నిధులున్నా కనుమరుగవుతున్న సంస్కృత కళాశాలలు
x

నిధులున్నా కనుమరుగవుతున్న సంస్కృత కళాశాలలు

పట్టించుకోని ఉన్నత విద్యా శాఖ. తెలుగు బాషా పండితులు, జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతి రావు ఆవేదన


రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఎందరెందరో మహా పండితులను అందించిన సంస్కృత కళాశాలలు ప్రస్తుతం ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కెక్కి ఏడుస్తున్న చందంగా మారుతున్నాయని తిమ్మసముద్రం శ్రీ గోరంట్ల వెంకన్న కళాశాల విద్యార్థి సంఘ పూర్వ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు గుంటూరులో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సంస్కృ విద్యాబోధన మీద ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటన విశేషాలు:

1978 వరకు బాషా ప్రవీణ (తెలుగు), విద్యా ప్రవీణ (సంస్కృతం) కోర్సులుండగా ఆ తర్వాత నుంచి బి ఎ ఓ ఎల్ తెలుగు సంస్కృత కోర్సులు తొలి రెండేళ్ల లో ఇంగ్లీషు. సోషల్, ఆపై సోషల్ స్థానం లో ఏ ఐ టెక్నాలజీ కోర్సు చేర్చటం జరిగింది.
తొలిగా 1886 లో నెల్లూరు లో వేద - సంస్కృత కళాశాలను అనీ బిసెంట్ ప్రారంభించగా ...ప్రస్తుతం వందల కోట్లు ఆస్తులున్నా అధ్యాపకుల కొరతతో 2019 లో మూత పడింది.
తొలుత ఉమ్మడి రాష్ట్రంలో 60 కళాశాలలు ఉంటే ఏపీ లో 50 కళాశాలలు నడిచేవి. అలాంటిది ప్రస్తుతం కేవలం మూడే మూడు తిమ్మసముద్రం, కోవూరు జిల్లెళ్ళమూడి కళాశాలలు నిన్నా మొన్నటి వరకు ఎయిడెడ్ గా పనిచేస్తూ వచ్చాయి, ప్రస్తుతం రాష్ట్రం లో ఒక్క పెర్మనెంట్ లెక్చరర్ కూడా లేరు, కొత్త నియామకాలు లేవు, విజయనగరం లో ప్రభుత్వం, తిరుపతి లో టీ టీ డి నడుపుతున్నది.

నిమ్మరాజు చలపతిరావు

287 ఎకరాల మాగాణి భూములు కల్గిన ట్రస్ట్ తొలి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యలో నడుస్తూ వస్తున్న శ్రీ గోరంట్ల వెంకన్న కళాశాల ఈసురోమంటున్నది. రెండేళ్లుగా తెలుగు కోర్సు లేదు 80 మంది ఆడపిల్లలు ఉంటే సరైన హాస్టల్ వసతి లేరు. దీంతో పిల్లలు చేరుతున్నారు అర్ధాంతరంగా వెళ్లిపోతున్నారు. కేవలం సౌకర్యాల లేమి, దీనికి తోడు అధ్యాపకుల కొరత...ప్రస్తుతం ఐదుగురు కాంట్రాక్ట్ లెక్చరర్స్ మాత్రమే ఉన్నారు. మరో నలుగురు పార్ట్ టైమ్ వారిని నియమించడానికి ఈ ఓ మేన మేషాలు లెక్కిస్తున్నారు. పిల్లల్లకు భోజన ఖర్చులు కంటే అధికారులు, సిబ్బంది జీత భత్య వారి ఖర్చులే అధికమంటున్నారు. ఆలయాల జీర్ణోద్ధరణ కై ఒక్కో నియోజకవర్గానికి కనీసం రూ పది కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈ కళాశాలను ఎందుకు పట్టించుకోవటం లేదు.
కేవలం ఏడు ఎకరాల భూమి కలిగిన జిల్లెళ్ళమూడి సంస్కృత కళాశాల రెండు కోర్సుల లో జాతీయ స్థాయిలో 6 నాక్ అక్రెడిటేషన్ ఇతర గుర్తింపులు పొందాయి. కనీస సౌకర్యాలకు కొరత లేదు. గుంటూరు శారదా నికేతన్ కళాశాల ఇటీవలే దేవాదాయ శాఖ పరిధి నుంచి ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. తెలుగు కోర్సు ఒక్కటే ఉంది.
సంస్కృత కళాశాలలంటే మహా పండితులు ఏలూరుపాటి అనంత రామయ్య, చెరువు సత్యనారాయణ శాస్త్రి. శ్రీ కృష్ణ భగవాన్, బేతవోలు రామబ్రహ్మం, మైలవరపు శ్రీనివాసరావు, తాడేపల్లి పతంజలి, వొలుకుల శివశంకర్, రాంపిళ్ళ సోమయాజులు, శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి, కత్తి పద్మారావు, తాళ్లూరి ఆంజనేయులు, ఆర్ రామకోటేశ్వర శర్మ ఇలా ఎందరెందరో గుర్తుకువచ్చేవారు. అలాగే అష్టావధానాలు, శతావాదానులుగా మరెందరో ఉన్నతికెక్కారని ఏది ఏమైన ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మూడు సంస్కృత కళాశాలల అభివృద్ధి కి తోడ్పడాలని నిమ్మరాజు కోరారు.


Read More
Next Story