
వీధికుక్కలకు ఆహారం పెట్టడం నిషేధం
మంచి వీధికుక్కలకు సుప్రీంకోర్టు ఉరట
మంచిగా ప్రవర్తించే ఊరకుక్కలకు సుప్రీంకోర్టు ఉరట ఇచ్చింది. అదేవిధంగా కొంచెం అతిగా ప్రవర్తించే కుక్కలకు, దారినపోయే పిల్లలమీద దాడి చేసే స్వభావం కనబరి చేకుక్కలకు, రేబిస్ సోకినట్లు అనుమానం ఉన్న కుక్కలకు ఈ ఉరట లభించలేదు. వాటని తరలించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే, ఊర కుక్కలమీద సానుభూతి చూపి ఇష్టానుసారం ఆహారం అందించే వారిని శిక్షించాలని కూడా కోర్టు సూచించింది.
సూక్ష్మంగా చెబితే, వీధుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఊరకుక్కులకు ఆహారం పెట్టడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.
అధికారులు ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలాలలో మాత్రమే వీధి కుక్కలకు ఆహారం పెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల అవాంఛనీయ సంఘటనలు ఎదురువుతున్నాయని కోర్టు ఈ ఆదేశాన్ని జారీ చేసింది. వీధుల్లో నడిచే సామాన్య పౌరులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఊరకుక్కలకు ఆహారం అందించి ప్రోత్సహించడం మానుకోవాలని కోర్టు పేర్కొంది.
ఢిల్లీ-ఎన్‌సిఆర్ (Delhi-NCR) లోని వీధి కుక్కలను కుక్కలను వెంటనే ఆశ్రయా (Dog Shelters) లకు తరలించాలని, అడ్డుకునే వారిని అరెస్టు చేయాలని ఆగస్టు 11న ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఉత్తర్వులను ఈ రోజు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వి అంజరియాల ధర్మాసనం సవరించింది.
రేబిస్ సోకిన, రేబిస్ సోకినట్లు అనుమానం ఉన్న లేదా దూకుడుగా ప్రవర్తిస్తూ వీధుల్లో తిరిగే ప్రజల మీద దాడి చేస్తున్న కుక్కలను తప్ప మిగతా వాటిని పట్టుకున్నా వాటికి టీకాలు వేసి స్టెరిలైజేషన్ చేసిన తర్వాత, తీసుకెళ్లిన అదే చోటునే వదలేయాలని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది.
ఆగస్టు 11 నాటి ఉత్తర్వుల మీద దేశ వ్యాపితంగా నిరసన వ్యకమయిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఈ రోజు ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందుకు వచ్చింది.
"ప్రతి మున్సిపల్ వార్డులో వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడానికి ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేయాలి. ఈ పనిని మున్సిపల్ అధికారులు వెంటనే ప్రారంభించాలి. వార్డులోని వీధి కుక్కల జనాభాను దృష్టిలో ఉంచుకుని ఆహారం ప్రాంతాన్ని గుర్తించాలి. వీధి కుక్కలకు ఇక్కడ మాత్రమే ఆహారం పెట్టాలని హెచ్చరిక నోటీసు బోర్డులు ఉంచాలి. ఇతర ప్రదేశాలలో = వీధి కుక్కలకు ఆహారం పెట్టడం నిషేధం. ఈ నియమాన్ని ఉల్లంఘించి కుక్కలకు ఆహారం పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇష్టానుసారం ఉరకుక్కలకు ఆహారం వేస్తున్నందున వస్తున్న విపరీతపరిణామాలను అడ్డుకునేందుకు, ఇలాంటి అహారం అందించడాన్ని నియమంత్రించేందుకుతాము ఉ త్తర్వులు జారీచేస్తున్నాం ," అని ధర్మాసనం పేర్కొంది.