
స్టాక్ మార్కెట్
ప్రారంభంలో జోరు చూపించిన సెన్సెక్స్, నిఫ్టీ
సీజ్ ఫైర్ పై అవగాహానకు రావడం, చైనా- అమెరికా చర్చలతో ఆసక్తి కనపరిచిన మదుపరులు
పాక్ తో సరిహద్దులో జరుగుతున్న సాయుధ ఘర్షణలపై సీజ్ పైర్ ఒప్పందంపై అవగాహన కుదరడంతో సోమవారం ప్రారంభంలో షేర్ మార్కెట్ ఫుంజుకుంది. ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ పూర్తి స్థాయిలో మదుపరులను ఆకర్షించాయి. బీఎస్ఈ బెంచ్ మార్క్ 1949.62 పాయింట్లు పెరిగి 81,398 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 598.90 పాయింట్లు పెరిగి 24,606 వద్ద ట్రేడవుతోంది.
‘‘భారత్ - పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించడం వలన సోమవారం ప్రారంభంలోనే ట్రేడ్ లలో నిఫ్టీకి భారీగా ఫుంజుకునే అవకాశం లభించింది. కానీ పాకిస్తాన్ నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘనలు బుల్లిష్ సెంటిమెంట్ ను బలహీనపరుస్తాయి. అమెరికా, చైనా మధ్య జరిగిన చర్చలు మార్కెట్ ను బలోపేతం చేయవచ్చు. రేపు, ఎల్లుండి విడుదల అయ్యే దేశీయ ద్రవ్యోల్భణ గణాంకాలు కూడా మంచి ఊపును తీసుకొచ్చే అవకాశం ఉంది’’ అని మెహాతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ పరిశోధకుడు ప్రశాంత్ తాప్సె అన్నారు.
సెన్సెక్స్ కంపెనీలలో అదానీ పోర్ట్స్, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాబ్ ఫిన్ సర్వే, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ ప్రధానంగా లాభపడ్డాయి. అయితే సన్ ఫార్మా మాత్రం ఐదుశాతం మేర నష్టపోయింది.
ఆసియా మార్కెట్ లో దక్షిణ కొరియా కోస్పీ, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హంగ్ సెంగ్ అధికంగా కోట్ చేయగా, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ స్వల్పంగా తగ్గింది. అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 0.52 శాతం పెరిగి 64.24 డాలర్లకు చేరుకుంది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం నాడు 3,798.71 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్ లోడ్ చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పడిపోయాయి.
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం పాక్, పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. అయితే పాకిస్తాన్ భారత్ పైకి కయ్యానికి కాలు దువ్వడంతో మూడు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి.
యుద్ధ భయాలతో 30 షేర్ల బీఎస్ఈ బెంచ్ మార్క్ 880.34 పాయింట్లు లేదా 1.10 శాతం పడిపోయి 79,454 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 265.80 పాయింట్లు లేదా 1.10 శాతం తగ్గి 24,008 పాయింట్ల వద్ద ముగిసింది.
Next Story