
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌ఎం లలిత్ బోహ్రా
ఆదాయంలో వాల్తేరు డివిజన్ అదరహో!
భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం సాధించిన డివిజన్లలో వాల్తేరు డివిజన్ ఐదో స్థానంలో నిలిచింది.
రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు లోడింగ్‌లోనూ వాల్తేరు డివిజన్ దేశంలో ఐదో స్థానాన్ని సంపాదించింది. అంతేకాదు.. సరకు రవాణా, ప్రయాణికుల చేరవేతలోనూ రికార్డులను నమోదు చేసి ప్రత్యేకతను చాటుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు డివిజన్ సాధించిన ప్రగతిని డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) లలిత్ బోహ్రా మీడియాకు వివరించారు. ఆ వివరాలేమిటో ఆయన మాటల్లోనే..
వాల్తేరు డివిజన్ పురోగతి ఇలా..
‘ఈ ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు డివిజన్ భారతీయ రైల్వేలో ఐదవ అత్యధిక ఆదాయాన్ని సాధించిన డివిజన్‌గా నిలిచింది. ఇంకా దేశంలోకెల్లా అత్యధిక లోడింగ్ సాధించిన ఐదవ డివిజన్‌గానూ స్థానాన్ని సంపాదించింది. వీటితో పాటు ట్రాఫిక్‌లో రూ.1,600 కోట్ల మేర పెరుగుదలతో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. అన్ని లోడింగ్ లక్ష్యాలను అధిగమిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి సారిగా 85.1 మిలియన్ టన్నుల లోడింగ్‌ను సాధించింఇద. ఇది డివిజన్ చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 17.25 శాతం వ్దృద్ధిని నమోదు చేసింది. లోడింగ్, అన్‌లోడింగ్ కలిసి 150 మిలియన్ టన్నులు దాటడం మరో రికార్డు. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 17.4 శాతం అధికం. రూ.10,422 కోట్ల ఆదాయం సాధించి 18.75 శాతం వృద్ధితో భారతీయ రైల్వేలో ఆదాయం, లోడింగ్‌ల్లో 5వ స్థానంలో నిలిచి వాల్తేరు డివిజన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.
ప్రయాణికుల పెరుగుదల ఇలా..
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య 33.42 మిలియన్లకు పెరిగి 6.6. శాతం వృద్ధిని సాదించింది. గత 21 ఏళ్లలో అత్యధికంగా రూ.881.37 కోట్ల ప్రయాణికుల ఆదాయం సాధించి గతేడాదికంటే 8.71 శాతం పెరుగుదల చూపింది. డివిజన్ మొత్తం ఆదాయం రూ.11,598.07 కోట్లకు చేరింఇ. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం అధికం. అలాగే క్యాటరింగ్ రూ.9.81 కోట్లు, నాన్–ఫేర్ రెవిన్యూ రూ.11.14 కోట్లు, టిక్కెట్టు చెకింగ్ రూ.26.21 కోట్లు, పార్కింగ్ రూ.4.26 కోట్లు, సండ్రీ రెవిన్యూ రూ.27.63 కోట్లతో ఉత్తమ ప్రదర్శన కనబరచింది.
వైజాగ్ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం రేటింగ్..
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు ప్లాటినం రేటింగ్ గ్రీన్ స్టేషన్ సర్టిఫికేషన్ లభించింది. అలాగే బీఎల్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ లోకో బ్యూటీ కాంటెస్ట్‌లో ఈఎల్‌ఎస్/విశాఖపట్నం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
డివిజన్‌లో బడ్జెట్ కేటాయింపులు ఇలా..
వాల్తేరు డివిజన్‌కు కేంద్ర సాధారణ బడ్జెట్‌లో (2026–27)లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.10,134 కోట్లు, ఒడిశాకు రూ.10,928 కోట్లు, చత్తీస్‌గఢ్‌కు రూ.7,470 కోట్ల చొప్పున కేటాయించారు. విశాఖపట్నంలోని వైశాఖి రైల్వే కాలనీలో కొత్త రైల్వే అధికారుల నివాస సముదాయాన్ని ప్రారంభించాం. బొబ్బిలిలో కొత్త ఆర్పీఎఫ్ అవుట్ పోస్టును ఏర్పాటు చేశాం. విశాఖ ప్రాంతంలో అదనపు లైన్లు, ఫ్లైవోవర్లు, స్టేషన్ అప్‌గ్రేడ్లు వంటి పలు ముఖ్య ప్రాజెక్టులు మంజూరయ్యాయి. విశాఖపట్నం ప్రాంతంలో అదనపు లైన్లు, ఫ్లై ఓవర్లు, స్టేషన్ అప్‌గ్రేడ్లు వంటి కీలక ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అమృత్ భారత్ పథకం కింద 15 స్టేషన్లు అభివృద్ధికి ఎంపికయ్యాయి.
ప్రయాణికులకు వసతులు.. సేవలు..
విజయనగరం రైల్వే స్టేషన్‌లో ఐఆర్‌సీటీసీ డార్మిటరల, రిటైరింగ్ రూమ్ సదుపాయాన్ని ప్రారÆ భించాం. రైళ్లలో శుభ్రమైన టీ, కాఫీ వెండింగ్ మిషన్లను ప్రవేశపెట్టాం. రైల్ వన్ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులతో బుక్ చేసిన అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్లపై 3 శాతం తగ్గింపు అమలు చేశాం. పండుగలు, సెలవుల్లో ప్రయాణికుల ర ద్దీని నిర్వహించడానికి 400 అదనపు కోచ్‌లు, 300 ప్రత్యేక రైళ్లను నడిపాం. తిలారు, హరిశ్చంద్రపురం, పాతపట్నం స్టేషన్లలో ప్రయోగాత్మక ఆపివేతలు అమలు చేసి కనెక్టివిటీ మెరుగు పరిచాం. వెయిట్ లిస్టు ఉన్న టిక్కెట్లకు అధునాతన చార్జింగ్ సిస్టం అమలు చేశాం. ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న విశాఖ–తిరుపతి, విశాఖ–చర్లపల్లి) కొన్ని ప్రత్యేక రైళ్లను వారాంతపు రైళ్లుగా మారబోతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్‌ను ఏర్పాటు చేశాం. అరకు, కొరాపుట్ స్టేషన్లలో వన్ స్టాప్, వన్ ప్రాడక్టు స్టాల్స్‌ను ఏర్పాటు చేసి స్థానిక కాఫీ బ్రాండ్లను ప్రోత్సహిస్తున్నాం.
భద్రత, ఆపరేషనల్ ప్రతిభ..
ప్రమాదాలను నివారించిన సిబ్బందికి డీఆర్‌ఎం భద్రతా అవార్డులను ప్రదానం చేశాం. విశాఖ స్టేషన్‌లో ఏఐ ఆధారిత రైల్ రోబోకాప్ (ఎఎస్‌సీ అర్జున్‌ను) ప్రవేశపెట్టాం. ఫేషియల్ గుర్తింపు ద్వారా నేరస్తులను గుర్తించి పట్టుకునే విధానం విజయవంతమైంది. విశాఖపట్నంలో 220, విజయనగరంలో 24 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశాం. మొత్తం సామర్థ్యానికి సంబంధించిన షీల్డ్‌తో పాటు 14 ఉత్తమ సామర్థ్య అవార్డులు దక్కాయి. 17 మంది ఉద్యోగులు విశిష్ట రైల్ సేవా పురస్కార్ అవార్డులు అందుకున్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు చెందిన ఆరుగురు కేడెట్లు రాష్ట్రప్రతి అవార్డులు పొందారు. 54 మంది ఉద్యోగులు రైల్ సేవా పురస్కారాలు పొందారు. మొత్తం ఆదాయం రూ.10 వేల కోట్లకు మించి నమోదు చేసి వాల్తేరు డివిజన్ బలమైన వృద్ధిని సాధించింది’ అని డీఆర్‌ఎం లలిత్ బోహ్రా మీడియాకు వివరించారు.
Next Story

