‘ఏఐ’ సలహదారుడిగా ఇండో అమెరికన్ ను నియమించిన ట్రంప్
భారతీయ అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్ ను తన ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ సలహదారుడిగా ట్రంప్ నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తరువాత భారతీయ అమెరికన్లకు పెద్దపీట వేయడం ప్రారంభించారు. తాజాగా వెంచర్ క్యాపిటలిస్ట్, రచయిత శ్రీరామ్ కృష్ణన్ ను ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ సీనియర్ పాలసీ అడ్వైజర్ గా నియమించారు.
"శ్రీరామ్ కృష్ణన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారు" అని ట్రంప్ ఆదివారం నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియామకాలను ప్రకటించారు.
గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ!, ఫేస్‌బుక్, స్నాప్‌లో వివిధ బృందాలకు నాయకత్వం వహించిన కృష్ణన్, వైట్ హౌస్ AI & క్రిప్టో జార్‌గా ఉండే డేవిడ్ ఓ. సాక్స్‌తో కలిసి పని చేస్తారని ట్రంప్ కార్యాలయం పేర్కొంది.
“ డేవిడ్ సాక్స్‌తో సన్నిహితంగా పనిచేస్తూ, శ్రీరామ్ AIలో అమెరికన్ నాయకత్వాన్ని కొనసాగించడంపై దృష్టి సారిస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్‌తో సహా ప్రభుత్వం అంతటా AI విధానాన్ని రూపొందించడంలో సమన్వయం చేయడంలో సాయం చేస్తారు. విండోస్ అజూర్ వ్యవస్థాపక సభ్యుడిగా మైక్రోసాఫ్ట్‌లో శ్రీరామ్ తన కెరీర్‌ను ప్రారంభించాడు' అని ట్రంప్ అన్నారు.
కృష్ణన్ మాట్లాడుతూ, "మన దేశానికి సేవ చేయగలగడం, డేవిడ్ సాక్స్‌తో సన్నిహితంగా పని చేస్తున్న AIలో అమెరికన్ నాయకత్వాన్ని కొనసాగించడం నాకు గౌరవంగా ఉంది." అన్నారు. కృష్ణన్ నియామకాన్ని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ స్వాగతించింది.
"మేము శ్రీరామ్ కృష్ణన్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా నియమించినందుకు సంతోషిస్తున్నాము" అని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు.
“చాలా సంవత్సరాలుగా, శ్రీరామ్ కృత్రిమ మేధస్సు రంగంలో తనను తాను నిరూపించుకున్నాడు. పబ్లిక్ పాలసీ, అంతర్జాతీయ వ్యవహారాలు, పెట్టుబడులు, సాంకేతికతను మిళితం చేయడంలో దిట్ట” అని అన్నారాయన. మేము ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
🇺🇸 I'm honored to be able to serve our country and ensure continued American leadership in AI working closely with @DavidSacks.
— Sriram Krishnan (@sriramk) December 22, 2024
Thank you @realDonaldTrump for this opportunity. pic.twitter.com/kw1n0IKK2a
Next Story