యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళః దౌత్యానికి వచ్చిన సౌదీ మంత్రి
x

యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళః దౌత్యానికి వచ్చిన సౌదీ మంత్రి

పాక్ ఎయిర్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం


భారత్- పాకిస్తాన్ దేశాలు యుద్ధానికి సన్నద్ధమైన వేళ సౌదీ అరేబియా దౌత్యానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాకు చెందిన విదేశీ వ్యవహారాల మంత్రి హఠాత్తుగా న్యూఢిల్లీకి వచ్చారు. ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ జూనియర్‌ మంత్రి అదెల్‌ అల్‌జుబైర్‌ మే8వ తేదీ రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో చర్చలు జరిపారు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే చర్యల్లో భాగంగా ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఎక్స్‌వేదికగా పోస్టు చేశారు.
‘‘సౌదీ అరేబియా మంత్రి అదెన్‌ అల్‌ జుబైర్‌తో సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత్‌ దృక్కోణాన్ని ఆయనకు వివరించాను’’ అని జైశంకర్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సౌదీ మంత్రితో భేటీ జరిగింది. ఆ తర్వాత ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్ఛితో మన విదేశాంగ మంత్రి భేటీ అయ్యారు. ఇప్పటికే భారత్‌-పాక్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు తాము సిద్ధమని ఇరాన్‌ వెల్లడించింది. ఇటీవల ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘‘సోదరుల్లాంటి పొరుగుదేశాలే మాకు అత్యున్నత ప్రాధాన్యం’’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. భారత్‌, పాక్‌లోని తమ దౌత్యకార్యాలయాల సహకారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గిస్తామని పేర్కొన్నారు.
పాక్ ఎయిర్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం
పాకిస్తాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాక్ మిస్సైల్స్ నిర్వీర్యం చేసిన భారత్ పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం చేసింది. పాక్ లోని కీలక నగరాలే టార్గెట్‌గా భారత్ డ్రోన్ల దాడి చేస్తోంది. అయితే, ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌పై విదేశాంగ, రక్షణ శాఖ సంయుక్తంగా ప్రెస్‌మీట్ నిర్వహించి సంచలన విషయాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ గురించి మహిళా అధికారి కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. భారత్‌పై జరిగిన ప్రతి దాడిని తిప్పికొట్టామన్నారు.
Read More
Next Story