బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ గురించి తొలిసారి మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆయన ఖండించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ గురించి తొలిసారి మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆయన ఖండించారు. ‘‘బంగ్లాదేశ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడ హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ అనాగరిక హింసను తీవ్రంగా ఖండిస్తున్నా" అని ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 5న జరిగే ఎన్నికలలో డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తలపడుతున్నారు.
బంగ్లాదేశ్‌లో జూలై-ఆగస్టులో వందలాది మంది హిందువులు హత్యకు గురయ్యారు. విద్యార్థుల ఆందోళనలు, తీవ్ర నిరసనలు.. అప్పటి ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.
‘భారత్‌తో సంబంధాలు బలోపేతం’
కమలా హారిస్, ఆమె బాస్ ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలోని హిందువులను విస్మరించారని ట్రంప్ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని ఖండించిన ట్రంప్.. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
"ఇలా నా పాలనలో ఎప్పుడూ జరగలేదు. కమలాహ్యారిస్, జో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలోని హిందువులను కూడా విస్మరించారు. మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పి్స్తాం. మీ స్వేచ్ఛ కోసం మేం పోరాడతాం. మోదీ నాకు గొప్ప స్నేహితుడు. మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం' అని పేర్కొన్నారు.