
అమరావతిపై సోషల్ ఆడిట్ ఏమి చెప్పింది? సీఆర్‌డీఏ యాక్షన్ ప్లాన్ ఏమిటి?
అమరావతిలో TATA Institute సోషల్ ఆడిట్ నిర్వహించింది. ఈ సమస్యల్లో ల్యాండ్ పూలింగ్ రైతుల ఇష్యూ ప్రధానమైంది..
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) తాజాగా సామాజిక ఆడిట్ సిఫార్సులపై యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) సూచనల ఆధారంగా ఈ ప్లాన్ తయారు చేశారు. భూమి అలాట్‌మెంట్, రిజిస్ట్రేషన్, గ్రీవెన్స్ రిడ్రెసల్ వంటి కీలక అంశాలపై దృష్టి సారించి నిర్దిష్ట కాలపరిమితులతో చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్లాన్ ద్వారా రైతులు, భూమి లేని ప్రజల సమస్యలను పరిష్కరించి, అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయాలన్నది లక్ష్యం.
టిస్ సిఫార్సులు ప్రధానంగా భూమి ప్లాట్ల డిమార్కేషన్, ఎల్‌పీఓసీల రిజిస్ట్రేషన్, భూమి సమస్యల పరిష్కారం, రైతులకు ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ, గ్రీవెన్స్ మెకానిజమ్ బలోపేతం వంటి అంశాలపై కేంద్రీకృతమై ఉన్నాయి. సీఆర్‌డీఏ ఈ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు సూచించింది. ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1. ప్లాట్ల డిమార్కేషన్, అడ్డంకుల తొలగింపు: రైతులకు స్పష్టమైన సరిహద్దులతో ప్లాట్లు అందించాలని టిస్ సూచించింది. దీనికి సీఆర్‌డీఏ కమిటీ ఏర్పాటు చేసి రైతుల భాగస్వామ్యంతో సరిహద్దులు నిర్ధారణ చేయనుంది. తాత్కాలిక సరిహద్దు స్తంభాలు 2027 డిసెంబర్ 31 నాటికి, శాశ్వత స్తంభాలు అభివృద్ధి పనులతో పాటు 35 శాతం 2026 డిసెంబర్ నాటికి, 70 శాతం 2027 జూన్ నాటికి, 100 శాతం 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయనుంది. హై టెన్షన్ ఎలక్ట్రిక్ లైన్లు పునర్నిర్మాణం 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేస్తామని తెలిపింది.
2. ఎల్‌పీఓసీల రిజిస్ట్రేషన్: అలాట్ చేసిన ప్లాట్లు రైతుల కోరిక మేరకు (ఉదా: వారసుల పేరుపై) రిజిస్టర్ చేయాలని సూచన. ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.187 (17.9.2025) ద్వారా 'అసైన్డ్' పదాన్ని తొలగించింది. రైతుల అభ్యర్థనపై 15 రోజుల్లో సవరణ డాక్యుమెంట్లు జారీ చేసి, 2026 డిసెంబర్ నాటికి రిజిస్ట్రేషన్ పూర్తి చేయనుంది. పెండింగ్ రిజిస్ట్రేషన్లకు కారణాలు కోర్టు కేసులు (70 మంది రైతులు, 312 ప్లాట్లు), డిస్ప్యూట్ కేసులు (450 మంది రైతులు, 1891 ప్లాట్లు) మొదలైనవి. లంక భూముల రిజిస్ట్రేషన్ 356లో 98 పూర్తి, మిగిలినవి 2026 జూన్ 30 నాటికి పూర్తవుతాయి.
3. ఎల్‌పీఓసీలలో లోపాల సవరణ: కొన్ని గ్రామాల్లో ప్లాట్ కోడ్ మార్పుల వల్ల 495 ప్లాట్లలో లోపాలు వచ్చాయి. జీఓ ఎంఎస్ నెం.276 (24.12.2025) ద్వారా సవరణ డీడ్లు అనుమతించారు. రైతుల అభ్యర్థనపై 15 రోజుల్లో సవరణ, 2026 జూన్ నాటికి పూర్తి.
4. ఎల్‌పీఎస్‌లో భాగస్వామ్యం లేని రైతులకు అవగాహన: భూమి సమర్పణ చేయని రైతులకు ఎల్‌పీఎస్ ప్రయోజనాలు వివరించాలి. గ్రామ సభలు, ఎస్‌ఎమ్‌ఎస్/ఐవీఆర్‌ఎస్, మొబైల్ వాన్, హెల్ప్‌లైన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు. ఐఈసీ మెటీరియల్స్ (పోస్టర్లు, షార్ట్ ఫిల్మ్) తయారీ. డిజిటల్ బోర్డులు గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు. కమ్యూనికేషన్ ప్లాన్‌లు ప్రతి క్వార్టర్‌కు సమీక్ష.
5. నిర్దిష్ట భూమి సమస్యల పరిష్కారం: గ్రామకంఠం భూములపై జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కమిటీ (జీఓ ఆర్టీ నెం.50, 23.1.2026), 60 రోజుల్లో రిపోర్టు. జరీబు భూములపై స్టేట్ లెవల్ కమిటీ (జీఓ ఆర్టీ నెం.1532, 27.12.2025), 2026 మార్చి 31 నాటికి పరిష్కారం. లంక భూములు 2026 జూన్ 30 నాటికి రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది.
6. బ్యాంకు రుణాలు: అలాట్ ప్లాట్లపై రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు సూచన (ఎస్‌ఎల్‌బీసీ సర్క్యులర్ 15.7.2025). రైతులకు అవగాహన కల్పించడానికి గ్రామ సభలు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు.
7. యాన్యూటీ చెల్లింపులు: పెన్షన్లు 2026 జనవరి వరకు, యాన్యూటీలు 2025-26 వరకు చెల్లించబడ్డాయి. రెండు నెలలకు ఒకసారి రికాన్సిలేషన్.
8. కొత్త ఉపాధి అవకాశాలు: రైతులకు స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ పేపర్ 2026 మార్చి 31 నాటికి అప్‌డేట్. ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఎస్‌ఆర్‌ఎమ్, వీఐటీ యూనివర్సిటీలు, ఎన్‌జీఓలతో శిక్షణ. డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ 2026 మార్చి 31 నాటికి. భూమి లేని రైతులకు స్థానిక శిక్షణలు (మాసన్రీ, కార్పెంట్రీ మొ.).
9. స్కిల్ గ్యాప్ అనాలిసిస్: సర్వే పూర్తి, యాక్షన్ ప్లాన్ తయారు. మార్కెట్ డిమాండ్ ఆధారంగా శిక్షణలు.
10. గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్: పరిష్కారం 2.0 పోర్టల్, సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్ ఏర్పాటు. గ్రీవెన్స్ హీట్‌మ్యాప్స్, ఆడిట్ కమిటీ, వాయిస్ ఫైలింగ్, మొబైల్ యాప్ 2026 మార్చి 31 నాటికి. గ్రీవెన్స్ సెల్ బలోపేతం.
ఈ యాక్షన్ ప్లాన్ అమరావతి ప్రాజెక్టును సామాజికంగా సుస్థిరంగా మార్చడానికి దోహదపడుతుందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. రైతులు, ప్రజలు ఈ చర్యలు సకాలంలో అమలు కావాలని ఆకాంక్షిస్తున్నారు.

