మాటకు కట్టుబడ్డ రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా..ఏం చేశారంటే..
x

మాటకు కట్టుబడ్డ రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా..ఏం చేశారంటే..

రాజకీయాల్లో మాట మీద నిలబడే వ్యక్తులూ ఉంటారు. అలాంటి వారిలో రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి కిరోడి లాల్ మీనా ఒకరు. ఇంతకూ ఆయన ఏం చేశారంటే..


రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను 10 రోజుల క్రితమే ఆయన ముఖ్యమంత్రికి పంపినట్లు సమాచారం.

కారణం అదే..

కిరోడి లాల్ మీనా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు ఒక మాట అన్నారు. తూర్పు రాజస్థాన్‌లోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాలు - దౌసా, భరత్‌పూర్, ధోల్‌పూర్, కరౌలి, అల్వార్, టోంక్-సవాయిమాధోపూర్, కోట-బుండి స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ప్రధాని మోదీ తనకు అప్పగించారని, వీటిల్లో ఏ ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓడిపోయినా తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

తన నియోజకవర్గం దౌసాతో సహా కొన్ని స్థానాలను బీజేపీ ఓటమి పాలైంది. దాంతో మాటకు కట్టుబడి ఆయన రాజీనామా చేశారు.

గత ఏడాది చివర్లో కాంగ్రెస్‌ను ఓడించి రాజస్థాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నా.. జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.

Read More
Next Story