
బీహార్ రెండో దశ పోలింగ్ మొదలు
దాదాపు 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈదశ పోలింగ్ లో వినియోగించుకోనున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ, చివరి దశ పోలింగ్ మంగళవారం (నవంబర్ 11) ప్రారంభమైంది. ఇది నితీష్ కుమార్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు సహా 1,302 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే కీలక దశ.
నేపాల్ తో సరిహద్దులను పంచుకునే పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామడి , మధుబని, సుపాల్, అరారియా కిషన్గాంజ్ తదితర జిల్లాల్లోని 122 నియోజకవర్గాలలో దాదాపు 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈదశ పోలింగ్ లో వినియోగించుకోనున్నారు.
Live Updates
- 11 Nov 2025 9:56 AM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైంది.
- 11 Nov 2025 9:31 AM IST
ప్రతిపక్షాలు వేరే సమస్య లేదు: కేంద్రమంత్రి
బీహార్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి సతీష్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లకి ఆరోపణలు చేయడం తప్ప మరో సమస్య లేదని అన్నారు. ‘‘ప్రజలు NDA కూటమికి ఓటు వేస్తున్నారు. 100% NDA మరియు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ప్రజలందరూ తమ పిల్లల భవిష్యత్తు కోసం, వారి దేశం మరియు రాష్ట్ర భవిష్యత్తు కోసం NDAకి అనుకూలంగా ఓటు వేయాలని మేము కోరుతాము" అని అన్నారు.
- 11 Nov 2025 9:23 AM IST
అందరూ ఓటు వేయాలి: బీహార్ బీజేపీ అధ్యక్షుడు
బీహార్ రెండో దశ పోలింగ్ సందర్బంగా ప్రతి ఓటరు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "ఈరోజు చివరి దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుండి దాదాపు అందరు NDA అభ్యర్థులతో మాట్లాడే అవకాశం నాకు లభించింది. చుట్టూ చాలా సానుకూల వాతావరణం ఉంది. ఓటర్లు ఖచ్చితంగా ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని అన్నారు.
- 11 Nov 2025 9:21 AM IST
బీహార్ ఎన్నిక రెండో దశ పోలింగ్‌పై కేంద్ర మంత్రి CM జితన్ రామ్ మాంఝీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "6/11న ఓటు వేసినట్లే, ఈసారి NDAకి అనుకూలంగా ఎక్కువ శాతం ఓట్లు వేయాలని నేను ప్రజలను హృదయపూర్వకంగా కోరుతున్నాను. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నందున... నరేంద్ర మోడీ 'పూర్వోదయ'ను ఊహించారు, ఇది బీహార్‌ను కూడా కలిగి ఉంది. ఇక్కడ ఏ కేటాయింపు ఇవ్వాలనుకున్నా, మనకు దానికి నాలుగు రెట్లు ఎక్కువ మొత్తం లభించింది... ఇంతకంటే మెరుగైన ప్రభుత్వం లేదు..." అని పేర్కొన్నారు.
- 11 Nov 2025 9:08 AM IST
ఓటర్లకు మాజీ మంత్రి సంతోష్ విజ్ఞప్తి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా ఓటర్లకు మాజీ మంత్రి, హిందుస్తానీ అవామ్ మోర్చా (లౌకిక) జాతీయ అధ్యక్షుడు సంతోష్ కుమార్ సుమన్ కీలక విజ్ఞప్తి చేశారు. "ప్రజాస్వామ్యంలో పాల్గొని, మీకు శాంతిని అందించగల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, బీహార్‌ను ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్నికల మొదటి దశలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఈసారి కూడా అదే రకమైన ఓటింగ్ జరగాలి... ప్రభుత్వం చేసిన పని ప్రభావం కనిపిస్తోంది..." అని అన్నారు.
- 11 Nov 2025 8:57 AM IST
ఓటు వేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ షాన్‌వాజ్ దంపతులు
బీహార్ రెండో విడత పోలింగ్‌లో భాగంగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ షాన్‌వాజ్ దంపతులు తమ ఫోటు హక్కును వినియోగించుకున్నారు. సయ్యద్ షానవాజ్ హుస్సేన్, ఆయన భార్య రేణు హుస్సేన్ సుపాల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్బంగా.. రేణు హుస్సేన్ మాట్లాడుతూ, "నేను వివాహం చేసుకున్న తర్వాత మొదటిసారి ఇక్కడ ఓటు వేస్తున్నాను. బీహార్ ప్రజలు అభివృద్ధి కోసం ఓటు వేస్తున్నారని తెలిసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. 30 సంవత్సరాల క్రితం నేను వివాహం చేసుకున్న తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చిన సుపాల్‌కు, నేటి సుపాల్‌కు చాలా తేడా ఉంది... నేను ఈరోజు ఇక్కడ ఓటు వేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నాకు గర్వంగా ఉంది." అని తెలిపారు.
- 11 Nov 2025 8:39 AM IST
పూర్నియాలోని స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్ రెండో విడత పోలింగ్‌లో భాగంగా పూర్నియాలోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.


