
ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్
న్యాయ వ్యవస్థ తీరుపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఆందోళన
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం పనిచేస్తున్నారని ప్రశ్నలు, జస్టిస్ యశ్వంత్ శర్మ ఇంట్లో నోట్ల కట్టలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని ఆందోళన
చట్టాలు చేసే ‘సూపర్ పార్లమెంట్’ గా వ్యవహరించే న్యాయమూర్తులను భారత్ కోరుకోవడం లేదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ వ్యాఖ్యానించారు. బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితిని నిర్దేశించిన సుప్రీంకోర్టు తీర్పుపై ఉపరాష్ట్రపతి గురువారం ఆందోళన వ్యక్తం చేశారు.
గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల గడువును సుప్రీంకోర్టు విధించిన కొన్ని రోజుల తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పరిశీలన కోసం రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై ఆయన మాట్లాడుతూ... దేశం ఎటువైపు వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇటీవలి తీర్పు ద్వారా రాష్ట్రపతికి ఒక ఆదేశం ఇచ్చారు. మనం ఎటువైపు వెళ్తున్నాం. దేశంలో ఏం జరుగుతోంది? మనం చాలా సున్నితంగా ఉండాలి.
ఎవరైన సమీక్ష దాఖలు చేస్తారా అనేది పెద్ద ప్రశ్న కాదు. ఈ రోజు ప్రజాస్వామ్యం కోసం మేము ఎప్పుడూ బేరసారాలు చేయలేదు. కాలపరిమితిలో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని ఆదేశించింది. గడువులోపు స్పందించకపోతే అది చట్టంగా మారుతుంది’’ అని ధంఖర్ అన్నారు.
రాజ్యసభ ఇంటర్న్ ల బృందాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలుచేశారు. ఇప్పుడు కొంతమంది న్యాయమూర్తులు చట్టాలను రూపొందించడమే కాకుండా కార్యనిర్వహాక విధులను కూడా నిర్వర్తించి, ఎటువంటి జవాబుదారి తనం లేకుండా సూపర్ పార్లమెంట్ గా వ్యవహరిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘మనకు చట్టాలు చేసే, కార్యనిర్వాహాక విధులు నిర్వర్తించే సూపర్ పార్లమెంట్ గా వ్యవహరించే న్యాయమూర్తులు ఉన్నారు. చట్టం వారికి వర్తించదు. వారికి ఎటువంటి జవాబుదారీతనం ఉండదు’’ అని ధంఖర్ అన్నారు.
కేంద్రంలో ఆందోళనలు..
తన ఆందోళనలు ‘‘చాలా అత్యున్నత స్థాయిలో ’’ ఉన్నాయన్నారు. ఇలాంటివి చూసే అవకాశం తనకు వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని ఆయన అన్నారు. భారత రాష్ట్రపతి పదవి ఉన్నతమైనదని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రక్షించడానికి రాష్ట్రపతి ప్రమాణం చేస్తారని ఆయన నొక్కి చెప్పారు. మంత్రులు, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ సభ్యులు, న్యాయమూర్తులు సహ ఇతరులు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు.
‘‘మీరు భారత రాష్ట్రపతిని ఏ ప్రాతిపదికన నిర్దేశిస్తారో మాకు తెలియదు. రాజ్యాంగం ప్రకారం మీకు ఉన్న ఏకైక హక్కు ఆర్టికల్ 145(3) ప్రకారం రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం, అక్కడ ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండాలి’’ అని ఆయన అన్నారు.
న్యాయమూర్తి నగదు వివాదం..
హైకోర్టు న్యాయమూర్తి నివాసం నుంచి కాలిపోయిన నగదు కేసును కనుగొన్న సందర్భంలో ఎఫ్ఐఆర్ లేకపోవడాన్ని ధంఖర్ ప్రశ్నించారు. ‘‘చట్టానికి మించిన వక్తులు’’ చట్టం, ప్రాసిక్యూషన్ నుంచి ఎటువంటి మినహయింపు పొందారు అని ఆశ్చర్యపోయారు.
మార్చి 14న హోలీ పండగ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం తరువాత జస్టిస్ యశ్వంత్ శర్మ నివాసం నుంచి సగం కాలిపోయిన నగదు నోట్లు దొరికిన ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత దర్యాప్తుకు ఆదేశించింది. జస్టిస్ వర్మను ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు నుంచి ఆయన మాతృ సంస్థ అయిన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.
ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్న ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ చట్టపరమైన అధికారాలను సైతం ధంఖర్ ప్రశ్నించారు. ఈ కేసును ప్రస్తావిస్తూ .. న్యాయమూర్తి ఇంట్లో నగదు దొరకడంపై ప్రతి భారతీయుడు ఆందోళన చెందుతున్నాడని చెప్పారు.
ఈ సంఘటన ఓ సామాన్యుడి ఇంట్లో జరిగి ఉంటే.. కేసులో వేగం రాకెట్ లా ఉండేది.’’ అన్నారు. ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ఈ విషయాన్ని దర్యాప్తు అనేది కార్యనిర్వహాక వర్గం పరిధి, న్యాయవ్యవస్థది కాదని ధంఖర్ అన్నారు.
చట్టపరమైన స్థితి లేదు
రాజ్యాంగంలోని లేదా చట్టంలోని ఏ నిబంధన కింద కమిటీని ఏర్పాటు చేశారని ధంఖర్ ప్రశించారు. ‘‘ఈ సుప్రీంకోర్టు కమిటీ ఏం చేయగలదు. కమిటీ నిర్ధిష్టంగా సిఫార్సు చేయగలదు. ఎవరికి సిఫార్సు చేయాలి. దేనికి సిఫార్సు చేయాలి? న్యాయమూర్తుల కోసం మనకు ఉన్న యంత్రాంగం చివరకు తీసుకోగల ఏకైక చర్య పార్లమెంట్ (న్యాయమూర్తిని తొలగించడం ద్వారా)’’ అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు నివేదికకు స్వాభావికంగా చట్టపరమైన హోదా లేదని ధంఖర్ అన్నారు. ఈ సంఘటన జరిగి చాలా రోజులైందని మరోసారి ఉప రాష్ట్రపతి గుర్తు చేశారు.
Next Story