కేజ్రీవాల్‌కు బెయిల్.. హిమంత సోరెన్‌కు..
x

కేజ్రీవాల్‌కు బెయిల్.. హిమంత సోరెన్‌కు..

ఎన్నికల ప్రచారం చేయడం కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ఝార్ఖండ్ మాజీ సీఎంకు మాత్రం..


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంత బెయిలర్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాంలో అరెస్ట్‌ అయిన కేజ్రీవాల్‌కు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి అనుమతిస్తూ బెయిల్‌ను మంజూరు చేసింది న్యాయస్థానం. అంతేకాకుండా జూన్ రెండున తిరిగి పోలీసులకు లొంగిపోవాలని కూడా స్పష్టం చేసింది. అయితే మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హెమంత్ సోరెన్‌కు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

కేజ్రీవాల్‌కు కీలక సూచనలు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు 21 రోజుల బెయిల్ మంజూరు చేసింది. ఏడు దశల్లో జరిగే ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజున అంటే జూన్ 2న ఆయన తిరిగి పోలీసులకు లొంగిపోవాలని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆగస్టు 2022న ఈసీఐఆర్ కేసును నమోదు చేసిందని, అప్పటి నుంచి ఆయనను అరెస్ట్ చేయడానికి వీలు ఉన్నా చేయలేదు. ఇప్పుడు మరో 21 రోజులు అటూఇటూ కావడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు.

హెమంత్ సోరెన్‌కు నో

ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. అదే కారణంతో బెయిల్ కోరిన ఝార్ఖండ్ మాజీ సీఎం హెమంత్ సోరెన్‌కు మాత్రం నో చెప్పింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సందర్భంగా.. సోరెన్ బెయిల్ పిటిషన్‌ను తన అరెస్ట్ అనధికారమని, తనపై నమోదు చేసిన మనీలాండరింగ్ కేసు అంతా బూటకమని ఆరోపించిన సోరెన్ మరో పిటిషన్‌తో పాటు కలిపి స్వీకరించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఆ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.

Read More
Next Story