‘‘ట్రూడో రాజీనామా తరువాత భారత్ - కెనడా మధ్య పరిస్థితులు మారవచ్చు’’
x

‘‘ట్రూడో రాజీనామా తరువాత భారత్ - కెనడా మధ్య పరిస్థితులు మారవచ్చు’’

కన్జర్వేటీవ్ ల రాకతో రైట్ వింగ్ రాజకీయాలకు అవకాశముందన్న ‘ ది ఫెడరల్’ మేనేజింగ్ ఎడిటర్ కే ఎస్ దక్షిణామూర్తి


కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో పదవీకాలం దాదాపుగా ముగిసింది. ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రూడో ప్రధానిగా 2015 లో పీఠమెక్కారు. దేశంలో మార్పు తీసుకొస్తామని, సంస్కరణలు ప్రవేశపెడతామని వాగ్థానాలు చేశారు. అందుకు తగ్గట్లుగా మంత్రివర్గం కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ప్రారంభంలో ట్రూడో విధానాలు సామాజిక సంక్షేమం, ఆర్థిక సంస్కరణల లక్ష్యంగా కొనసాగాయి. అయితే ఉప్పెనలా విరుచుకుపడిన వూహాన్ వైరస్ ధాటికి ఆర్థికంగా చతికిల పడటం, ద్రవ్యోల్భణం, పోస్ట్ పాండమిక్ రికవరీ ఆలస్యం కావడంతో ప్రజలు చరిత్రలో చూడని కష్టాలను అనుభవించారు.

దీనితో ఆయన పాలనపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. దేశంలోని నిర్వహించిన తాజా సర్వేలో ఆయన పాపులారిటీ ఓటు దారుణంగా 21 శాతానికి పడిపోయింది. ఈ షాక్ తో ఆయన రాజీనామా చేయాలని సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపించాయి.

ఇక పదవిలో కొనసాగడం అసాధ్యం అని భావించిన ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ‘ ది ఫెడరల్’ మేనేజింగ్ ఎడిటర్ కేఎస్ దక్షిణామూర్తి ఈ ఇంటర్వ్యూలో అక్కడ జరుగుతున్న పరిణామాలను విశ్లేషించారు.

భారత్ - కెనడా సంబంధాల్లో మార్పులు..
ట్రూడో కెనడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక భారత్ తో ఘర్షణాత్మక వైఖరి అవలంభించారు. ముఖ్యంగా మన దేశంలో నేరాలు చేసి దొంగ పాస్ పోర్టుతో పారిపోయిన ఖలిస్తాన్ నేరగాళ్లకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. కొన్ని నెలల క్రితం ఖలిస్తానీ ఉగ్రవాదీ హర్డీప్ సింగ్ నిజ్జర్ హత్య లో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపణలు చేయడం, తరువాత భారత దౌత్య సిబ్బందిని అనుమానితుల జాబితాలో చేర్చడంతో న్యూ ఢిల్లీ తీవ్రంగా స్పందించింది. భారతీయ విద్యార్థులు, వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి కొత్త విధానాలు ఈ పరిస్థితికి ఆజ్యం పోశాయి.
లిబరల్ పార్టీకి సవాళ్లు..
లిబరల్ పార్టీ తను అత్యల్ప రేటింగ్ లను ఎదుర్కొంటోంది. తక్షణమే దేశంలో ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష కన్జర్వేటీవ్ లు 45 శాతం పాపులారిటీతో పీఠానికి దగ్గరయ్యారు. ప్రస్తుతం అక్కడ అక్టోబర్ లో ఎన్నికలు జరనున్నాయి. అయితే పార్టీకి సారథ్యం వహించే నాయకుడి విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం లేదు. అనేక మంది నాయకులు ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు.
ట్రూడో నిష్క్రమణ.. కెనడా భవిష్యత్..
ట్రూడో నిష్క్రమణ కెనడాలో రాజకీయా మార్పును సూచిస్తుంది. కన్జర్వేటీవ్ లు అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కన్జర్వేటీవ్ లు అధికారంలోకి వస్తే ప్రపంచంలో ఇప్పుడిప్పుడే అనుసరిస్తున్న రైట్ వింగ్ రాజకీయాలకు కెనడాలో తలుపులు తెరిచే అవకాశం ఉంది.
ప్రత్యేకించి పొరుగు దేశమైన అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రాకతో కెనడా లో తదుపరి వచ్చే ప్రభుత్వం దేశీయ సవాళ్లతో పాటు ట్రంప్ విధానాలతో మారిన అంతర్జాతీయ సవాళ్లను సైతం ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది ఆదేశానికి తీవ్రమైన తలనొప్పిని కలిగించే అవకాశం ఉంది.
భారత్ కు చిక్కులు
భారత్ కు సంబంధించి ట్రూడో రాజీనామా తరువాత దౌత్య సంబంధాలను తిరిగి చక్కదిద్దుకునే అవకాశం చిక్కింది. తదుపరి పగ్గాలు చేపట్టబోయే వ్యక్తి వాణిజ్యం, వలసలు, ఖలిస్తాన్ తీవ్రవాదం సంబంధిత వ్యవహరాలను వివేకంతో పరిష్కరించాలి. దౌత్యపరంగా సున్నితంగా వ్యవహరించాలని న్యూఢిల్లీ భావిస్తుంది. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల కోసం తలుపులు తెరవాలి.


Read More
Next Story