లెబనాన్ పై భూతల దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్
x

లెబనాన్ పై భూతల దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్

లెబనాన్ దక్షిణ ప్రాంతాలపైకి ఇజ్రాయెల్ భూతల దాడులు ప్రారంభించింది. తమపై అక్టోబర్ 7 నాటి దాడులు తిరిగి జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని టెల్ అవీవ్..


వైమానిక దాడిలో హెజ్ బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా ను వైమానిక దాడిలో హతమార్చిన ఇజ్రాయెల్.. ఇప్పుడు తాజాగా లెబనాన్ లో భూతల దాడులు ప్రారంభించింది.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌తో సహా ప్రపంచ నాయకులు లెబనాన్‌పై భూతల దాడులు వ్యతిరేకిస్తూ, కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మంగళవారం (అక్టోబర్ 1) ఇది "పరిమితం" అని ప్రకటించింది. సరిహద్దుకు దగ్గరగా ఉన్న దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలు, అవస్థాపన సౌకర్యాలపై దాడులు చేస్తామని ప్రకటించింది.
దక్షిణ లెబనాన్‌పై దాడి..
ఇజ్రాయెల్ ఈ ప్రాంతాలను ఉత్తర ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న ఇజ్రాయెల్ కమ్యూనిటీలకు "తక్షణ ముప్పు"గా పరిగణిస్తుంది. 'అక్టోబర్ 7' హమాస్ చేసిన తరహా దాడులకు గురయ్యే అవకాశం ఉందని ఇజ్రాయెల్ వాదన. బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతంలోని హిజ్బుల్లా బలమైన స్థావరం అయిన దహీహ్‌పై ఇజ్రాయెల్ కనీసం ఆరు దాడులు నిర్వహించిందని అధికారులు తెలిపారు. ఇక్కడ ప్రజలను ముందుగా హెచ్చరిక జారీ చేసి దాడులు చేస్తున్నామని ఐడీఎఫ్ వెల్లడించింది.
“ మీరు తీవ్రవాద హిజ్బుల్లా గ్రూపుకు చెందిన ఆసక్తులు, సౌకర్యాలకు సమీపంలో ఉన్నారు. మీ భద్రత, మీ కుటుంబ సభ్యుల భద్రత కోసం, మీరు వెంటనే భవనాలను ఖాళీ చేయాలి దూరంగా వెళ్లండి " ఇని ఇజ్రాయెల్ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లాతో తీవ్ర పోరాటం ప్రారంభమైందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఒక ట్వీట్‌లో తెలిపారు.
"దక్షిణ లెబనాన్‌లో భారీ పోరాటాలు జరుగుతున్నాయి, హిజ్బుల్లా ఎలిమెంట్స్ పౌర వాతావరణం, జనాభాను మానవ కవచాలుగా ఉపయోగించి దాడులకు పాల్పడుతున్నాయి" అని ప్రతినిధి అవిచాయ్ అడ్రే ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ మాట్లాడుతూ.. లెబనాన్‌తో సరిహద్దును పంచుకునే ఉత్తర ఇజ్రాయెల్‌లో యుద్ధం చేయడానికి "అవసరమైన అన్ని మార్గాలను" ఉపయోగిస్తుందని హెచ్చరికలు జారీ చేశాడు. "గాలి, సముద్రం, భూమిపై" దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించాడు. లెబనాన్ నుంచి మా పౌరులపై హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగిస్తుడటంతో లక్షలాది మంది ఇజ్రాయిలీలు ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారని టెల్ అవీవ్ పేర్కొంది.
హిజ్బుల్లా స్పందన

నస్రల్లా మరణం తర్వాత తన మొదటి టెలివిజన్ ప్రసంగంలో, హిజ్బుల్లా డిప్యూటీ లీడర్ నయీమ్ ఖాస్సెమ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తామంటే తాము సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఉత్తర ఇజ్రాయెల్ ను తమ లక్ష్యంగా ఉందని కూడా వెల్లడించాడు.
US ప్రతిచర్య
ఇజ్రాయెల్ చేసిన భూతల దాడులకు తాము మద్ధతునిస్తున్నామని యూఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ అన్నారు. యోవ్ గాలంట్ ప్రకటనను తాము సమర్థిస్తున్నట్లు తెలిపారు. టెహ్రాన్-మద్దతుగల మిలిటెంట్ గ్రూపుపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని, ఇదే అదనుగా ఇరాన్ కలుగజేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని లాయిడ్ ఆస్టిన్ హెచ్చరించాడు.
"లెబనీస్ హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు ప్రజలపై అక్టోబర్ 7-శైలి దాడులను నిర్వహించకుండా ఉండేందుకు ఇక్కడ దాడులు చేస్తారని, అందుకు మేము అంగీకరించామని లాయిడ్ ఆస్టిన్, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గ్యాలెంట్ మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
" ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చే బెదిరింపుల నేపథ్యంలో యుఎస్ సిబ్బంది, భాగస్వాములు, మిత్రదేశాలను రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ బాగా దృఢంగా ఉంది. ఉద్రిక్తతలను ఉపయోగించుకోకుండా లేదా సంఘర్షణను విస్తరించకుండా నిరోధించడానికి నిశ్చయించుకుంది."
UN ప్రతిచర్య..
దాడులు జరుగుతున్న సమయంలోనే యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కాల్పుల విరమణకు పిలుపునిచ్చాడు. "మీకు తెలిసిన దానికంటే నేను చాలా ఆందోళన చెందుతున్నాను. వారు యుద్ధాన్ని ఆపడం నాకు సౌకర్యంగా ఉంది. మనం ఇప్పుడు కాల్పుల విరమణ చేయాలి," అని విలేఖరులతో అన్నాడు. బ్రిటీష్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ కూడా US విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. బ్రిటన్ కూడా కాల్పుల విరమణకు మద్ధతుగా ఉన్నట్లు తెలిపింది.
పట్టించుకోని ఇజ్రాయెల్..
అయితే ప్రపంచ దేశాలు ఎంతగా డిమాండ్ చేస్తున్నా.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణను పట్టించుకోవడం లేదు. లెబనాన్ రాజధాని బీరూట్ లోపలికెళ్లి వైమానిక దాడులు చేస్తోంది. గతవారం నుంచి చేసిన వందలాది లెబనాన్ పౌరులు దేశం విడిచి సిరియా వైపు పారిపోతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల వల్ల వందలాది మంది ప్రజలు, ఉగ్రవాదులు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఇజ్రాయెల్ ఇప్పటికే గాజా నుంచి తన సైన్యాన్ని లెబనాన్ వైపు మరలిస్తోంది. దాదాపు సంవత్సరం కాలం నుంచి అది గాజాలో హామాస్ తో పోరాడుతోంది.
వెయ్యి మంది..
దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ వెయ్యి మంది దాకా మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చాలా మంది ప్రజలు స్థానభ్రంశం చెందే అవకాశం ఉంది. గత 24 గంటల్లో, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 95 మంది మరణించారని, అదే సమయంలో మరో 172 మంది గాయపడ్డారని లెబనీస్ వెల్లడించింది. భారతదేశంలో, పాలస్తీనా రాయబారి అద్నాన్ అబు అల్హైజా మాట్లాడుతూ, ప్రస్తుత "ఇజ్రాయెల్‌లోని మితవాద ప్రభుత్వం" కాల్పుల విరమణ తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలను పదే పదే తిరస్కరించింది.
"ప్రజలందరూ, యునైటెడ్ స్టేట్స్ కూడా ఇజ్రాయెల్‌ను సమర్థించారు. అంతర్జాతీయ వేదిక ఇజ్రాయెల్‌ను కాల్పుల విరమణ కోసం ఒప్పించే ప్రయత్నం చేసింది, కానీ ఇజ్రాయెల్‌లు కాల్పుల విరమణను నిరాకరిస్తున్నారు," అని అతను చెప్పాడు. ఇజ్రాయెల్ మొండి వైఖరితో ఇది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదంటున్నారు.


Read More
Next Story