‘‘హమాస్ కు ట్రంప్ అల్టిమేటం.. జనవరి 20 లోపు బందీలను విడిచిపెట్టాలి’’
x

‘‘హమాస్ కు ట్రంప్ అల్టిమేటం.. జనవరి 20 లోపు బందీలను విడిచిపెట్టాలి’’

నరకపు తలుపులు బద్ధలు కొడతామని హెచ్చరిక


అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాద సంస్థ హమాస్ కు అల్టిమేటం జారీ చేశారు. తాను జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేయబోయే సమయానికి అక్టోబర్ 7, 2023 న ఇజ్రాయెల్ పై దాడి చేసి బందీగా తీసుకుపోయిన ప్రజలందరిని విడిచిపెట్టాలని హెచ్చరికలు జారీ చేశారు. లేకుంటే నరకాన్ని బద్దలు కొడతాం అని తనదైన శైలిలో మాట్లాడారు.

ఫ్లోరిడాలోని మార్ ఏ లాగోలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ బందీలంతా బయటకు వదలకపోతే మధ్య ప్రాచ్యంలో నరకపు తలుపులను బద్ధలు కొడతాం. నాకు మీ చర్చలు కొనసాగడం ఇష్టం. కానీ బందీలను మాత్రం విడిచిపెట్టాలి’’ అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం చర్చల విషయంలో జరగుతున్న విషయంలో ఆలస్యంపై నేను మాట్లాడటం లేదు. ప్రతి అంశాన్ని ప్రతికూలంగా చూడాల్సిన పనిలేదని అన్నారు. అక్కడి నుంచి వచ్చిన ప్రత్యేక రాయబారి చార్లెస్ విట్ కాఫ్ మాట్లాడుతూ.. ‘‘ వారు నరకం అంచున ఉన్నారు’’అని వ్యాఖ్యానించారు. చర్చలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో నాకు తెలియదని చెప్పారు. కానీ కాబోయే అధ్యక్షుడు దీనిపై స్పష్టమైన వైఖరితో ఉన్నారని మాత్రం పేర్కొన్నారు. తాను తిరిగి చర్చల్లో పాల్గొనేందుకు తిరిగి రేపు దోహ వెళ్తున్నా అని చెప్పారు. దీనిపై కచ్చితంగా మంచి శుభవార్తతో వస్తానని అన్నారు.
ట్రంప్ రావడం హమాస్ కు మంచి పరిణామం కాదని అన్నారు. బందీలను ఎక్కువ రోజులు ఉంచుకోకూడదని అన్నారు. వారిని వీలైనంత త్వరగా విడిచిపెట్టాలని కోరారు. నేను ఎవరికి బాధపెట్టాలని అనుకోవడం లేదు. నేను చార్జ్ తీసుకోవడానికి కంటే ముందే అన్ని సెట్ చేసుకుంటే ఉత్తమం. లేకపోతే ఆ నరకపు కూపాన్ని బద్దలు కొడతామని అన్నారు.
Read More
Next Story