కేరళలో వామపక్షాల కంచుకోట పదిలమేనా?
x

కేరళలో వామపక్షాల కంచుకోట పదిలమేనా?

కేరళలోని వడకర నియోజకవర్గం.. 2009 వరకు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)కి సుస్థిర స్థానం. ఇది వామపక్షాలకు కంచుకోటగా చెప్పుకోవాలి.


కేరళలోని వడకర నియోజకవర్గం.. 2009 వరకు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)కి సుస్థిర స్థానం. ఇది వామపక్షాలకు కంచుకోటగా చెప్పుకోవాలి.

2009లో ఏం జరిగింది?

2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో సీపీఐ(ఎం)లో పేరుగాంచిన నాయకుడు టిపి చంద్రశేఖరన్ తిరుగుబాటు చేసి రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ (ఆర్‌ఎంపి) పేరిట కొత్త గ్రూపు ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికలలో పోటీ చేయాలనే చంద్రశేఖరన్ నిర్ణయం కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి ముళ్లపల్లి రామచంద్రన్ చేతిలో ప్రస్తుత MP P సతీదేవి ఓటమిపాలయ్యారు. పార్టీలో ఏర్పడిన ఈ విభేదాలు చివరికి 2012లో చంద్రశేఖరన్‌ హత్యకు దారితీశాయి. ఇది కేరళ వామపక్ష రాజకీయాల్లో కీలక ఘట్టం. చంద్రశేఖరన్ మరణం తరువాత RMP కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. UDF మద్దతుతో వడకరలో కెకె రెమా అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మార్గం సుగమం చేసింది.

వడకర నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎల్‌డిఎఫ్‌యేతర ఎమ్మెల్యేగా రెమా ఆవిర్భవించడం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

లోక్ సభ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని..

ఈ ఎన్నికల్లో అధికార కూటమి ఎల్‌డిఎఫ్ లోక్‌సభ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, మట్టన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే KK శైలజను రంగంలోకి దింపింది. 'శైలజా టీచర్'గా గుర్తింపు పొందిన ఈమె కేరళలో కోవిడ్ విజృంభించినపుడు తనదైన రీతిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి ప్రజల మన్ననలు పొందారు.

ఇంతలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లేదా UDF సిట్టింగ్ ఎంపి కె మురళీధరన్‌ను త్రిసూర్‌కు మార్చవలసి వచ్చింది. అతని సోదరి పద్మజ వేణుగోపాల్ బిజెపిలోకి వెళ్లడంతో పాలక్కాడ్ ప్రస్తుత ఎమ్మెల్యే షఫీ పరంబిల్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్. గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కుట్టియాడి అసెంబ్లీ సెగ్మెంట్‌ కూతాలిలోని ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రంలో ప్రజలతో షషి మాట్లాడారు. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల అలసిపోయినట్లు కనిపించినా.. గెలుపొందుతానన్న ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశాడు.

“నేను ఈసారి సీన్‌లోకి రావడానికి కొంచెం ఆలస్యమైంది. వడకర చేరుకున్నప్పుడు నాకు లభించిన ఆదరణ ఎన్నటికి మరిచిపోలేనిది. రాష్ట్రం మొత్తంలో రాజకీయంగా అత్యంత తెలివైన ఓటర్లు ఇక్కడ ఉన్నారని నేను భావిస్తున్నాను, ”అని షఫీ ది ఫెడరల్‌తో అన్నారు.

CAAపై దృష్టి ..

“యుడిఎఫ్ ఇప్పటికే అనేక సిఎఎ వ్యతిరేక నిరసనలను చేపట్టింది. నియోజక వర్గంలో నైట్ మార్చ్‌లు కూడా జరిగాయి. LDF ముఖ్యంగా CPI(M) CAAను మా పార్టీ వ్యతిరేకిస్తోంది. మణిపూర్‌కు రాహుల్ గాంధీ ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రజలకు వాస్తవాలు బాగా తెలుసు' అని షఫీ పేర్కొన్నారు.

గెలిపించండి..గళం వినిపిస్తాం..

“మన ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకం. పార్లమెంటులో మన గళం వినిపించాలంటే అక్కడ ఎల్‌డిఎఫ్ ఎంపీలు కావాలి. యూడీఎఫ్ ఎంపీలు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారు. వారు తమ గళాన్ని వినిపించడం తగ్గేంచేశారు. ”అని కుట్టియాడి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పూలకూల్, కక్కుని వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ సందర్భంగా శైలజ ఫెడరల్ ప్రతినిధితో అన్నారు.

భోజన విరామ సమయంలో శైలజ వెంట స్థానిక సిపిఎం కుట్టియాడి ఎమ్మెల్యే కెపి కున్హహమ్మద్ కుట్టి ఉన్నారు. ఆ సమయంలోనూ ఇద్దరూ తమ స్నేహితులకు, సన్నిహితులకు ఫోన్లు చేస్తూ కనిపించారు. "ఎమ్మెల్యేకి ఇక్కడ చాలా మంది స్నేహితుల సర్కిల్ ఉంది.’’ అని స్థానిక సహచరుడి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు శైలజ ది ఫెడరల్‌తో అన్నారు.

ఫెడరల్ వారితో మాట్లాడినప్పుడు పౌరసత్వ సవరణ చట్టం (CAA) తమ ప్రచార అస్త్రం అని పేర్కొన్నారు. కార్నర్ మీటింగుల్లోనూ వారు సీఏఏకు వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు కీలకమని శైలజ పేర్కొన్నారు. సాయంత్రానికి సీపీఐ(ఎం) మద్దతుదారుడు ఒకరు బాంబు తయారు చేస్తూ చనిపోయాడు. ఈ ఘటనను యూడీఎఫ్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది.

ఎందుకు తయారుచేస్తున్నారో చెప్పాలి..

షఫీ, అతని ప్రచార నిర్వాహకులు నియోజకవర్గంలో శాంతియాత్ర నిర్వహించారు. బాంబులు తయారు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు సిపిఎం ప్రయత్నిస్తోందని షఫీ ఆరోపించారు. చంద్రశేఖరన్ హత్యఘటనను కూడా షఫీ ఈ సందర్భంగా హైలైట్ చే

శారు. వడకరలో ఓటమి భయంతో సీపీఐ(ఎం) హింసకు పాల్పడుతోందన్న మా ఆరోపణలను పానూరు ఘటన రుజువు చేసింది. అసలు బాంబులను ఎందుకు తయారు చేస్తున్నారో సమాధానం చెప్పాలని షఫీ డిమాండ్ చేశారు.

ఇటు పేలుడు ఘటనతో కొందరు గతంలో ఎల్‌డీఎఫ్‌ సానుభూతిపరులుగా ఉండి, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా సీపీఐ(ఎం) వారితో సంబంధాలు తెంచుకుంది.

“ఆ గుంపులోని సభ్యులెవరితోనూ నాకు పరిచయం లేదు. మంత్రిగా, రాజకీయ నాయకురాలిగా అనేక మంది వ్యక్తులు నాతో ఫోటోలు దిగారు. అయితే క్రూడ్ బాంబు పేలుడుతో మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఘటన ప్రాణనష్టానికి దారితీసింది, ”అని శైలజ అన్నారు. యాదృచ్ఛికంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసిన రోజునే బాంబు పేలుడు సంభవించింది.

‘‘కేకే శైలజ రాకతో సీన్‌ పూర్తిగా మారిపోయింది. ఈసారి మళ్లీ సీటు సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నాం. సామాన్య ప్రజలతో ఎలా మమేకం కావాలో ఆమెకు తెలుసు. ఆమె ఆరోగ్య మంత్రిగా పనిచేసినందుకు రాష్ట్రమంతా ఆమెను మెచ్చుకున్నారు” అని కక్కుని సీపీఐ(ఎం) కార్యకర్త ప్రకాశం తెలిపారు.

యువత షఫీవైపే..

నియోజకవర్గంలో యువత నుంచి షఫీకి విపరీతమైన మద్దతు లభిస్తోంది. "శైలజ లాంటి పేరున్న నాయకురాలు కూడా ఇక్కడి నుండి గెలవడం అంత తేలికైన పని కాదు" అని RMP కార్యకర్త సిరాజ్ చెప్పారు. ఆమె మళ్లీ మట్టన్నూరు వెళ్లి ఎమ్మెల్యేగా కొనసాగాలి. యువకుల మద్దతు ఉన్న అంతటి బలమైన అభ్యర్థి షఫీ అని అన్నారు.


ఈ క్రమంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ ప్రఫుల్ కృష్ణను రంగంలోకి దింపింది. 2019లో కాంగ్రెస్‌కు చెందిన కె మురళీధరన్ సిపిఐ(ఎం) నాయకుడు పి జయరాజన్‌పై 84,663 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 80,128 ఓట్లు పోలయ్యాయి. ఇది మొత్తం ఓట్లలో కేవలం 7.58% మాత్రమే.

అన్నింటికంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఉన్న సీటులో శైలజ, షఫీ పోటీపడుతున్నారు. అయితే గెలుపు ఎవరిని వర్తిస్తుందో చూడాలి మరి.

Read More
Next Story