ఉదయ్‌పూర్‌లో విరోష్ వెడ్డింగ్ హంగామా
x
X(Twitter)

ఉదయ్‌పూర్‌లో 'విరోష్' వెడ్డింగ్ హంగామా

మొదలైన సెలబ్రిటీల సందడి!


టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు తెరదించుతూ, ఈ జంట తమ పెళ్లి వేడుకను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నారు.

ముఖ్య విశేషాలు:

పెళ్లి వేదిక: ఉదయ్‌పూర్‌లోని అత్యంత విలాసవంతమైన 'ITC మెమెంటోస్' (ITC Mementos) హోటల్ ఈ వేడుకకు ఆతిథ్యం ఇస్తోంది.

ముహూర్తం: ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు.

అతిథులు: కేవలం 100 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరగనుంది. ఇప్పటికే ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా వంటి ప్రముఖులు సందడి చేస్తూ కనిపించారు. సందీప్ రెడ్డి వంగా కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.

వేడుకల షెడ్యూల్: ఈ 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్' సంబరాలు అప్పుడే మొదలయ్యాయి.

ఫిబ్రవరి 24: సన్నిహితుల మధ్య మెహందీ వేడుక

ఫిబ్రవరి 25: హల్దీ ,సంగీత్ కార్యక్రమాలను

ఫిబ్రవరి 26: ప్రధాన వివాహ వేడుక

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్: ఉదయ్‌పూర్‌లో పెళ్లి ముగిసిన తర్వాత, టాలీవుడ్ ప్రముఖులు,స్నేహితుల కోసం మార్చి 4, 2026న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

చాలా కాలం పాటు తమ రిలేషన్‌షిప్‌పై గోప్యత పాటించిన ఈ జంట, పెళ్లికి కొన్ని రోజుల ముందే అధికారికంగా ప్రకటించి అభిమానులను ఖుషీ చేశారు. 'విరోష్' (VIROSH) అని పిలవబడే ఈ జంట వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Read More
Next Story