‘‘మనం ఇండియాలో ఏమి అమ్మలేము’’: వైట్ హౌజ్
x

‘‘మనం ఇండియాలో ఏమి అమ్మలేము’’: వైట్ హౌజ్

ఆల్కహాల్ పై 150 శాతం సుంకాలు విధిస్తుందని ఆగ్రహం


భారత్ పై అమెరికా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. వ్యవసాయ ఉత్పత్తులు, అమెరికా మద్యంపై అధిక సుంకాలు వసూలు చేస్తుందని ఆరోపించింది. వైట్ హైజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కెనడాతో పాటు భారత్ పై విమర్శలు గుప్పించారు.

‘‘కెనడా దశాబ్ధాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలను, కష్టపడి పనిచేసే అమెరికన్లను దోచుకుంటోంది. కెనడా, అమెరికన్ ప్రజలపై, ఇక్కడి మన కార్మికులపై అధిక సుంకాలను విధిస్తోంది.
అక్కడి సుంకాలను పరిశీలిస్తే అది చాలా దారుణంగా ఉంది.’’ అన్నారు. కెనడా, అమెరికన్ చీజ్, వెన్న ఇతర ఉత్పత్తులపై 300 శాతం సుంకం విధిస్తోందని ఓ చార్ట్ ను ప్రదర్శించారు.
అధిక సుంకాలు విధిస్తున్న ఇండియా
‘‘మీరు భారత్ ను చూడండి. అమెరికన్ మద్యంపై 150 శాతం సుంకం వసూలు చేస్తోంది. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకం, జపాన్ అయితే బియ్యంపై 700 శాతం సుంకం విధిస్తున్నారు.’’ అని లీవిట్ అన్నారు.
‘‘అధ్యక్షుడు ట్రంప్ అన్యోన్యతను నమ్ముతాడు. అమెరికన్ వ్యాపారాలు, కార్మికుల ప్రయోజనాలను నిజంగా చూసే అధ్యక్షుడు మనకు రావడం గర్వకారణం. ట్రంప్ నిజంగా కోరుకునేది న్యాయమైన సుంకాలు, వాణిజ్య పద్దతులు, దురదృష్టవశాత్తూ కెనడా గత కొన్ని దశాబ్ధాలుగా మనతో చాలా అన్యాయంగా వ్యవహరిస్తోంది’’ అని ఆమె అన్నారు.
ఇండియాపై విమర్శలు..
గత కొన్ని రోజులుగా అధ్యక్షుడు ట్రంప్ అధిక సుంకాలను విధిస్తున్నారని భారత్ సహ కెనడా, మెక్సికో, చైనా వంటి దేశాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ అధికంగా సుంకాలు వసూలు చేస్తుందని, అయితే ప్రస్తుతం తగ్గించుకోవడానికి అంగీకరించిందని అన్నారు.
‘‘భారత్ మన దగ్గర భారీ సుంకాలు వసూలు చేస్తోంది. భారత్ లో మనం ఏమీ అమ్మలేము. అమెరికా చర్యలతో ఇప్పుడు వారు సుంకాలను తగ్గించుకోవడానికి అంగీకరించారని చెప్పారు’’ అని ట్రంప్ వైట్ హౌజ్ వద్ద అన్నారు.
మమ్మల్ని దోచేశారు
భవిష్యత్ లో కెనడా, మెక్సికో లపై సుంకాలు పెరగవచ్చని ట్రంప్ ఆదివారం అన్నారు. ప్రపంచ సమాజం యుగాలుగా అమెరికాను చీల్చి చెండాతుందని కూడా ఆయన అన్నారు.
‘‘కాలం గడిచే కొద్ది సుంకాలు పెరగవచ్చు. సంవత్సరాలుగా, ప్రపంచవాదులు అమెరికాను దోచుకుంటున్నారు. వారు అమెరికా నుంచి డబ్బును తీసుకుంటున్నారు.
మేము చేస్తున్నదంతా దానిలో కొంత భాగాన్ని తిరిగి పొందడం, మేము మా దేశాన్ని న్యాయంగా చూసుకుంటాము’’ అని అమెరికా అధ్యక్షుడు అన్నారు.
ఈ దేశాన్ని ప్రపంచంలోని ప్రతిదేశం, ప్రతి కంపెనీ దోచుకున్నాయి. ఇంతకుముందెన్నడూ చూడనిస్థాయిలో మనం మోసపోయాం. మనం చేయబోయేది ఇప్పుడు దాన్ని తిరిగి తీసుకోవడమే’’ అని ఆయన చెప్పారు.


Read More
Next Story