బీజేపీ దూకుడుతో అమెరికా డీప్ స్టేట్ కంగుతిందా?
x

బీజేపీ దూకుడుతో అమెరికా డీప్ స్టేట్ కంగుతిందా?

దేశాన్ని అస్థిరపరచాలనే కుట్రల వెనక అమెరికా విదేశాంగ శాఖ ఉందని బీజేపీ ఆరోపణ


భారత్ లో అస్థిరత సృష్టించేందుకు, దేశాన్ని మరోసారి రైతు ఉద్యమం పేరుతో విభజించేందుకు అమెరికా డీప్ స్టేట్, జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఓపెన్ సోసైటీ ఫౌండేషన్ కుట్ర పన్నుతున్నారని ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది.

అమెరికాకు అనుగుణంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారని కమల దళం విమర్శించింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రముఖంగా పాల్గొన్న సలీల్ శెట్టి( ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ లో పని చేస్తున్నారు) ఏ సంస్థలో పని చేస్తున్నారని, వారికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఉందో తెలపాలని డిమాండ్ చేశారు.

భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అమెరికా డీప్ స్టేట్ మీడియా పోర్టల్ OCCRP (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్) కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కుమ్మక్కయ్యిందని బీజేపీ నేతలు సంబిత్ పాత్ర, సుధాన్షు త్రివేదీ ఆక్షేపించారు.
అదానీ గ్రూప్‌పై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు చేసే విమర్శల కోసం అమెరికా డీప్ స్టేట్ వెలువరించే ఓసీసీఆర్పీ నివేదికలను వాడుకుంటున్నారని, ఈ నివేదికలు అన్నీ కూడా గత నాలుగు సంవత్సరాలుగా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విడుదల అయినవే అని పలు తేదీలను వివరించారు. అమెరికా విడుదల చేసిన అన్ని నివేదికలు కూడా భారత్ లో పార్లమెంట్ సమావేశాల సందర్భంలోనే వచ్చాయని తెలిపారు.
యూఎస్ ఏమన్నదంటే..
" భారత్‌లోని అధికార పార్టీ ఈ విధమైన ఆరోపణలు చేయడం నిరాశపరిచింది" అని యుఎస్ ఎంబసీ ప్రతినిధి అన్నారు. " US ప్రభుత్వం వృత్తిపరమైన అభివృద్ధి - పాత్రికేయులకు సామర్థ్య-నిర్మాణ శిక్షణకు మద్దతు ఇచ్చే ప్రోగ్రామింగ్‌పై స్వతంత్ర సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ ఈ సంస్థల సంపాదకీయ నిర్ణయాలు లేదా దిశను ప్రభావితం చేయదు” అని అధికారి తెలిపారు.
"యునైటెడ్ స్టేట్స్ చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు ఛాంపియన్‌గా ఉంది. స్వేచ్ఛా, స్వతంత్ర ప్రెస్ అనేది ఏదైనా ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన భాగం, సమాచారం, నిర్మాణాత్మక చర్చను ప్రారంభించడం, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడం వాటి లక్ష్యం ” అని యుఎస్ ఎంబసీ అధికారి తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీపై లక్షిత దాడుల ద్వారా భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల వెనుక US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ నిధులు సమకూర్చిన సంస్థలు, అమెరికన్ “డీప్ స్టేట్” లోని అంశాలు ఉన్నాయన్న BJP ఆరోపణలను US తిరస్కరించింది. US రాయబార కార్యాలయంలోని ప్రతినిధి ఆరోపణలను "నిరాశ కలిగించేవి"గా అభివర్ణించారు. US ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు ఛాంపియన్‌గా ఉందని నొక్కి చెప్పారు.
OCCRP, USAID సంబంధాలు
ఆమ్‌స్టర్‌డామ్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న OCCRP, నేరాలు, అవినీతికి సంబంధించిన కథనాలపై ఎక్కువగా దృష్టి సారించే మీడియా ప్లాట్‌ఫారమ్. ఇందులో 51 దేశాలకు చెందిన వేలాది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఆయా దేశాల్లో ఈ సంస్థకు ప్రతినిధులుగా ఉంటూ వార్త కథనాలను అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సేకరిస్తూ ఉంటారు.
జార్జ్ సోరోస్ - రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ వంటి ఇతర "డీప్ స్టేట్ ఫిగర్స్"తో పాటు, US స్టేట్ డిపార్ట్‌మెంట్ కు చెందిన USAID ద్వారా OCCRP నిధులు సమకూరుస్తుందని ఫ్రెంచ్ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని బీజేపీ అధ్యయనం చేసి రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. దీనితో కాంగ్రెస్ లో కంగారూ మొదలైంది.
డీప్ స్టేట్ పనిపడతా.. ట్రంప్ వార్నింగ్
గత నాలుగు సంవత్సరాల కాలంలో తనను వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టిన అమెరికా డీప్ స్టేట్ పై అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన పరిపాలన కాలంలో ఆ వ్యవస్థను మొత్తం కుప్పకూలుస్తానని ప్రతినబూనారు. ఇదే సమయంలో భారత్ కూడా జార్జ్ సోరోస్, డీప్ స్టేట్ పై నేరుగా విమర్శలు గుప్పించింది. వచ్చే ఏడు జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అశాంతికి కారణం డీప్ స్టేట్ అని చాలా దేశాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుత బంగ్లాదేశ్ పాలకుడిగా వచ్చిన మహ్మద్ యూనస్ ను కూడా డీప్ స్టేట్ నిలబెట్టిందే అని అనుమానాలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని వివిధ జాతీయ వాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నకిలీ ప్రజా ఉద్యమాలను నిర్మించి కూలదోయడం డీప్ స్టేట్ ప్రధాన వ్యూహం.
అదానీ ఇష్యూ
గత నెలలో, US ప్రాసిక్యూటర్లు గౌతమ్ అదానీ (62), అతని మేనల్లుడు సాగర్ ఇతర ఉన్నతాధికారులు భారత్ లోని ప్రభుత్వ ఉన్నతాధికారులకు లంచం ఇచ్చి రూ. రెండు బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ లు పొందారని కోర్టులో అభియోగాలు మోపారు.
అభియోగాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసి, ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పిస్తోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ ఆరోపణలను "నిరాధారం" అని కొట్టిపారేసింది.



Read More
Next Story