ముస్లిం మహిళల హక్కుల కోసమే ఈ చట్టం: కేంద్రం అఫిడవిట్
ముస్లిం మహిళలకు రాజ్యాంగ బద్ధంగా ఉన్న హక్కులను రక్షించడానికే ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన..
ట్రిపుల్ తలాక్ అనేది వివాహ వ్యవస్థగా ప్రాణాంతకంగా మారిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. ట్రిపుల్ తలాక్ కు చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు అయింది. ఈ చట్టాన్ని 2019 లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.
2017 లో సుప్రీంకోర్టు ఓ తీర్పు ద్వారా ట్రిపుల్ తలాక్ ను రాజ్యాంగ విరుద్దమైన అంశంగా ప్రకటించింది. అయితే ఈ తీర్పులో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్ది 2019లో చట్టాన్ని తీసుకొచ్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. ముస్లిం మహిళల వివాహ రక్షణ చట్టం ప్రకారం వారికి తగిన భద్రత కల్పించినట్లు పేర్కొంది.
“ట్రిపుల్ తలాక్ బాధితులకు పోలీసులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. చట్టంలో శిక్షార్హమైన నిబంధనలు లేనందున భర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడంతో పోలీసులు నిస్సహాయంగా ఉన్నారు. (దీనిని) నిరోధించడానికి కఠినమైన (చట్టపరమైన) నిబంధనల అత్యవసర అవసరం ఉంది, ” అని కేంద్రం తెలిపింది.
ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందుతున్న వివాహిత ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించేందుకు పార్లమెంటు తన విజ్ఞతతో నిర్భయ చట్టాన్ని రూపొందించిందని అఫిడవిట్ పేర్కొంది.
లింగ సమానత్వం
"వివాహం చేసుకున్న ముస్లిం మహిళల లింగ న్యాయం, లింగ సమానత్వం రాజ్యాంగ లక్ష్యాలను కాపాడుతుంది. వివక్ష రహిత , సాధికారత వారి ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో సహాయపడుతుంది" అని వివరించింది.
22 ఆగస్టు 2017న, సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్ (తలాక్-ఎ-బిద్దా) రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆగస్టు 23, 2019న, ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లు
రెండు ముస్లిం సంస్థలు - జమియత్ ఉలమా-ఐ-హింద్, సమస్తా కేరళ జమియతుల్ ఉలేమా - చట్టాన్ని "రాజ్యాంగ విరుద్ధం"గా ప్రకటించాలని కోర్టును కోరారు. జమియాత్ తన పిటిషన్‌లో "ఒక నిర్దిష్ట మతంలో విడాకుల విధానాన్ని నేరంగా పరిగణించడం, ఇతర మతాలలో వివాహం, విడాకుల అంశాన్ని పౌర చట్టం పరిధిలో మాత్రమే ఉంచడం వివక్షకు దారితీస్తుందని, ఇది ఆర్టికల్ 15 ఆదేశానికి అనుగుణంగా లేదని పేర్కొంది. "
Next Story