ముగ్గురు బందీలను విడుదల చేస్తామని ప్రకటించిన హమాస్
x

ముగ్గురు బందీలను విడుదల చేస్తామని ప్రకటించిన హమాస్

ఒప్పందం అమలు చేసేవరకు యుద్దం ఆపేది లేదన్న ఐడీఎఫ్


దాదాపుగా రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ - హమాస్ యుద్దంలో కాల్పుల విరమణ ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది. తమ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టే ముందు వారి పేర్లను చెప్పాలన్న షరతును చివరి నిమిషంలో హమాస్ వెళ్లదించడంతో ఒప్పందం అమల్లోకి వచ్చింది.

స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 9:15 నిమిషాలకు సంధి అధికారికంగా ప్రారంభమయినట్లు ఇరు వర్గాలు వెల్లడించాయి. ఆదివారం సామాజిక మాధ్యమం వేదికగా ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేయబోయే పేర్లను వెల్లడించింది.

బందీలను స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం విడుదల కాబోతున్నారని యూదు ప్రధాని కార్యాలయం పేర్కొంది. మరో నలుగురు సజీవంగా ఉన్న బందీలు ఇంకో వారంలో విడుదల అవుతారని పేర్కొంది.

మొదటి దశ సంధి..

యూఎస్ఏ, ఖతార్, ఈజిప్టు ఒక సంవత్సరం నుంచి మధ్యవర్తిత్వం వహించి ఇరు పక్షాలను ఈ ఒప్పందం వైపు తీసుకొచ్చాయి. ఈ ఒప్పందం మొదటి దశలో 42 రోజుల పాటు అమలులో ఉంటుంది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న 33 మందిని విడుదల చేస్తుంది.

అందుకు గాను వందలాది మంది పాలస్తీనా ఖైదీలను టెల్ అవీవ్ విడుదల చేయాల్సి ఉంటుంది. దీని తరువాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. దాదాపు వందమందిదాకా యూదులు వారి ఆధీనంలో ఉంటారు.

బందీల వివరాలు..

సాయంత్రం ముగ్గురు మహిళా బందీలను విడుదల చేయబోతున్న వారి పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో రోమి గోనెన్, డోరన్ స్టేయిన్ బ్రేచర్, ఎమిలీ డమారీ అని తెలుస్తోంది. డమరీ, స్ట్రేయిన్ బ్రేచర్ విడుదల కాబోతున్నట్లు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక నివేదికలో తెలిపింది.

డమారీ, స్టెయిన్ బ్రేచర్ ఇద్దరు అక్టోబర్ 7, 2023 న కిబ్బట్జ్ క్పర్ అజాలోని వారి ఇళ్ల నుంచి బందీలుగా తీసుకున్నారు. రోమిని నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి రోమీని తీవ్రవాదులు తీసుకున్నారు. వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో 11 మంది హత్య చేసిన హమాస్ ఉగ్రవాదులు, ఏడుగురిని కిడ్నాప్ చేశారు.

గాజాలో సంబరాలు..

ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా బందీలు విడుదల కావడంతో గాజాలో సంబరాలు మిన్నంటాయి. తన పౌరులు చాలామంది అక్కడి జైళ్లలో బందీలుగా ఉన్నారని వారీ వాదన. చివరకు యూదులను బందీలుగా పెట్టుకుని తమ వారీని బయటకు తీసుకువచ్చారని అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చే వరకు తమదాడులు ఆపబోమని, ఒప్పందాన్ని అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉన్నాయని ఐడీఎఫ్ హెచ్చరించింది.

దాడులు కొనసాగించిన ఐడీఎఫ్

బందీలను విడుదల చేయడంలో ఆలస్యం కావడంతో ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులు కొనసాగించింది. ఐడీఎఫ్ చీఫ్ రియల్ అడ్మిరల్ డేనియల్ హగారీ మాట్లాడుతూ.. సైన్యం ఇప్పుడు గాజాలోని అరేనా లోపల దాడులు కొనసాగిస్తోంది. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించే వరకూ యుద్దం కొనసాగుతుందని హెచ్చరించారు.

సైన్యం ఖాన్ యూనిస్ పట్టణంలోని అనేక ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసినట్లు వార్తా పత్రికలు వెల్లడించాయి. ఇందులో కనీసం ఎనిమిది మంది మరణించారు. సంధి ప్రారంభం కావడానికి కేవలం రెండు గంటల ముందు ఇది ప్రారంభం అయింది.

పాలస్తీనా అధికారి దీనిపై మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దాడిని కొనసాగించడంతో జాబితాను రూపొందించడం కష్టంగా మారిందని వివరించారు. కనీసం 48 గంటలు ప్రశాంతంగా ఉంటే జాబితా ఇవ్వడం పూర్తవుతుందని పేర్కొన్నారు. తాము కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ఓ ప్రకటనలో ఉగ్రవాద సంస్థ హమాస్ పేర్కొంది.

Read More
Next Story