
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అన్ని దేశాలపై టారిఫ్ ల యుద్దం ప్రకటించిన ట్రంప్
భారత్ పై సైతం 26 శాతం సుంకం విధించిన వాషింగ్టన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రపంచంలోని అన్ని దేశాలపై విస్తృత శ్రేణిలో కొత్త సుంకాలు ప్రకటించారు. ముఖ్యంగా చైనాపై అత్యధికంగా 34 శాతం విధించగా, తన భాగస్వామి అయిన యూరోపియన్ యూనియన్ పై 20 శాతం విధించారు.
ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సంక్షోభం సృష్టించే అవకాశం ఉందని, విసృత వాణిజ్య యుద్దానికి దారితీసే పరిస్థితి ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నప్పటికీ వాషింగ్టన్ వెనక్కి తగ్గడం లేదు.
అమెరికాతో వాణిజ్యం నడుపుతూ, మిగులు సాధిస్తున్న అన్ని దేశాలపై అధిక సుంకాలను విధిస్తున్నట్లు, అలాగే అన్ని దేశాల దిగుమతులపై పదిశాతం బేస్ లైన్ పన్నులు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
అధ్యక్షుడి దూకుడు..
అమెరికాలో తయారీని ప్రొత్సహించడానికే సుంకాలు విధిస్తున్నామని చెబుతున్న ట్రంప్, రెండో ప్రపంచ యుద్దం తరువాత అమెరికానే నిర్మించిన ప్రపంచ వాణిజ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నారు.
ట్రంప్ వాదన ప్రకారం.. ‘‘మనదేశాన్ని (యూఎస్ఏ) ఇతర దేశాలు దోచుకున్నాయి. అత్యాచారం చేశాయి. ఇప్పటికి దోచుకుంటున్నాయి’’ వాటిని నివారించడానికి తాను చర్యలు తీసుకుంటున్నట్లు సమర్థించుకుంటున్నారు.
అమెరికా ప్రభుత్వానికి వందల బిలియన్ల కొత్త ఆదాయాన్నితీసుకురావడానికి, ప్రపంచ వాణిజ్యంలో న్యాయాన్ని పునరుద్దరించడానికి తాను చర్య తీసుకుంటున్నామని ట్రంప్ ప్రకటించారు కూడా.
అయితే ఈ చర్య ప్రపంచ వాణిజ్యాన్ని అనిశ్చిత స్థితిలోకి నెట్టడమే కాకుండా, పన్నును విపరీతంగా పెంచే అవకాశం ఉంది. గృహాలు, ఆటోలు, దుస్తులు, వంటి మధ్య తరగతి నిత్యావసరాలను చాలా ఖరీదైనవి మారుస్తాయి.
అదే సమయంలో వివిధ దేశాలతో శాంతి, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడానికి కుదుర్చుకున్న పొత్తులు దెబ్బతీస్తుందని, అమెరికన్లకు పెనుభారంగా మారుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి..
‘‘ఐదు దశాబ్దాలకు పైగా అమెరికా పన్ను చెల్లింపుదారులను దోచుకున్నారు’’ అని ట్రంప్ వాదన. ఇక ముందు అమెరికాలో అది జరగకుండా చూసుకుంటానని అధ్యక్షుడు వాదిస్తున్నారు.
ప్రస్తుతం సుంకాలను విధించడానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పన్నుల ఫలితంగా ఫ్యాక్టరీ ఉద్యోగాలు అమెరికాకు తిరిగి వస్తాయని ఆయన హమీ ఇచ్చారు. కానీ ఆయన విధానాలు, వినియోగదారులు, వ్యాపారాల ధరల పెరుగుదలను ఎదుర్కోవాల్సి రావడంతో ఆకస్మిక ఆర్థిక మందగమనానికి దారి తీసే ప్రమాదం ఉందని అంచనాలు ఉన్నాయి.
1977 అంతర్జాతీయ అత్యవసర అధికారాల చట్టం ప్రకారం.. కాంగ్రెస్ లేకుండా వ్యవహరిస్తూ, వాణిజ్య భాగస్వాములపై పరస్పర సుంకాలను విధించడం ద్వారా ట్రంప్ ఒక కీలకమైన ప్రచార వాగ్థానాన్ని నెరవేరుస్తున్నారు.
ఇప్పుడు తీసుకున్న చర్య అమెరికన్ ఓటర్లకు ట్రంప్ ఇచ్చిన వాగ్థానాన్ని నెరవేరుస్తుంది కానీ భవిష్యత్ లో ఇది అమెరికాలో పెను సంక్షోభాన్ని సృష్టిస్తుంది.
మహా మాంద్యం భయాలు..
‘‘ప్రస్తుత యూఎస్ సుంకాలు 1930 స్మూట్ హాలీ టారిఫ్ చట్టం తరువాత ఎన్నడూ చూడని స్థాయికి చేరుకుంటాయి. ఇది ప్రపంచంలో వాణిజ్య యుద్దాన్ని ప్రేరేపించింది. మహా మాంద్యాన్ని తీవ్రతరం చేసింది.’’ అని లిబర్టేరియన్ థింక్ ట్యాంక్ అయిన కాటో ఇన్స్టిట్యూట్ కు చెందిన స్కాట్ లింసికోమ్, కాలిన్ గాబ్రో అన్నారు.
అమెరికాతో వాణిజ్య అసమతుల్యత వల్ల గత సంవత్సరం 1.2 ట్రిలియన్ డాలర్ల తాము నష్టపోయామని అమెరికా పేర్కొంది. దానివల్లే కొత్త సుంకాలు విధిస్తున్నామని వాషింగ్టన్ పేర్కొంది. అయితే సుంకాలు విధించిన దేశాలు ప్రతీకార సుంకాలు విధిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.
ఈ సుంకాలపై ఫిచ్ రేటింగ్స్ లో అమెరికా ఆర్థిక పరిశోధన విభాగాధిపతి ఓలు సోనోలా మాట్లాడుతూ.. అమెరికా వసూలు చేసే సుంకం రేటు 2024 లో 2.5 ఉండేదని 22 శాతానికి పెరుగుతుందని అన్నారు.
‘‘చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలో జారుకునే అవకాశం ఉంది’’ అని సోనోలా అన్నారు. ఈ సుంకం రేటు ఎక్కువ కాలం కొనసాగితే మీరు చాలా అంచనాలను పక్కన పెట్టవచ్చు’’.
కెనడా, మెక్సికోలకు..
ఆటో దిగుమతులపై 25 శాతం పన్నులు విధిస్తున్నారు. వీటిలో చైనా, కెనడా, మెక్సికోలపై సుంకాలు అనేవి ఉక్కు, అల్యూమినియంపై ఇంతకుముందే సుంకాలు విధిస్తాయి.
వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై కూడా ట్రంప్ సుంకాలు విధించారు. ఔషధ మందులు, కలప, రాగి, కంప్యూటర్ చిప్ లపై ప్రత్యేక దిగుమతి పన్నులను ప్లాన్ చేస్తున్నారు.
అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నంలో కెనడా, మెక్సికో ఇప్పటికే వాటిపై వసూలు చేస్తున్న అధిక రేట్లను పక్కకు పెట్టారు.
ఫెంటానిల్ ఉత్పత్తిలో చైనా పాత్ర కారణంగా చైనా నుంచి దిగుమతులపై విధించే 20 శాతం పన్నును తాజాగా 34 శాతానికి పెంచనున్నారు. అలాగే అతను తరువాత సుంకం విధించాలని యోచిస్తున్న ఔషధ వంటి ఉత్పత్తులకు మినహయింపు ఉంటుంది.
ఎదురుదాడి బెదిరింపులు..
పన్నుల వల్ల స్టాక్ మార్కెట్ పడిపోతుందని హెచ్చరికలు ఉన్నప్పటికీ ట్రంప్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రతి దేశంపై పదిశాతం బేస్ లైన్ ఉందని చెబుతున్నారు.
ఏప్రిల్ 9 నుంచి అధిక రేట్లు వసూలు అమల్లోకి వస్తున్నాయి. చైనా నుంచి 800 డాలర్ల లేదా అంతకంటే తక్కువ విలువైన దిగుమతులపై సుంకం మినహయింపులను ట్రంప్ తొలగించారు.
థింక్ ట్యాంక్ లు ఏమి చెబుతున్నాయి..
అధిక టారిఫ్ ల వల్ల వృద్ది కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వైట్ హౌజ్ నాయకులు చెబతున్నప్పటికీ ప్రస్తుతం దీనిపై ముందుకే వెళ్తున్నారు. ట్రంప్ ఈ సుంకాలను స్వయంగా అమలు చేయబోతున్నాడు.
కాంగ్రెస్( పార్లమెంట్) ఆమోదం లేకుండా అలా చేయడానికి ఆయనకు మార్గాలు ఉన్నాయి. ఇది డెమోక్రాటిక్ చట్టసభ సభ్యులు రిపబ్లిక్ పరిపాలనను విమర్శించడం సులభం చేస్తుంది.
బీజింగ్ ఏం చెబుతోంది..
కొత్త సుంకాలను చైనా ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ‘‘రక్షణవాదం ఎక్కడికి దారితీయదని చైనా నమ్ముతుంది. వాణిజ్య, సుంకాల యుద్దాల్లో విజేతలు ఉండరు. ఇది అంతర్జాతీయ సమాజంలో విస్తృతంగా గుర్తించబడింది’’ అని బీజింగ్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ట్రంప్ కొత్త సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రాథమిక దశకు చేరుకున్నాయని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అన్నారు. తన దేశానికి వ్యతిరేకంగా ఇప్పటికే అమలులో ఉన్న సుంకాలను, ట్రంప్ మరింత పెంచే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ టారిఫ్ లపై ఇటలీ ప్రధాని కూడా వ్యాఖ్యానించారు. అమెరికాతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటామని ప్రకటించారు.
Next Story