
ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు..పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేపట్టింది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించడంతో పాటు, కీలక కార్పొరేషన్లకు కొత్త అధికారులను కేటాయించింది.
జిల్లాల వారీగా కొత్త కలెక్టర్లు వీరే
ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం నియమితులైన కొత్త కలెక్టర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం జిల్లా కలెక్టర్: అభిషిక్త్ కిశోర్
గుంటూరు జిల్లా కలెక్టర్: సాయికాంత్ వర్మ
కాకినాడ జిల్లా కలెక్టర్: హరేంద్రప్రసాద్
అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా కలెక్టర్: టి.నిశాంతి
కీలక విభాగాల్లో మార్పులు
జిల్లాల కలెక్టర్లతో పాటు పలువురు సీనియర్ అధికారులకు రాష్ట్ర స్థాయి విధులను అప్పగించింది.
ఏపీఈడీబీ (APEDB) సీఈవో: షణ్మోహన్ (కాకినాడ కలెక్టర్ నుండి బదిలీ)
ఏపీఐఐసీ (APIIC) ఎండీ: దినేష్‌కుమార్ (ASR జిల్లా కలెక్టర్ నుండి బదిలీ)
పాఠశాల విద్య డైరెక్టర్: తమిమిన్ అన్సారియా
కోనసీమ జిల్లాకు అదనపు బాధ్యతలు
కోనసీమ జిల్లా కలెక్టర్ బదిలీ కావడంతో, అక్కడ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ జిల్లా జాయింట్ కలెక్టరే కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Next Story

