
అమరావతి కోర్ క్యాపిటల్ లో రిపబ్లిక్ వేడుకలు
గణతంత్ర దినోత్సవ వేడులకు రిహార్సల్స్ ఎంతో గొప్పగా జరిగాయి.
అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియా రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబైంది. పచ్చని ఆహ్లాదకర వాతావరణంతో సుందరంగా పెరేడ్ గ్రౌండ్ ను అభివృద్ధి చేశారు. విశాల ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు ఈ ప్రదేశాన్ని వేడుకలకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26 సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఈ వేడుకల్లో పాల్గొనేవారికి మరచిపోలేని అనుభూతి అందిస్తాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్, అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయాధిపతులు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు హాజరవుతారు. శనివారం ఉదయం పెరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ ఆకట్టుకునేలా సాగింది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి జే శ్యామలరావు హాజరై పరేడ్ పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్ సుస్మిత పెరేడ్ కమాండర్ గా వ్యవహరించారు. డీజీపీ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు.
పెరేడ్ లో వివిధ దళాలు అద్భుత కవాతు ప్రదర్శనలు చేశాయి. కమాండర్లు ఇండియన్ ఆర్మీ నాయిబ్ సుబేదార్ ఎల్ కే ప్రసాద్, కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ జీవీ రామిరెడ్డి, సీఆర్పీఎఫ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ చెన్వీర్ గౌడ్, కేరళ ఆర్మ్డ్ పోలీస్ సీవీ జన్ సాన్, విశాఖపట్టణం ఏపీఎస్పీ 16వ బెటాలియన్ ఎస్వీ రమణ, ఏపీ బ్రాస్ బాండ్ టీవీ రమణ, ఏపీఎస్పీ 11వ బెటాలియన్ ఎస్ శ్రీనివాసులు, ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఇండియన్ ఆర్మీ పైప్ బాండ్ సుబేదార్ మొహంతీ, జీవీ సుబ్బారావు, ఎన్సీసీ బాయ్స్ జయంత్ వర్లోత్, ఎన్సీసీ గర్ల్స్ రేవతి, ఏపీ సోషల్ వెల్ఫేర్ కే సునీత్ కుమార్, భారత్ స్కౌట్స్ గైడ్స్ వై ఇషాక్ రాజు, ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం యూత్ రెడ్ క్రాస్ పి సాయి రోహిత్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రతిబింబించేలా 22 శకటాలు ప్రదర్శించారు. కీలక థీమ్స్ వందేమాతరం 150 వసంతాలు సాంస్కృతిక శాఖ పేదరికం లేని సమాజం, ప్రణాళికా శాఖ, సెర్ప్, జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యా శాఖలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, నైపుణ్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పాఠశాల విద్యా శాఖ, పరిశ్రమలు, పర్యాటక శాఖలు, నీటి భద్రత, జలవనరులు, మైక్రో ఇరిగేషన్, అటవీ శాఖలు పాల్గొన్నాయి.
రైతు వ్యవసాయ, సాంకేతికత వ్యవసాయ, మత్స్య శాఖలు, ప్రపంచ ఉత్తమ లాజిస్టిక్స్ మౌలిక వసతులు, పెట్టుబడులు, సముద్ర వైమానిక రంగాలు, సీఆర్డీఏ వ్యయ అత్యుత్తమీకరణ, నెడ్కాప్, ఇంధనం ఉత్పత్తి పరిపూర్ణత, చేనేత జౌళి, ఉద్యానవన శాఖలు, స్వచ్ఛ ఆంధ్ర, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు, జీవితం అన్ని రంగాల్లో లోతైన సాంకేతికత ఆర్టీజిఎస్ శాఖ రిహార్సల్ లో గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలు జాతీయ ఉత్సవం మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని ప్రతిబింబించే వేదికగా మారుతాయి. ప్రజల్లో దేశభక్తి పెంచి సమాజ సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని హైలైట్ చేస్తాయి.

