రొయ్యల ఎగుమతులపై యుద్ధ ప్రభావం ఎంత?
x

రొయ్యల ఎగుమతులపై యుద్ధ ప్రభావం ఎంత?

యుద్ధం వల్ల ఏపీ రొయ్యల పరిశ్రమపై కొంత మేర ప్రభావం ఏర్పడింది.


పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఆంధ్రప్రదేశ్‌లో రొయ్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికా టారిఫ్‌ల పెంపు నుంచి ఉపశమనం లభించిందనుకున్న సమయంలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధంతో మరోసారి ఎగుమతులకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికే రాష్ట్రం నుంచి సముద్రమార్గంలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కంటైనర్లు వెనక్కి రావడంతో ఎగుమతిదారులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఆయా దేశాల నుంచి ఆర్డర్లు రద్దవుతుండడంతో ఇప్పట్లో పుంజుకునే అవకాశం కనిపించడం లేదని సంబంధిత వర్గాలంటున్నాయి. మరోవైపు వారం రోజుల వ్యవధిలో 100 కౌంట్‌ రొయ్యపై టన్నుకు రూ.30 వేల వరకు ధరలు తగ్గిపోయాయి. చేతికి వచ్చిన పంట అమ్ముకోలేక, దాచుకోలేక రైతులు సతమతమవుతున్నారు.

ఏపీ రాష్ట్రం నుంచి ఏటా సుమారు 4.25 లక్షల టన్నుల రొయ్య విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. అందులో 40-45 శాతం అమెరికా.. మిగతావి చైనా, యూరప్‌ దేశాలకు వెళ్తాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు కొంతమేర ప్రభావితమవుతున్నాయి. అయితే ప్రధాన మార్కెట్లు అమెరికా, చైనా, యూరప్ యూనియన్, వియత్నాం, థాయ్‌లాండ్ వంటివి యుద్ధ ప్రభావం లేకుండా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా షిప్పింగ్ రూట్లలో అంతరాయాలు ఏర్పడటంతో కొన్ని పోర్టుల్లో షిప్‌మెంట్లు ఆలస్యమవుతున్నాయి.

వచ్చే రెండు మూడు నెలల ఆర్డర్లకు అనుగుణంగా రొయ్య ఎగుమతి కంపెనీలు రైతులతో ఒప్పందాలు సైతం చేసుకున్నాయి. ఇంతలో యుద్ధం ఉరిమింది. వచ్చే సీజన్‌ వరకు తేరుకునే పరిస్థితి కానరావడం లేదని ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు. యుద్ధం ప్రభావం మొత్తం రొయ్యల పరిశ్రమపై పడింది. ముఖ్యంగా గల్ఫ్ మార్కెట్లకు ఎగుమతులు 8 శాతం వరకు ప్రభావితమయ్యాయి. సుమారు $300 మిలియన్ విలువైన సముద్ర ఉత్పత్తులు పోర్టుల్లో నిలిచిపోయాయి. ధరలు 20-40 రూపాయల వరకు తగ్గాయి. రైతులు ఒక టన్నుకు రూ.40,000 వరకు నష్టపోతున్నారు.

గతేడాది అమెరికా టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా గల్ఫ్, ఇతర దేశాల పర్యాటక ప్రాంతాలకు ఎగుమతులు పెరిగాయి. విశాఖ, చెన్నై పోర్టుల నుంచి కంటైనర్లలో సముద్ర మార్గాన రవాణా చేస్తున్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆలస్యమవుతున్నాయి. కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో పానిక్ హార్వెస్టింగ్ పెరిగింది.

యుద్ధంతో దుబాయ్, ఇతర అరబ్‌ దేశాల్లోని పర్యాటక ప్రదేశాల్లో నష్టం జరిగింది. ఆయా ప్రాంతాలకు తిరిగి సందర్శకుల సంఖ్య పెరిగితేనే మన రొయ్యకూ డిమాండ్‌ ఉంటుంది. 2025లో వెస్ట్ ఏషియాకు $220 మిలియన్ విలువైన రొయ్యలు ఎగుమతి అయ్యాయి. ఇది మొత్తం ఎగుమతుల్లో కీలక భాగం.

వాతావరణ మార్పులతో..

డిసెంబర్‌ నుంచి జనవరి వరకు వాతావరణ మార్పులతో రొయ్యలో తెల్లమచ్చల వైరస్‌ వల్ల 50 శాతం పంట రైతులు నష్టపోయారు. మిగతాది అమ్ముకునే సమయంలో యుద్ధం వల్ల ఎగుమతులు లేక ధరలు పడిపోయాయి. ప్రస్తుత పంటను ఎంతోకొంత ధరకు అమ్మి, పరిస్థితులు కుదుటపడే వరకు సాగు విరామం ఇవ్వాలని భావిస్తున్నట్లు భీమవరానికి చెందిన వెంకట సూర్యనారాయణ అనే ఆక్వా రైతు తెలిపారు.

వాస్తవ పరిస్థితులు, యుద్ధం ప్రభావం

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా షిప్పింగ్ అంతరాయాలు ఏర్పడినప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్య ఎగుమతులపై ప్రభావం తక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన మార్కెట్లు యుద్ధ ప్రభావం లేకుండా ఉన్నాయి. కానీ గల్ఫ్ దేశాలకు కొంత ఆలస్యం ఏర్పడింది. ధరలు 20-40 రూపాయల వరకు తగ్గాయి. రైతులు సంక్షోభంలో అకాల హార్వెస్టింగ్ చేస్తున్నారు.

రొయ్యల ఎగుమతిదారుల అభిప్రాయాలు

గుంటూరు పవన్ కుమార్ (సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్)

యుద్ధం కారణంగా షిప్పింగ్ అంతరాయాలతో $300 మిలియన్ విలువైన సముద్ర ఉత్పత్తులు పోర్టుల్లో నిలిచిపోయాయి. ఇది మొత్తం ఎగుమతుల్లో 8 శాతం ప్రభావితం చూపస్తోంది. ఎగుమతిదారులు, కార్మికులపై ప్రభావం భయంకరంగా ఉంది. ఉద్యోగాలు పోతాయి.

రొయ్యల రైతుల అభిప్రాయాలు

కెఎన్వి రత్నబాబు, మచిలీపట్నం (ఆక్వా రైతు)

నేను 60-కౌంట్ రొయ్యను రూ.220కు అమ్మాను. సాధారణంగా రూ.300 వస్తుంది. మార్కెట్‌లో భారీగా వచ్చినందున, రైతులు హడావిడిగా హార్వెస్ట్ చేస్తున్నందున ధరలు పడిపోతున్నాయి.

గుబ్బాల నారాయణమూర్తి, (ఆక్వారైతు) మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా.

ప్రస్తుత పంటను ఎంతోకొంత ధరకు అమ్మి, పరిస్థితులు కుదుటపడే వరకు సాగు విరామం ఇవ్వాలని భావిస్తున్నాం. యుద్ధం కారణంగా ధరలు పడిపోయాయి. ట్రేడర్లు సిండికేట్లు ఏర్పరచి లాభపడుతున్నారు.

Read More
Next Story