
యువతకు ఉగాది కానుక
సోషల్ మీడియా వేదికగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన మంత్రి లోకేష్.
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, మంత్రి నారా లోకేష్ ఈ ప్రకటన చేయడం విశేషం.
10,060 ఉద్యోగాలతో ఉద్యోగాల పండుగ
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఏ తేదీన నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు అనే అంశాలను స్పష్టంగా క్యాలెండర్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులకు సౌకర్యార్థం పరీక్షల సిలబస్‌ను కూడా ముందుగానే ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి, పారదర్శకంగా పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
ప్రతి ఏటా ఉగాదికి కొలువుల జాతర
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తన ’ఎక్స్‘ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన మాటను మా ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇకపై ప్రతి ఏటా ఉగాదికి 'ఉద్యోగాల ప్రకటన పండుగ' ఉంటుంది. నిరుద్యోగులు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు.
రిజిస్ట్రేషన్ కోసం నైపుణ్యం పోర్టల్
ఉద్యోగార్థులందరూ వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైపుణ్యం పోర్టల్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. దీనివల్ల నోటిఫికేషన్లకు సంబంధించిన అలెర్ట్స్ ఎప్పటికప్పుడు అభ్యర్థుల మొబైల్‌కు అందుతాయని వివరించారు.
#APJobCalender2026
— Lokesh Nara (@naralokesh) March 19, 2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి… pic.twitter.com/CvTOyZK4bz
Next Story

