారం.. “ఫరూఖ్ అబ్దుల్లాను గత 25 ఏళ్లుగా చంపాలని అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత టార్గెట్” అని చెప్పారు. అంటే అతనికి ఫరూఖ్ అబ్దుల్లాపై పాత కక్షలు (personal grudge) ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు ఉగ్రవాద సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని అధికారులు తెలిపిన ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు.
భద్రతపై అనుమానాలు ఎన్నో...
ఫరూఖ్ అబ్దుల్లాకు Z+ స్థాయి భద్రత ఉన్నప్పటికీ దాడి చేసిన వ్యక్తి అంత దగ్గరకు ఎలా వచ్చాడనే దానిపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. CCTV ఫుటేజ్ వైరల్ అయింది. అతడు వెనక నుంచి దగ్గరకు వచ్చి షాట్ ఫైర్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తన తండ్రి ఫరూక్ పై కాల్పులు దారుణం అన్నారు.

"లోడెడ్ తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. అల్లాహ్ దయతో తప్పించుకున్నాం. జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఎలా దగ్గరకు రాగలిగాడు?" అని ప్రశ్నించారు.
భద్రతా వైఫల్యమే కారణమని, మేజర్ సెక్యూరిటీ ల్యాప్స్ ఉన్నాయని సురీందర్ ఛౌదరీ (డిప్యూటీ సీఎం) అన్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ద్వేషం మాత్రమేనా లేక మరేదైనా కారణం ఉందా అని పరిశీలిస్తున్నారు.
ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లపై మళ్లీ చర్చను రేకెత్తించింది. ఫరూక్ అబ్దుల్లా సురక్షితంగా ఉన్నారు, కానీ ఇంత భద్రత మధ్య ఇలాంటి ప్రయత్నం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ వ్యవహారమై పార్లమెంటు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యసభలో తీవ్ర దుమారమే చెలరేగింది.
Read More
Next Story