ఢిల్లీ‌లో సీబీఐ ముందుకు మరోసారి విజయ్‌..
x

ఢిల్లీ‌లో సీబీఐ ముందుకు మరోసారి విజయ్‌..

చెన్నైలో విచారించాలన్న టీవీకే చీఫ్ అభ్యర్థనను తిరస్కరించిన కేంద్ర దర్యాప్తు సంస్థ..


Click the Play button to hear this message in audio format

తమిళనాడు రాష్ట్రం కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే (TVK) పార్టీ చీఫ్, నటుడు విజయ్‌ను సీబీఐ మూడోసారి ప్రశ్నించింది. ఆదివారం ఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ఈ కేసులో విజయ్‌ను ఇప్పటికే జనవరిలో రెండు సార్లు విచారించారు. తాజాగా మూడోసారి ఆయనను ప్రశ్నించారు. మార్చి 9న విజయ్‌కి ముందుగా సమన్లు జారీ చేశారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాయని, 15 రోజుల పాటు విచారణను వాయిదా వేయాలని కోరారు. విచారణ తమిళనాడులోని సీబీఐ కార్యాలయంలో నిర్వహించాలని కూడా అభ్యర్థించారు. అయితే ఈ రెండు అభ్యర్థనలను సీబీఐ తిరస్కరించింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది.

ఇక ఇదే కేసులో కరూర్‌కు చెందిన డీఎంకే ఎమ్మెల్యే సెంధిల్ బాలాజీని కూడా మార్చి 17న విచారణకు హాజరుకావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది.

కరూర్ విషాదం..

తమిళనాడులోని కరూర్‌లో 2025 సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై మొదట ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును సీబీఐకి బదిలీ చేశారు.

ఈ కేసు దర్యాప్తుకు ఒక సీనియర్ అధికారిని నియమించాలని గత అక్టోబర్‌లో సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. అలాగే విచారణ పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రత్నోగి నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతుందని పేర్కొంది.

Read More
Next Story