అమెరికా కష్టాలన్నీ తీరుస్తా : ట్రంప్
చారిత్రాత్మకమైన వేగంతో నిర్ణయాలు ఉంటాయని ప్రజలకు హమీ
ఆధునిక చరిత్రలో అమెరికా ఎదుర్కొంటున్న ప్రతి సంక్షోభాన్ని తాను చారిత్రాత్మక వేగంతో పని చేసి పరిష్కరిస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్ధతుదారులు, దేశ ప్రజలకు హమీ ఇచ్చారు. క్యాపిటర్ వర్ అరేనాలో తన మద్ధతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.
మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కోసం తన శక్తిని మొత్తం ధారపోస్తానని ఆయన ప్రతినబూనారు. ఈ సమావేశానికి దాదాపుగా 20 వేల మంది హజరయ్యారు. స్టేడియం సామర్థ్యానికి మించి ప్రజలు రావడంతో చాలా మంది బయటే వేచి ఉన్నారు.
మొదటి సంతకం వాటిపైనే చేయబోతున్న ట్రంప్
అమెరికా 47 వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ట్రంప్ బైబిల్ పై ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తి అవగానే తన అధ్యక్ష అధికారాన్ని ఉపయోగించి కాంగ్రెస్( పార్లమెంట్) అనుమతి లేకుండానే కొన్ని ఉత్తర్వూలను జారీ చేయబోతున్నారని తెలిసింది. అయితే వీటిని న్యాయస్థానంలో సవాల్ చేసే అధికారం ఉంటుంది.
అక్రమ వలసలు, ప్రభుత్వ నియామక విధానాల్లో మార్పులు వంటి ప్రతిష్టాత్మక అంశాలపై ట్రంప్ బృందం కార్యచరణ ను ఇప్పటికే రూపొందించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
టెక్సాస్ సరిహద్దులో అత్యవసర పరిస్థితి
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించడం, సైనికుల మోహరింపును పెంచడం, , కార్టెల్ లను( నేరగాళ్ల ముఠా) విదేశీ ఉగ్రవాదులుగా ప్రకటించడం వంటివి ఉన్నాయని సీనియర్ రిపబ్లికన్ నాయకుడు ట్రంప్ ఇన్ కమింగ్ వైట్ హౌజ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాప్ పేర్కొన్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. అలాగే రిమైన్ ఇన్ మెక్సికో విధానాన్ని పునరుద్దరణ, క్యాచ్ అండ్ రిలీజ్ విధానాన్ని ముగించడం వంటి మరికొన్ని అంశాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు.
ఆర్కిటిక్ ప్రాంతంలో డ్రిల్లింగ్ ను తిరిగి ప్రారంభించడం, పైప్ లైన్ లైసెన్సింగ్ విధానం వేగవంతం చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు సంస్కరణలు, లింగ సంబంధిత ఆర్డర్ లు రద్దు వంటివి జాబితాలో ఉన్నాయి.
అమెరికన్ పౌరుడికి న్యాయం..
ట్రంప్ విజయోత్సవ ర్యాలీలో రిపబ్లిక్ నాయకుడు మిల్లర్ మాట్లాడుతూ... ‘‘ అతను (ట్రంప్) ఎప్పుడూ మనందరి కోసం పోరాడుతూనే ఉన్నాడు. సోమవారం అది ఎలా ప్రారంభమవుతుందో చూడండి. సరిహద్దును మూయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, యుద్దాలు ముగించడం, అమెరికాకు మునుపటి వైభవం తీసుకురావడం వంటి వాటిని అమలు చేస్తాం. మనదేశ ప్రజలను వెంటాడుతున్న చట్టవిరుద్దమై క్రిమినల్ కార్టెల్స్ ను నిర్మూలన, అలాగే ప్రతి అమెరికన్ పౌరుడికి న్యాయం చేయడం ట్రంప్ లక్ష్యం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
పెట్టుబడులకు ఊపు..
తన రాకతో దేశంలో పెట్టుబడుదారులకు భరోసా వచ్చిందని, దీన్ని ట్రంప్ ఎఫెక్ట్ గా కాబోయే అధ్యక్షుడు అభివర్ణించారు. ఈ ఎఫెక్ట్ వెనక ఉన్నది మీరే అని ట్రంప్ అన్నారు. ‘‘ ఎన్నికల తరువాత స్టాక్ మార్కెట్ పెరిగింది. చిన్న వ్యాపార సంస్థల ఆశావాదం రికార్డు స్థాయిలో 41 పాయింట్లు పెరిగి, 39 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. బిట్ కాయిన్ మార్కెట్లకు రికార్డు స్థాయిలో విలువ పలికింది. ప్రముఖ పెట్టబడి సంస్థ డీఎంసీసీ 20 బిలియన్ డాలర్ల నుంచి 40 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెడుతున్న ప్రకటించింది. ’’ ఇవన్నీ తన రాకతోనే సాధ్యం అయ్యాయని ట్రంప్ అన్నారు.
మొదటిరోజు ప్రణాళికలు..
ఆదివారం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ను కలిసిన తరువాత ట్రంప్ మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆపిల్ సంస్థ దేశంలో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారని చెప్పుకొచ్చారు. అలాగే మిడిల్ ఈస్ట్( పశ్చిమ ఆసియా) లో కూడా తన ప్రభావంతోనే పరిస్థితి సద్దుమణిగిందని, జో బైడెన్ పరిపాలన ఉన్న నాలుగేళ్ల కాలంలో జరగనిది.. తాను కేవలం కొన్ని నెలల్లోనే సాధించినట్లు చెప్పుకొచ్చారు. ఇక నాలుగు సంవత్సరాలు వైట్ హౌజ్ లో ఉంటాను. ఎన్ని విజయాలు సాధిస్తానో చూడండి అన్నారు.
ట్రంప్ పునరాగమనం..
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్, కమలా హ్యరిస్ న ఓడించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇంతకుముందు కూడా ఆయన అధ్యక్షుడిగా పని చేశారు. దాదాపు వందేళ్ల తరువాత మాజీ అధ్యక్షుడు నాలుగేళ్ల విరామం తిరిగి పోటీ చేసి గెలిచిన రికార్డుల జాబితాలో ట్రంప్ నిలిచారు. తన పదవీకాలంలో జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలను పున: పరిశీలించాలని కూడా ట్రంప్ భావిస్తున్నారు. ముఖ్యంగా పారిస్ వాతావరణ ఒప్పందం, శిలాజ ఇంధనాల ఉత్పత్తిపై పరిమితిని ఎత్తివేయడం, దేశీయ చమురు డ్రిల్లింగ్ ను విస్తరించడం వంటివి ఉన్నాయి.
Next Story