పతంజలి ‘క్షమాపణ ప్రకటన’
x

పతంజలి ‘క్షమాపణ ప్రకటన’

కోవిడ్ సమయంలో ఆల్లోపతిని తక్కువ చేసి చూపుతూ.. పతంజలి రాందేవ్ బాబా ఇచ్చిన ప్రకటన వివాదాస్పదమైంది.


క్షమాపణ ప్రకటన సైజు గతంలో పబ్లిసిటీ కోసం ప్రచురించినంత సైజులో ఉందా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పతంజలి వ్యవస్థాపకులు రామ్‌దేవ్, బాలకృష్ణ తరపున కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ జడ్డికి సమాధానమిచ్చారు. రూ.10 లక్షల ఖర్చుతో 67 వార్తాపత్రికల్లో క్షమాపణ ప్రకటన వేయించామని చెప్పారు.

ఈ క్షమాపణ ప్రకటన ఎందుకు?

కోవిడ్ సమయంలో అల్లోపతి వైద్యాన్ని తప్పుబడుతూ పతంజలి వ్యవస్థాపకులు రామ్ దేవ్, బాలకృష్ణ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనలను సీరియస్ తీసుకున్న ఇండియన్ మెడికల్ అసోనియేషన్ (ఐఎంఏ) కోర్టును ఆశ్రయించారు. రామ్ దేవ్ పేపర్ ప్రకటనలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని 2022లో పిటీషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఆ కేసు కోర్టులో ఇంకా నడుస్తుంది.

ఇదే కేసుకు సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA)కు రూ. 1,000 కోట్లు జరిమానా విధించాలని గతంలో ఓ పిటిషన్‌ దాఖలైంది. అయితే దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రోహత్గీ అన్నారు.

పత్రికల్లో క్షమాపణ ప్రకటన పెద్దగానే ప్రచురిస్తానని రామ్‌దేవ్ కోర్టుకు తెలపడంతో కేసు విచారణను వచ్చేవారానికి వాయిదా పడింది.


Read More
Next Story