మా ప్రతిస్పందన చాలా గట్టిగా ఉంటుంది: జైశంకర్
x

మా ప్రతిస్పందన చాలా గట్టిగా ఉంటుంది: జైశంకర్

దేశంపై ఉగ్రవాద దాడులు జరిగితే మా ప్రతిస్పందన బలంగా ఉంటుందని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.


దేశ ఆర్థిక రాజధాని ముంబై పై 26/11 పై భారీ ఉగ్రదాడి జరిగిన తరువాత అప్పటి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా అలాగే ఉండిపోయిందని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అయితే ఈ రోజు అలాంటి సంఘటన జరిగితే పరిస్థితి భిన్నంగా ఉండేదని చెప్పారు.

"ముంబైలో ఏమి జరిగిందో మనం పునరావృతం చేయకూడదు. ఉగ్రదాడి జరిగింది కానీ దేశం నుంచి ప్రతిస్పందన లేదు" అని జైశంకర్ ఆదివారం ముంబైలో విలేకరులతో అన్నారు. "ముంబయి, ప్రపంచానికి ఉగ్రవాద వ్యతిరేక చిహ్నం" అని మంత్రి తెలిపారు.
ఇప్పుడు "ప్రతిస్పందన ఉంటుంది"
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ సభ్యదేశంగా ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక కమిటీకి అధ్యక్షత వహించిందని జైశంకర్ తెలిపారు. “ఉగ్రవాద దాడికి గురైన హోటల్‌లోనే మేము కౌంటర్ టెర్రరిజం ప్యానెల్ సమావేశాన్ని నిర్వహించాము,” అన్నారాయన. ఈ సమావేశం అక్టోబర్ 2022లో జరిగింది. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం బలంగా నిలుస్తుందని ప్రజలకు తెలుసు. ఉగ్రవాదంపై పోరులో మేం నేడు అగ్రగామిగా ఉన్నామని జైశంకర్ అన్నారు. "మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడతాం, ఎవరైనా ఏదైనా చేసినప్పుడు, ప్రతిస్పందన అదే విధంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది," అన్నారాయన.
ఏం మారింది
"మేము ఉగ్రవాదాన్ని బహిర్గతం చేస్తాము. మేము ఎక్కడ పని చేయాలో అక్కడ గట్టిగా వ్యవహరిస్తాము," అని జై శంకర్ పరోక్షంగా పాకిస్తాన్ ఉద్దేశించి హెచ్చరించారు. అలాగే చైనాతో ఉన్న సరిహద్దు సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రతిష్టంభన ప్రారంభమైన 2020 ముందు ఉన్న పెట్రోలింగ్ తిరిగి ప్రారంభించామని ఆయన వెల్లడించారు.
“అక్టోబర్ 31, 2020కి ముందున్న పరిస్థితులు తిరిగి రావాలని మేము భావిస్తున్నాము, డెమ్‌చోక్, డెప్సాంగ్ వంటి ప్రాంతాల్లో పెట్రోలింగ్ ఏర్పాట్లు చేయబోతున్నాం. దీనికి కొంత సమయం పడుతుంది'' అని జైశంకర్ అన్నారు.
ముంబై పై దాడి
ముంబై పై 2008, నవంబర్ లో జరిగాయి. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా పది మంది ఉగ్రవాదులను ముంబైకి దాడులు చేయడానికి ఉసికొల్పింది. దాదాపు మూడురోజుల పాటు ఉగ్రవాదులు పలు ప్రాంతాల్లో నరమేధం సృష్టించారు. 166 మంది ప్రజలు మరణించారు. దాదాపు 300 మంది గాయపడ్డారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రతిదాడికి ఆదేశించలేదు. వైమానిక దళం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తామని ప్రణాళిలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఒప్పుకోలేదు.



Read More
Next Story