ప్రాణం తీసిన చిన్న వివాదం.. ఉత్తరప్రదేశ్‌లో భయానక ఘటన
x

ప్రాణం తీసిన చిన్న వివాదం.. ఉత్తరప్రదేశ్‌లో భయానక ఘటన

ఐస్‌క్రీమ్ విక్రేతను దారుణంగా హత్య చేసి తల నరికి ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు


Click the Play button to hear this message in audio format

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బరబంకి జిల్లాలో మార్చి 29న దారుణ ఘటన చోటుచేసుకుంది. పర్సావాల్ గ్రామంలో 50 ఏళ్ల శంకర్ యాదవ్, 25 ఏళ్ల ఐస్‌క్రీమ్ విక్రేత బబ్లూను కిరాతకంగా హత్య చేశాడు. సమీప గ్రామానికి చెందిన బబ్లూ, జీవనోపాధి కోసం ఐస్‌క్రీమ్‌లు అమ్ముకునేందుకు తరచూ పర్సావాల్‌కు వచ్చేవాడు. ఘటన జరిగిన రోజున కూడా వచ్చాడు. అయితే, గ్రామంలో వ్యాపారం చేయడంపై శంకర్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం హింసకు దారితీసింది. యాదవ్ ఆగ్రహంతో బబ్లూపై కొడవలితో దాడి చేశాడు. దాంతో బబ్లూ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.

కాని దారుణానికి పాల్పడిన తర్వాత నిందితుడు పారిపోలేదు. బబ్లూ తల నరికి, తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ వంట చేస్తూ ఉండగా, ఆ తలను కాల్చేందుకు కూడా ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితుడి ఇంటిని చుట్టుముట్టాయి. ఇంట్లోనే ఉన్న యాదవ్‌ను అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడికి మానసిక స్థితి సరిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వివాదమే అయినా హత్యకు దారితీసిందని వారంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

బబ్లూ కుటుంబానికి అతడే ప్రధాన ఆదాయ వనరు. అతనికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Read More
Next Story