
రాయలసీమలో రాజకీయ ప్రమాదం, రాయచోటికి తీవ్రగాయాలు
రాయచోటిలో నిరసనలు
రాయలసీమలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నపుడు రాజకీయ ప్రమాదం జరిగింది. రాయచోటికి తీవ్రగాయమైంది.
రాయచోటి నుండి జిల్లా కేంద్రాన్ని లాక్కొని మదనపల్లెకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాయలసీమలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటైన దానికి చారిత్రక అన్యాయంగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. నిరసనలు తెలుపుతున్నారు. జిల్లా కేంద్రం ఇపుడిపుడే వృద్ధి అవుతున్నసమయంలో హెడ్ క్వార్టర్స్ తరలించడం నమ్మక ద్రోహంగా వర్ణిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా
2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వేంకటేశ్వరుడి వాగ్గేయకారుడు అన్నమయ్య పేరుతో కొత్త జిల్లా సృష్టించారు. దీనికి జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11) మొత్తం మండలాలు 32
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు. రాజంపేట జిల్లా హోదా కోరుతూ వస్తున్నది. అలాగే మదనపల్లి నుంచి కూడా ఈ డిమాండ్ వుంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ రెండింటిని కాదని రాయచోటి ని జిల్లా సృష్టించి దాని అన్నమయ్య పేరు పెట్టింది. దీని వెనక ఏ రాజకీయాలు ఉన్నా, ఈ నిర్ణయం బాగా వెనకబడిన రాయచోటి అభివృద్ధికి బాటవేస్తుందని అనుకున్నారు.
రాయచోటి జిల్లా అయి ప్రధాన కార్యాలయం హోదాను న్యాయంగా సంపాదించింది - ఇది కేంద్రంగా ఉన్న రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం ఆధారంగా, తంబళ్లపల్లె, రైల్వే కోడూరు నుండి సమానదూరంలో ఉంటుంది. ఇపుడు జిలా కేంద్రమూ పోయింది. రాజంపేట లోకో సభ స్థానమూ పోయేట్లు ఉంది.
దీనికి కారణాలు ఏమిటి?
- స్థానిక నాయకుల మధ్య అంతర్గత విభేదాలు
- అత్యంత ముఖ్యమైనప్పుడు సున్నా ఐక్యత
- పై నుంచి రాజకీయ కుట్రలు
ఫలితం?
*రాయచోటి ఓడిపోయింది
*రాజంపేట ఓడిపోయింది.
*రాజకీయ అవకాశవాదం మాత్రమే గెలిచింది.
అంతర్గత పోరును సద్వినియోగం చేసుకున్న ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ ని మదనపల్లెకు తరలించి, రాజంపేటను కడపలో, కోడూరును తిరుపతిలో సౌకర్యవంతంగా విలీనం చేసింది.
ఇది ఒకప్పటి కడప జిల్లాకు చేసిన ద్రోహం లాంటిదే.
అన్యాయాన్ని చూడండి:
• చిత్తూరు → 3 జిల్లాలు చేశారు. (చిత్తూరు, తిరుపతి, మదనపల్లె)
• కర్నూలు → 2 జిల్లాలు చేశారు.
• అనంతపురం → 2 జిల్లాలు చేశారు.
• కడప → 0 కొత్త జిల్లా
• రాయచోటి → అభివృద్ధిలో దాని ఏకైక అవకాశాన్ని కోల్పోయింది
జిల్లా ప్రధాన కార్యాలయ హోదాతో వచ్చే ప్రయోజనాలు, వృద్ధి, ఉద్యోగాలు. మౌలిక సదుపాయాలు లేని రాయలసీమలో రాయచోటి మాత్రమే వెనుకబడిన ప్రధాన ప్రాంతంగా మిగిలిపోయింది.
ఇది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. ఇది సిస్టమ్యాటిక్ తిరస్కరణ కాక ఏమవుతుంది
ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైంది. ఐక్య ఆందోళన ఒక్కటే సమాధానం అని ప్రజలు అంటున్నారు.
రాయచోటి జిల్లా హోదాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఇక మౌనం లేదు. రాజీ లేదు అంటున్నారు.
రాయచోటికి న్యాయం జరగాల అంటున్నారు.
రాయలసీమకు సమానత్వం దక్కాల అని నినదిస్తున్నారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ నిరసన
రాయచోటిలో వైఎస్ఆర్‌సీపీ శాంతియుత నిరసన ర్యాలీ – ఈనెల 31న
అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయచోటిలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
బుధవారం ఉదయం 9.30 గంటలకు ఎస్‌ఎన్ కాలనీలోని వైఎస్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని విమర్శించారు.
పార్టీకలతీతంగా ప్రజలంతా పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు

