ఒలింపిక్స్ ఉసూరుమనిపించినా.. ఎన్నికల్లో అదరగొట్టిన వినేష్
x

ఒలింపిక్స్ ఉసూరుమనిపించినా.. ఎన్నికల్లో అదరగొట్టిన వినేష్

ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలిపింక్స్‌లో అనర్హత వేటుకు గురై ఉసూరుమనిపించని అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించి తాను నిజమైన యోధరాలినని నిరూపించుకున్నారు.


ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలిపింక్స్‌లో అనర్హత వేటుకు గురై ఉసూరుమనిపించని అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించి తాను నిజమైన యోధరాలినని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ తరపున హర్యానా ఎన్నికల బరిలో నిల్చున్న ఈమె ఘన విజయం సొంతం చేసుకున్నారు. జులానా నియోజకవర్గం నుంచి విజయం సాధించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఆమె విజయం ఇప్పుడు హర్యానా ఎన్నికల్లోనే కీలకంగా మారింది. కేంద్రంలోని ప్రభుత్వంపై పోరాడి, ఒలిపింక్స్ ఎదురుదెబ్బ తెన్నిప్పటికి నిరాశకు గురికాకుండా జీవితం విసురుతున్న సవాళ్లను ఛేదించిన వినేష్ ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తారంటూ కాంగ్రెన్ నేతలు కొనియాడుతున్నారు. అయితే ఈరోజు హర్యానా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఆమె కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సమయంలో వినేష్ వెనకంజలో ఉండటంతో ఓటమి పరాభవాన్ని తట్టుకోలేకే ఆమె ఇంటి దారి పట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తించారు. కానీ తీరా ఫలితాలు మాత్రం వేరేగానే చెప్పాయి. అనూహ్యంగా వినేష్ ఫోగట్ విజయం సాధించారు.

కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేష్

జులానా స్థానం నుంచి కాంగ్రెస్ తరపున వినేష్ ఫోగట్, బీజేపీ తరపున యోగేష్ బైరాగి బరిలో ఉన్నారు. ఈరోజు కౌంటింగ్ సమయంలో 4వ రౌండ్ లెక్కింపు సమయంలో వినేష్ ఫోగట్.. జింద్ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. 4వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి ఆమె 3వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. దీంతో వినేష్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. బైరాగి అనుచర వర్గం సంబరాలు కూడా ప్రారంభించేసింది. ఇంతలో ఫలితాలు తలకిందులయ్యాయి. 15వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమాయానికి వినేష్ ఫోగట్ 4వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ లెక్కింపు తొలి రౌండ్ నుంచే వినేష్ ముందంజలో ఉన్నా.. మధ్యలో కాస్తంత కుదుపు వచ్చింది. మళ్ళీ 8వ రౌండ్ నుంచి వినేష్ పుంజుకుని చివరకు 4వేల మెజార్టీ సాధించారు.

లక్ష్యాన్ని దూరం చేసిన బరువు..

ప్యారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలన్న రెజ్లర్ వినేష్ ఫోగట్ కల నెరవేరలేదు. మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్స్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఫైనల్స్‌లో పాల్గొనాల్సి ఉంది. USA కు చెందిన సారా ఆన్ హిల్డెబ్రాండ్‌తో తలపడాల్సి ఉంది. అయితే ఆమె ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాములు ఎక్కువుగా ఉన్నట్లు తేలింది. రాత్రి అంతా బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉదయం బరువు పరీక్షించే సమయానికి ఆమె 50 కేజీలకు మించి బరువు ఉండటంతో అనర్హత వేటు పడింది. ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్‌కు స్వర్ణం ఖాయమని భారతీయులంతా ఆకాంక్షించారు. కానీ అధిక బరువు ఆమె లక్ష్యాన్ని దూరంచేసింది. కానీ తన పోరాటం ఇంతటితో ఆగలేదని ఇదే ఆరంభమని ప్రకటించిన ఫోగట్.. రాజకీయ రంగప్రవేశం చేసి, ఎన్నికల బరిలో నిల్చుని ఘన విజయం సాధించడం ఇప్పుడు కీలకంగా మారింది.

Read More
Next Story