విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన విజయ్ భార్య
x

విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన విజయ్ భార్య

ఏప్రిల్‌ 20న కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ


Click the Play button to hear this message in audio format

తమిళ సినీనటుడు, తమిళగ వెట్రి కళగం చీఫ్ విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. చెంగల్‌పట్టు కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాహ జీవితం సజావుగా కొనసాగడం లేదని, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ పిటిషన్‌ను స్వీకరించగా.. ఏప్రిల్‌ 20వ తేదీన కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది.

1999లో ప్రేమ వివాహం..

విజయ్, సంగీత వివాహం 1999లో జరిగింది. సంగీత లండన్‌కు చెందిన తమిళ కుటుంబానికి చెందినవారు. విజయ్ నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన అభిమానిగా సంగీత పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కొన్నేళ్లుగా విభేదాలు..

వివాహమైన కొంతకాలం తర్వాతే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమైనట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారని సినీవర్గాల్లో ప్రచారం ఉంది. ప్రత్యేకంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

Read More
Next Story