ఏయే జిల్లాకు ఏయే ఐఎఎస్ ను నియమించారంటే...
x

ఏయే జిల్లాకు ఏయే ఐఎఎస్ ను నియమించారంటే...

14 మంది ఐఏఎస్‌ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరోసారి భారీ ఎత్తున ఐఎఎస్ లను బదిలీ చేసింది. 14 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పులు జిల్లాస్థాయి పరిపాలనా శాఖల్లో కీలక బాధ్యతలను పునర్విభజన చేసేలా ఉన్నాయి. గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌ పి.శ్రీనివాసులును బదిలీ చేసి కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించారు. మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీగా నియమించారు.
రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సమతుల్యంగా నడిపించేందుకు ఈ 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
వివరాలు ఇలా ఉన్నాయి...
పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్ నియామకం
గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీ కల్పన కుమారి బదిలీ
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కల్పన కుమారి నియామకం
విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కతవాటె మయూర్ అశోక్ బదిలీ
గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా కతవాటె మయూర్ అశోక్ నియామకం
తిరుపతి జేసీ, తుడా వైఎస్ ఛైర్మన్‌గా ఆర్.గోవిందరావు నియామకం
వైఎస్‌ఆర్ కడప జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ బదిలీ
వైఎస్‌ఆర్ కడప జాయింట్ కలెక్టర్‌గా నిథి మీనా నియామకం
ప్రస్తుతం అనంతపురం జేసీగా ఉన్న శివ్ నారాయణ శర్మ బదిలీ
అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణు చరణ్ నియామకం
ఎపీటీఎస్ ఎండీ మల్లవరపు సూర్యతేజ బదిలీ
అనకాపల్లి జాయింట్ కలెక్టర్‌గా మల్లవరపు సూర్యతేజ నియామకం
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్ నియామకం
వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్ఎస్ శోబిక బదిలీ
గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్ఎస్ శోబిక నియామకం
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యాధరి బదిలీ
విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ళ, విద్యాధరి నియామకం
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శివ్ నారాయణ్ శర్మ నియామకం
తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహ బదిలీ
పల్నాడు జిల్లా జేసీగా వి.సంజనా సింహ నియామకం
Read More
Next Story