ట్రంప్ రాకతో భారత్ కు ఉన్న సవాళ్లేంటీ?
‘ది ఫెడరల్’ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్ విశ్లేషణ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జననరి 20న బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ట్రంప్ అంటేనే విద్వేష ప్రసంగాలు, ధైర్యానికి మారుపేరు. ఆయన హయాంలో ప్రపంచ దౌత్యం అనేక మార్పులకు గురైంది. ముఖ్యంగా సాంప్రదాయేతర విధానాలను తుంగలో తొక్కి తరుచుగా ఉల్లంఘించే విధానాలతో అంతర్జాతీయ సంబంధాలను పున: నిర్మించారు. ఈ విషయంపై ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్ టాకింగ్ సెన్స్ విత్ శ్రీని ఎపిసోడ్ లో మాట్లాడారు. ‘‘ అతను(ట్రంప్) తన దౌత్యం ఎలా ఎంచుకోబోతున్నారో ఎవరూ ఊహించలేరు’’ అన్నారు.
ప్రస్తుతం ట్రంప్ రాక భారత్ పై ఎలా ప్రభావం చూపబోతోందనేది చర్చించాల్సిన అంశం. ప్రధాని మోదీతో కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఆయన పరిపాలన కాలంలో వాణిజ్య విధానాలు, ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు దేశం పై ప్రభావం చూపుతాయి. అలాగే ఇంతకుముందు ఉన్న స్నేహం ఇప్పుడు కొనసాగుతాయా అని సందేహాలు లేవనెత్తారు.
యూఎస్ పై భారత్ అధికంగా ఆధారపడిందా?
భారత ఆర్థిక సంబంధాలు యూఎస్ తో దృఢంగా ఉన్నాయి. ముఖ్యంగా వాణిజ్యంలో భాగమైన ఐటీ ఎగుమతులు 54 శాతం అమెరికాకే వస్తాయి. అయితే హెచ్ వన్ బీ వీసాలు నిబంధనలు కఠినతరం చేయడం ఆందోళన కలిగిస్తోంది. వీసా విధానాలపై అనుకూలంగా మాట్లాడిన ఇలాన్ మస్క్ అభిప్రాయాలను కాస్త ఉపశమనం కలిగించేవి. అయితే అమెరికా గ్రేట్ అగైన్ (మగ) నినాదం తీసుకు వస్తున్న వైట్ అమెరికన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావచ్చు.
టారిఫ్ విధానాలతో..
ఇంకా ట్రంప్ చేయబోతున్న వాణిజ్యం యుద్ధం ప్రపంచ ఆర్థిక పరిస్థితిని గందరగోళంలోపడేస్తాయి. చైనా ప్రకటించిన సుంకాలు, ఇతర దేశాలతో ఆ దేశం చేస్తున్న వాణిజ్యం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా నుంచి వెళ్లే సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించవచ్చు. ఈ అస్థిర వాతావరణంలో అనుకూలమైన వాణిజ్య నిబంధనలను కొనసాగించే సవాలును మన దేశ దౌత్యవేత్తలు ఎదుర్కొంటున్నారు.
బ్యాలెన్సింగ్ సిస్టం పని చేస్తుందా?
ఇంతకుముందు ట్రంప్ హయాంలో ఏర్పాటు చేసిన క్వాడ్ మరోసారి తన ప్రభావాన్ని పెంచవచ్చు. ఇండో ఫసిపిక్ భద్రతను మెరుగుపరచడానికి ప్రయత్నించవచ్చు. క్వాడ్ లోని చాలా సభ్య దేశాలు చైనాతో తమ ఆర్థిక సంబంధాలు బలంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ ‘‘ సమాచారం, భద్రతా సమస్యల వ్యూహాత్మక భాగస్వామ్యం’’ కొనసాగే అవకాశం ఉందని ఎడిటర్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచ దౌత్యంలో భారత్ ఇప్పుడు బ్యాలెన్సింగ్ పద్దతిని ప్రవేశపెట్టింది. చైనాతో మెరుగైన సంబంధాలను పెంపొందించుకుంటూ యూఎస్ తో సంబంధాలను బలోపేతం చేయడానికి సూక్ష్మ వ్యూహాలు అవసరం.
ఇమ్మిగ్రేషన్ విధానాల ప్రభావం
ట్రంప్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అమెరికా మేక్ గ్రేట్ అగైన్ నినాదం. ఇందులో భాగంగా అక్రమ వలసదారులను తరిమేస్తామని ఆయన ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్ విధానాలు చాలా మంది నిపుణులు, ముఖ్యంగా భారతీయులపై ప్రభావం చూపుతాయి.
యూఎస్ లో ప్రస్తుతం 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారాలు అందిస్తున్నారు. అక్కడేదైన గట్టి చర్య తలపడితే ఆ ఒత్తిడి నేరుగా న్యూఢిల్లీ పైనే పడుతుంది. పత్రాలు లేని నివసిస్తున్న భారతీయుల విషయం కూడా అనేక సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అమెరికా ముడుచుకుపోతే అనేక కొత్త చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అది ఎగుమతులు, దిగుమతులపై పడుతుందని పేర్కొన్నారు.
వ్యూహాత్మక ప్రయోజనాలు..
ట్రంప్ విధానాలు ఎలా ఉన్న ఆయన మాటకారితనం, విధానాలను దేశం తన వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఉపయోగించుకునే అవకాశాలు ఉంది. బలమైన దౌత్యాన్ని కొనసాగించడం, వీసా, వాణిజ్య సవాళ్లను నావిగేట్ చేయడం మన దేశ వృద్ధికి అవసరం. భారత దౌత్యవేత్తలు తమ మార్గంలో నడవగలిగితే పరిపాలన తమ వైపు ఉంచుకుంటే వారు అనేక సమస్యలు పరిష్కరించగలరని ఆయన ఆశావాదంతో ముగించారు.
Next Story