Indian Tycoons in Panic
x
దుబాయ్ పై యుద్ధ మేఘాలకు సంబంధించిన ఊహాత్మక చిత్రం

దుబాయ్ పై యుద్ధ మేఘాలు: వణుకుతున్న సినీ దిగ్గజాలు

దుబాయ్‌ని 'సెకండ్ హోమ్'గా భావించే టాలీవుడ్ స్టార్స్ , పారిశ్రామికవేత్తల పెట్టుబడులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయా?


మధ్యప్రాచ్యం ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం, నూనె బావులు, వ్యూహాత్మక కేంద్రాలపై దాడులతో గల్ఫ్ రీజియన్ ఉలిక్కిపడింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు యూఏఈ, ఖతార్, కువైట్ వంటి దేశాలను లక్ష్యం చేసుకోవడంతో భయాందోళనలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా 'గ్లోబల్ హబ్'గా పేరొందిన దుబాయ్‌లో నిప్పులు కురుస్తున్నాయి.

దుబాయ్ గుండెకాయపై దెబ్బ
దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన Palm Jumeirah ఏరియాలో భవనాలు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. Fairmont Hotel సమీపంలో దట్టమైన పొగలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం Burj Khalifaని భద్రతా కారణాల దృష్ట్యా ఖాళీ చేయించారు. అంతర్జాతీయ విమాన రాకపోకలు 80% నిలిచిపోవడంతో పర్యాటక, ఆతిథ్య రంగం కుప్పకూలింది.
తెలుగు సినీ, వ్యాపార దిగ్గజాల్లో గుబులు
దుబాయ్‌ని తమ 'సెకండ్ హోమ్'గా భావించే టాలీవుడ్ స్టార్స్, తెలుగు పారిశ్రామికవేత్తల పెట్టుబడులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. గత కొన్నేళ్లుగా సేఫ్టీ, టాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ కోసం ఇక్కడ వేల కోట్లు కుమ్మరించారు.
దుబాయ్ లో పలువురు సీనరంగ ప్రముఖులు భారీగానే పెట్టుబడులు పెట్టారు. వీటిలో స్వల్పకాలిక మొదలు దీర్ఘకాలిక పెట్టుబడుల వరకు అనేకం ఉన్నాయి. ఆతిథ్య రంగం పూర్తిగా కుదేలయింది. రాకపోకలు పూర్తిగా బంద్ కాకపోయినా 80 శాతం వరకు ప్రయాణాలు నిలిచాయి. ఇరాన్ అనేక అమెరికా స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేస్తోంది.

ఈ దశలో దుబాయ్ ఇంకా సేఫ్ హేవెన్ గా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విలాసవంతమైన Palm Jumeirah విల్లాలు ఖాళీ అవుతున్నాయ. ముందస్తు బుకింగ్స్ కూడా రద్దవుతున్నాయి. యుద్ధ భయంతో సంపన్నులు ఆస్తులు షిఫ్ట్ చేస్తున్నారు. చాలా ఎక్కువ ఆర్థిక సంపద కలిగిన వ్యక్తులు-(HNWI- High Net Worth Individual- కనీసం 1 మిలియన్ అమెరికన్ డాలర్లు- మన కరెన్సీలో సుమారు ₹8.3 కోట్లకు పైగా) ఆర్థిక రంగంలో ప్రత్యేకించి బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్ రంగాల్లో పెట్టుబడి పెడుతుంటారు. గోల్డెన్ వీసా, లో టాక్స్, పాపులేషన్ గ్రోత్ వల్ల అరబ్ దేశాలలో పెట్టుబడులు పెడుతుంటారు.

పెట్టుబడులు పెట్టిన తెలుగు సినీ ప్రముఖులు...

దుబాయ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్‌కి ఫేవరెట్ సెకండ్ హోమ్. టాక్స్ ఫ్రీ, సేఫ్టీ, ప్రైవసీ, గోల్డెన్ వీసా కారణాల వల్ల వీళ్లు అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. దేశ వ్యాప్తంగా చాలా మంది సినీనటులు పెట్టుబడులు పెట్టారు. ఇప్పటి వరకు ఆన్ రికార్డ్స్ లో ఉన్న వారి వివరాల ప్రకారం..
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్: ఈ జంటకు సీఫ్రంట్ లగ్జరీ విల్లా (2023లో కొనుగోలు). అప్‌స్కేల్ సీషోర్ ఏరియా. “Breathtaking seaside villa” అని రిపోర్టులు ఉన్నాయి. వీరు హై-ఎండ్ పెట్టుబడి పెట్టారు.
అల్లు అర్జున్: ఈయనకు Palm Jumeirahలో భారీ లగ్జరీ విల్లా (floating/beachfront) ఉంది. దీని అంచనా ₹54–172 కోట్లు. 2025లో ఇన్వెస్ట్ చేశారు. గోల్డెన్ వీసా ఉంది. దుబాయ్ హబ్‌గా మారాడు.
మంచు విష్ణు: దుబాయ్‌లో హౌస్ కొన్నారు. కుటుంబంతో ఉంటుంటారు. పిల్లలు అక్కడ చదువుకొంటున్నారని వినికిడి.
చిరంజీవి కుమార్తె శ్రీజ: స్పెసిఫిక్ ప్రాపర్టీ రిపోర్టులు లేవు కానీ UAE గోల్డెన్ వీసా (10 ఇయర్స్) ఉంది. కుమార్తె శ్రీజా దుబాయ్‌కి మూవ్ అవ్వాలని ఆలోచన ఉన్నట్టు సమాచారం.
రామ్ చరణ్: స్పెసిఫిక్ ప్రాపర్టీ రిపోర్టులు లేవు. భార్య ఉపాసనకి 2021లో గోల్డెన్ వీసా వచ్చింది. Jubilee Hillsలో ₹38 కోట్ల మాన్షన్ ప్రధానం.
నాగార్జున: దుబాయ్‌లో స్పెసిఫిక్ రిపోర్టులు లేవు. Jubilee Hillsలో ₹45 కోట్ల బంగ్లా ఫోకస్.
ప్రభాస్: దుబాయ్‌లో హై-ఎండ్ ప్రాపర్టీ కొన్నారని పలు రిపోర్టులు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్ వాల్యూ పెంచుతున్నారు.
బెల్లంకొండ సాయి: ఇటీవల దుబాయ్ ప్రాపర్టీ కొన్నారని న్యూస్.
వీళ్లలో ఎక్కువ మందికి Burj Khalifa, Palm Jumeirah, Downtown, Marinaలో అపార్టుమెంటులు, రిసార్ట్స్, విల్లాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఖరీదైనవే. వీళ్లు కాక చాలా మంది వ్యాపారవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇళ్లు, విల్లాలు కొన్నారు. వీళ్లు దుబాయ్‌ని “గ్లోబల్ బిజినెస్ గేట్ వే”గా ఉపయోగిస్తున్నారు.
వారిలో జీవీ కృష్ణా రెడ్డి (GVK గ్రూప్): Taj GVK ద్వారా Taj Dubai హోటల్ (Burj Khalifa దగ్గర)లో ఇండైరెక్ట్ ప్రెజెన్స్ ఉన్నాయి. ఇన్‌ఫ్రా, ఎనర్జీ, ఎయిర్‌పోర్ట్ రంగాల్లో గల్ఫ్ కనెక్షన్స్ ఉన్నాయి.
P.V. కృష్ణా రెడ్డి (MEIL): పర్సనల్ రియల్ ఎస్టేట్ రిపోర్టులు లేవు. MEIL ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు ఉన్నా దుబాయ్ స్పెసిఫిక్ లేవు. హైదరాబాద్ ఫోకస్ గా వ్యాపారాలు చేస్తున్నా అరబ్ దేశాలలో వీరికి అనుబంధ సంస్థలు ఉన్నట్టు తెలుస్తోంది.
రవి పిళ్లై (RP గ్రూప్): గల్ఫ్‌లో భారీ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం. వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
P.V. రామ్‌ప్రసాద్ రెడ్డి (హెటెరో): ఫార్మా ఎగుమతులు గల్ఫ్ మార్కెట్‌కు చేస్తుంటారు.
యలమంచిలి సత్యనారాయణ చౌదరి: ఇండస్ట్రియల్ ట్రేడ్ & గల్ఫ్ కనెక్షన్స్ ఉన్నట్టు సమాచారం.
దుబాయ్ ఫ్రీజోన్‌లలో వందలాది తెలుగు SMEలు, స్టార్టప్‌లు ఉన్నాయి. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, ట్రేడింగ్, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి రంగాలలో వీరి పెట్టుబడులు పెట్టారు. దక్షిణాది భారతీయులు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో 20-25% తెలుగు వాటా అని అంచనా.
భారతీయ కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే ఇండియన్ ఆస్తుల విలువ సుమారు 20 నుంచి 30 వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చునని అంచనా.
దుబాయ్‌లో భారతీయ ప్రముఖుల వ్యాపారాలు...
M.A. Yusuffali – LuLu Group (రీటైల్ జెయింట్)
Micky Jagtiani – Landmark Group
Sunny Varkey – GEMS Education
PNC Menon – Sobha Group
Rizwan Sajan – Danube Group
Dr. Azad Moopen – Aster DM Healthcare
Syed Salahuddin – ETA Ascon & Star Group
వీళ్ల పెట్టుబడులు దుబాయ్ లో ఎక్కువని అంచనా.
Burj Khalifaలో ఇండియన్స్
ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా స్కై స్క్రాపర్ లో సినీప్రముఖులు Mohanlal, Shilpa Shetty, George V Nereparambil, Salman/Sohail Khan, షారూఖ్ ఖాన్ సహా పలువురికి Palm Jumeirah ‘Jannat’ విల్లాలు ఉన్నాయి.

మన పెట్టుబడులు సురక్షితమా?

స్వల్పకాలిక పెట్టుబడులలో అస్థిరత, అభద్రత నెలకొంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదు. గతంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు, రష్యా- యుక్రెయిన్ యుద్ధం వంటి గండాల నుంచి బయటపడిన సందర్భాలున్నందున ఇప్పుడూ ఎటువంటి ఢోకా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.
ఇన్సూరెన్స్, లిక్విడిటీ: యుద్ధ వాతావరణంలో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారం అవుతాయి. అత్యవసరంగా ఆస్తులు అమ్ముకోవాలన్నా కొనుగోలుదారులు దొరకని 'డిస్ట్రెస్ సేల్' పరిస్థితి రావచ్చు.
యుద్ధం అనేది కేవలం ప్రాణ నష్టమే కాదు, దశాబ్దాల కాలం నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యాలను కూడా కుదిపేస్తుంది. దుబాయ్ పతనం అంటే అది కేవలం ఆ దేశ సమస్యే కాదు, అక్కడ బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టిన భారతీయ ధనికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అంశం.
Read More
Next Story