‘సర్’ ను నిలిపివేయాల్సిందే: సీజేపీ
x

‘సర్’ ను నిలిపివేయాల్సిందే: సీజేపీ

రేజిమ్ ఛేంజ్ మా ఉద్దేశం కాదన్న బొద్దింకలు


ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్) కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండి కూటమి తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సీజేపీ గురువారం బెంగళూర్ లోని ఫ్రీడమ్ పార్క్ లో ఒక భారీ ప్రదర్శన నిర్వహించింది. ఓటర్ల జాబితాలో సవరణలను వెనక్కి తీసుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి.

బెంగళూర్ లో జరిగిన సీజేపీ నిరసన ప్రదర్శనకు కార్యకర్తలు, రాజకీయా నాయకులు, పౌర సమాజ బృందాలు హాజరయ్యాయి. ఈ నిరసనలో నటుడు ప్రకాశ్ రాజ్, యూట్యూబర్ ధ్రువ్ రాతీ తో పాటు జేఎన్ యూ విద్యార్థి నాయకురాలు ఐషే ఘోష్, ఐసా నాయకులు నేహా బోరా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా పాల్గొన్నారు. సర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగిస్తున్నారని పలువురు వ్యక్తుల వీడియో సాక్ష్యాలను ఇక్కడ వారు ప్రదర్శించారు.
ఓటర్ల తొలగింపు ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదులను విచారించేందుకు ఒక ప్రజా ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేయాలని, దాని అనంతరం ప్రతీకాత్మక చెప్పుల నిరసన చేపట్టాలని కూడా ప్రణాళిక రూపొందించారు. సవరణ సమయంలో జరిగిన అన్ని తొలగింపులను రద్దు చేసి, సర్ కు ముందున్న ఓటర్ల జాబితాలను పునరుద్ధరించాలని సీజేపీ డిమాండ్ చేసింది.

ఇండి కూటమి నిరసనలు..

ఢిల్లీలో ఇండి కూటమి పార్టీలు మరో విడత ఆందోళనకలు ప్రణాళిక రచిస్తోంది. దీనితో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రెండో రోజు కూటమి నాయకులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. కుమార్ రాజీనామా కోరుతూ ధర్నా చేసేందుకు ప్రతిపక్ష నాయకులు జంతర్ మంతర్ చేరుకోవడానికి ప్రయత్నించడంతో బుధవారం పోలీసులతో జరిగిన నాటకీయ ఘర్షణ తరువాత సమావేశం జరిగాయి.
ఢిల్లీ నిరసనల్లో ఉద్రిక్త దృశ్యాలు చోటు చేసుకున్నాయి. మార్గమధ్యంలో భద్రతా సిబ్బందిని అడ్డుకోవడంతో ప్రతిపక్ష పార్టీ ఎంపీలు వారితో ఘర్షణకు దిగారు. ప్రియాంక వాద్రా, పలువురు మహిళా నాయకులు రాజ్యాంగ ప్రతులను పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా తమ విధులకు ఆటంకం కలిగించారని పలువురు కాంగ్రెస్ నాయకులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీనియర్ నాయకులతో సహ 91 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పాట్నాలో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఇండి కూటమి నాయకులు సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆక్రోష్ మార్చ్ నిర్వహించారు. నిరసనకారులు లోక్ భవన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఒకరు స్పృహ కోల్పోయారు.


Read More
Next Story