ఏపిలోని అచ్యుతాపురం సెస్ లో రియాక్టర్ పేలి 16 మంది దుర్మరణం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. సుమారు 50మందికి పైన గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. వారిలో పదిమందిని గుర్తించారు. ఈ భారీ ప్రమాదంలో మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన నేటి మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.రియాక్టర్ పేలుడులో గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా సంతాపం ప్రకటించారు.. రియాక్టర్ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద ఉన్న ఎస్ ఈ జెడ్ (SEZ) లో ఎసెన్షియ ఫార్మా కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలో మధ్యాహ్నం రియాక్టర్ పేలినట్లు తెలిసింది. దీంతో సమీపంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆ ధాటికి మరణించినట్లు సమాచారం అందింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో.. ప్లాంట్ ఏజీఎం సన్యాసినాయుడు, ల్యాబ్ హెడ్ రామిరెడ్డి, కెమిస్ట్ హారిక, ప్రొడక్షన్ ఆపరేటర్ పార్థసారథి, ప్లాంట్ హెల్పర్ వై. చిన్నారావు ఆపరేటర్ ఆపరేటర్లు గణేష్, మోహన్, ప్రశాంత్, ఎం నారాయణ, పి. రాజశేఖర్ మృతుల్లో ఉన్నట్లు గుర్తించారు. మరో నలుగురు మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి..
పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ధాటికి పైకప్పు కోరడంతో శిబిరాలకు కింద చాలామంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. శిథిలాలు తొలగించడం ద్వారా వాటి కింద చిక్కుకుపోయిన కార్మికులు, ఉద్యోగులను రక్షించడానికి ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రియాక్టర్ పేలుడుతో ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో అగ్నిమాపక దళంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెలుడు వల్ల తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి రేపు అనకాపల్లి పయనం
సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రేపు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి బుధవారం నిరంతరం సమీక్ష చేశారు. సహాయక చర్యలపై జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. హెల్త్ సెక్రటరీతో మాట్లాడి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులను వినియోగించాలని ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంపై ఉన్నత స్ధాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణ ఆధారంగా...ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.
అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి టి.జి భరత్