సొంత పౌరులపైనే యుద్ధం చేస్తోంది: సీజేపీ
x

సొంత పౌరులపైనే యుద్ధం చేస్తోంది: సీజేపీ

దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని హెచ్చరిక


బొద్దింకల జనతా పార్టీ నాయకులు విడుదలైన తరువాత ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘బీజేపీ గెలిచిన 2024 లోక్ సభ ఎన్నికలు లేదా ఇతర ఎన్నికల గురించి ఆయనకి ఏం తెలుసు. ఆయన్ని ఎందుకు రక్షించాల్సి వచ్చింది’’ అని సీజేపీ నాయకుడు సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తన సొంత పౌరులతోనే యుద్ధం చేస్తోందని అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని సృష్టించిందని ఆరోపించింది. సీఈసీ 48 గంటల్లో రాజీనామా చేయాలని లేకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక ధర్నా, ‘‘ఎన్నికల సంఘం థిక్ కరో’’ ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఉద్యమం తన దృష్టిని మోదీ, అమిత్ షా ల వైపు విస్తరిస్తుందని రాంకా బెదిరింపులకు దిగారు.
సీజేపీ నిరసనల కారణంగా ఢిల్లీలో మెట్రో, రైలు సర్వీసులపై నిషేధం విధించకూడదని, కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, కానీ ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. కోర్టు ధిక్కారం కింద పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ అయ్యాయి.
ప్రత్యేక విచారణలో జస్టిస్ లు జయమాల్చ బాగ్చి, వి. మోహన్ లతో కూడి ధర్మాసనం, శాంతిభద్రతల పరిస్థితులకు లోబడి, ఢిల్లీ మెట్రో దాని సాధారణ షెడ్యూల్ ప్రకారం పనిచేసేలా, ఇంటర్నేట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరింది. న్యాయవాదులు, పాత్రికేయులు, ఇతరులు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తించడంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని కూడా సుప్రీంకోర్టు మెహతాను ఆదేశించింది.
ఓటర్ల జాబితాలో ప్రత్యేక విస్తృత సవరణలో జరిగిన అవకతవకలపై సీఈసీ కుమార్ రాజీనామా చేయాలని, సీజేపీ, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ నిరసనకు ముందు నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని, ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. తరువాత వారిని మేజిస్ట్రేట్ గా ముందు హజరు పరచగా పలు షరతులపై వారిని విడుదల చేశారు.

ప్రజా మద్దతు కరవు...

సీజేపీ, విపక్షాలు చేస్తున్న ఆందోళనలకు ఎక్కడా ప్రజల మద్దతు కనిపించడం లేదు. కేవలం కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు, హక్కుల పేరు చెప్పుకుని నిత్యం ఆందోళనలు చేసే కొన్ని వర్గాలు మాత్రమే ఢిల్లీలో ఆందోళన చేసేందుకు ప్రయత్నించాయి. కానీ పోలీసులు మాత్రం ఈ నిరసనలు ముందుగా గుర్తించి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.


Read More
Next Story