స్పేడెక్స్: మూడు మీటర్ల లోపు ఉప గ్రహాలను తీసుకు వచ్చిన ఇస్రో
x

స్పేడెక్స్: మూడు మీటర్ల లోపు ఉప గ్రహాలను తీసుకు వచ్చిన ఇస్రో

డాకింగ్ కు మరింత సమాచారం కావాలన్న సంస్థ


స్పేస్ డాకింగ్ ప్రయోగాలు చేసేందుకు ప్రయోగించిన రెండు ఉప గ్రహాలను మూడు మీటర్ల దూరంలోకి తీసుకొచ్చి, తిరిగి సురక్షితంగా పక్కకు తీసుకెళ్లినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రక్రియలో నమోదైన డేటాను తిరిగి విశ్లేషించిన తరువాత డాకింగ్ ప్రక్రియను జరుగుతుందని ఇస్రో వెల్లడించింది.

‘‘ 15 మీటర్ల నుంచి మూడు మీటర్ల వరకూ చేరుకోవడానికి ఓ ప్రయత్నం జరిగింది. అంతరిక్ష ఉపగ్రహాలను సురక్షిత దూరానికి తిరిగి తరలించడం చేశాం. డేటాను మరింత విశ్లేషించిన తరువాత డాకింగ్ ప్రక్రియ జరుగుతుంది’’ అని ఇస్రో సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. అయితే స్పేడెక్స్ కోసం ఇప్పటికే రెండు సార్లు ఇస్రో షెడ్యూల్ చేసినప్పటికీ వాటిని డాకింగ్ చేయడంలో ఆలస్యం చేస్తోంది. ఇస్రో డిసెంబర్ 30న మిషన్ ను ప్రారంభించింది.
పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ రెండు చిన్న ఉపగ్రహాలు ఎస్ఎక్స్01(ఛేజర్), ఎస్డీఎక్స్02(టార్గెట్) 24 పేలోడ్ లతో పాటు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. దాదాపు 15 నిమిషాల ప్రయోగం తరువాత 220 కిలోగ్రాముల బరువు ఉన్న వ్యౌమ నౌకలు 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఇస్రో ప్రకటించిన సమాచారం ప్రకారం.. స్పేడెక్స్ ప్రాజెక్ట్ అనేది చిన్న వ్యోమనౌకలను ఉపయోగించి అంతరిక్షంలో అతి తక్కువ ఖర్చుతో డాకింగ్ ను చేయడానికి చేసే ఓ విన్యాసం. ఇది గనక విజయవంతం అయితే మన దేశానకి సొంతంగా అంతరిక్షస్టేషన్, చంద్రుడిపై వ్యోమగామిని దింపడం అలాగే భవిష్యత్ మిషన్ లను కీలకమైన సంక్లిష్ట సాంకేతికతలను స్వాధీనం చేసుకున్న నాల్గవ దేశంగా ఖ్యాతి పొందుతుంది. అంతరిక్షంలో సాధారణ మిషన్ లక్ష్యాలను సాధించడానికి బహుళ రాకెట్ ప్రయోగాలు అవసరమైనప్పుడూ అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికత అవసరం.


Read More
Next Story