
వ్యాన్‌ను ఢీకొట్టిన డబ్బుల్ డెక్కర్ బస్సు
ఆరుగురు మృతి, మరికొందరికి గాయాలు..
యూపీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు, వ్యాన్‌ను వెనక నుంచి ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ప్రేమ్ నగర్ (ఢిల్లీ) నుంచి ధోల్పూర్ (రాజస్థాన్)కు 13 మంది ప్రయాణికులతో వ్యాన్ బయలుదేరింది. నోయిడా నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్తున్న స్లీపర్ బస్సు వెనుక నుంచి వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. వాన్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ముగ్గురు పిల్లలు, ఇద్దరు పురుషులు, ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అదనపు ఎస్పీ రామ్ ఆనంద్ కుశ్వాహా, సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన పిల్లలను ఆగ్రాలోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు. కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

