గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అమెరికా కోర్టు
భారత బిలియనీర్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ పరిణామంతో ఆయన కంపెనీ షేర్లు ఇరవై శాతం పతనం అయ్యాయి.
భారత కుబేరుడు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ కంపెనీ సీనియర్ అధికారి వినీత్ జైన్ మీద అమెరికా కోర్టు విచారణ జరుగుతోంది. అమెరికాలో కాంట్రాక్ట్ పనులు చేయడానికి లంచాలు ఇచ్చారనే అంశంపై స్థానిక కోర్టు విచారణ జరపుతున్నాయి. దీనిపై వార్తలు బయటకు రాగానే గురువారం స్టాక్ మార్కెట్ లో ఆయన షేర్లు భారీ పతనం చవిచూశాయి.
ట్రేడ్ ప్రారంభం కాగానే షేర్ల విలువ 20 శాతం దాకా పడిపోయింది. అమెరికా న్యూయార్క్ లోని ఒక కోర్టు చేసిన నిందారోపణలో అదానీని అరెస్టు చేసేందుకు వారంట్ కూడా జారీ అయింది. దీని వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడ అదానీ కంపెనీలు ఉన్నాయో అక్కడంతా ఈ కంపెనీల కార్యకలాపాల మీద దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. బుధవారం నాడు అమెరికా ప్రాసెక్యూటర్లు చేసిన ఆరోపణ బయటి ప్రపంచానికి చాలా తీవ్రమయినది.
ఇండియాలో లంచం ఇవ్వడం తీసుకోవడం అంత అమర్యాదకరమయిన పని కాదు. అయితే, బయటి ప్రపంచం దాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. అమెరికా ప్రాసెక్యూటర్లు చేసిన ఆరోపణ ప్రకారం, అదానీకి కంపెనీకి చైర్మన్ అయిన గౌతమ్ అదానీతో పాటు మరొక ఏడుగురు వ్యక్తులు భారతీయ అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చి సోలార్ ప్రాజెక్టుల కాంట్రాక్ట్ లను కొట్టేశారని ఆరోపించారు.
ఈ లంచాల పంపకం 2020 నుంచి 2024 మధ్య జోరుగా సాగింది. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను అమెరికా కోర్టు పరిశీలించింది. ఈ కాంట్రాక్టుల వల్ల అదానీకి వచ్చే 20 యేళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాలు వస్తాయి. అధికారులు పంచిన లంచాలు అందాల్సిన వారికి అందాయాలేదా అనే విషయాన్ని గౌతమ్ అదానీ ఫోన్ నుంచే ఆయన బంధువు సాగర్ అదానీ ట్రాక్ చేశాడు. ఈ సమాచారం అంతా అమెరికా ప్రాసెక్యూటర్లు సేకరించి కోర్టు ముందుంచారు.
అమెరికా కోర్టు తేల్చిన అవినీతి ఆరోపణ వల్ల అదానికీ చాలా రకాలకష్టాలు రావచ్చు. విదేశాలలో ఆయన కంపెనీలు ఎలా కాంట్రాక్లు సంపాదించాయో విచారణ జరగవచ్చు. బ్యాంకులను నిధుల సమీకరణ కష్టం కావచ్చు. ఎందుకంటే, ప్రపంచంలోని అనేక దేశాలలో అదానీ గ్రూప్ కు విమానాశ్రయాలు, విద్యుత్ కంపెనీలు ఉన్నాయి. లంచం, అక్రమాలు, సక్యూరిటీ నియమాలను ఉల్లంఘించడం వంటి నేరారోపణలు అదానీ కంపెనీల మీద ఉన్నాయి.
Next Story