జై షా స్థానంలో బీసీసీఐ కి కొత్త కార్యదర్శిగా సైకియా
x

జై షా స్థానంలో బీసీసీఐ కి కొత్త కార్యదర్శిగా సైకియా

ఆ అస్సాం మాజీ క్రికెటర్ ఎవరంటే..


ముంబైలో జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో దేవజిత్ సైకియా కోశాధికారిగా, ప్రభతేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఎన్నికయ్యారు. బీసీసీఐ ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ రెండు స్థానాలకు వీరిద్దరు మాత్రమే పోటీకి దిగారు. ఎన్నికల సంఘం మాజీ సీఈసీ అచల్ కుమార్ జ్యోతి మంగళవారం వీరి జాబితాను ఖరారు చేశారు.

జై షా స్థానంలో సైకియా..
గత ఏడాది డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ గా జై షా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి బీసీసీఐ కి తాత్కాలిక కార్యదర్శిగా సైకియానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు ఆయన బీసీసీఐకి జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్నారు.
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఖాళీ పోస్టు ఉంటే దాన్ని 45 రోజుల్లోపు ఎస్జీఎం ను సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా భర్తీ చేయాలని నిర్దేశిస్తుంది. తాజాగా జరిగిన సమావేశం 43 వ రోజున జరిగింది. ఇంతకుముందుఈ స్థానాన్ని మహారాష్ట్ర మంత్రి ఆశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు క్యాబినేట్ బెర్త్ దక్కడంతో సైకియా ఎన్నిక సుగమం అయింది.
ఎవరూ సైకియా?
సైకియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్. 1990-91 లో సీజన్ లో అస్సాం తరఫున నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడారు. తన కెరీర్ లో 53 పరుగులు మాత్రమే చేశాడు. 2109 నుంచి అస్సాం నుంచి అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. అలాగే అస్సాం క్రికెట్ అసోసియేషన్ కు ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. తనకు అడ్మినిస్ట్రేటర్ గా ఉండాలనే లక్ష్యం లేదని, అయితే అస్సాం క్రికెట్ లోకి అవినీతి ప్రవేశించడంతో తాను బరిలోకి దిగానని చెప్పుకొచ్చాడు.
పరస్పర ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు..
బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా సైకియా బాధ్యతలు స్వీకరించిన తరువాత అసోం ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు లేఖ రాశారు. అడ్వకేట్ జనరల్ గా ఉన్న దేవాజిత్ తాత్కాలిక కార్యదర్శిగా ఉండటం నిబంధనలు ఉల్లంఘించడమే అని ఆరోపించారు.
అస్సాం అధికారాలను ఉల్లంఘిస్తూ లాభదాయక పదవులను అనుభవిస్తున్నారని చెప్పారు. ఐసీసీ ఆర్టికల్స్, మోమోరాండం ఆఫ్ అసోసియేషన్ ప్రకారం దేవజిత్ లోన్ సైకియాను ఐసీసీ డైరెక్టర్ల బోర్డుగా నియమించడం ఏంటనీ కాంగ్రెస్ నాయకుడు తన లేఖలో ప్రస్తావించారు.


Read More
Next Story